Pawan Kalyan : రోజురోజుకి పవన్ కళ్యాణ్ పై మహిళలు, వృద్దుల్లో నమ్మకం పెరుగుతుందా..!

By manavaradhi.com

Updated on:

Follow Us

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి ఆయన అవినీతి పరుడుకాదు, డబ్బుకోసం రాజకీయాల్లోకి రాలేదు, పేరుకోసం అంతకన్నకాదు… మరి అధికారపార్టీ నేతలకు ఏఅవకాశంలేక నోటికి వచ్చినట్లు బురుదజల్లుతున్నారు. పవన్ కళ్యాణ్ మూడేసి పెళ్లిళ్లు చేసుకున్నాడు మహిళలంటే గౌవరం లేదు అంటూ విమర్శించే వాళ్ళు సైతం ముక్కున వేలు వేసుకునే విధంగా ఆడపిల్లలు, మహిళలు, వృద్ధులు ఎక్కడికి వెళ్ళిన పవన్ కు నీరాజనాలు పడుతున్నారు.

చాలా మంది అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ పేరు చెపితే ఆయన అభిమానులు అంతా యువకులే… సైలెన్సర్లు తీసి గోల చేస్తూ బైక్ ర్యాలీలు చేసే కుర్రకారు మాత్రమే అని ఇప్పటివరకు ప్రోజెక్ట్ చేస్తూ వస్తున్న వాళ్లకి… ఇది చేదు వార్తె అని చెప్పాలి ఎందుకంటే… ఆయను ఎక్కువగా ఇష్టపడేవారిలో ఆడపిల్లలు, మహిళలు, వృద్ధులు ఎక్కువతున్నారు. పవన్‌ని అందరూ ఇష్టపడడానికి ప్రధాన కారణం అతనిలో ఉన్న సేవాభావం. ఎదుటవారికి కష్టమొస్తే నేనున్నానంటూ చేయూతనిస్తాడు. సినీ పరిశ్రమలో డబ్బు సంపాదించడమే అనుకుంటే ఇప్పటికి వేల కోట్లు సంపాదించేవాడు.

ఇప్పటి వరకు జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది మొదలు పాలనపరమైన విధానాలపై పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక… పవన్ వ్యక్తిగత జీవితంపై అటాక్ చేయడం లాంటివే చూసాం. కానీ ఆయన ఎప్పుడు ఇతరుల వ్యక్తి గత జీవితంలోకి తొంగి చూడలేదు.. పోరపాటున కూడా మాట తూలలేదు అంటే పవన్ వ్యక్తిత్వం ఎలాంటిదో మనం చూడవచ్చు. ఆయనను, ఆయన ఫ్యామిలీని వ్యక్తిగతంగా ఎన్ని దూషణలు చేసిన సరే పవన్ నిజాయితీకి ప్రజలు పట్టం కడుతున్నారు.

చట్టపరంగా విడాకులు తీసుకోవడం నేరమా…? చట్ట వ్యతిరేకంగా నాలుగురితో తిరిగేవాళ్ల బండారులు బయట పెడతానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుపెట్టుకుంటున్నారు. అందుకేనేమో మహిళలు పవన్ కళ్యాణ్ కు హారతులు పట్టి నీరాజనాలు అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను అంత ఆరాధించకపోతే 9 నెలల చంటి బిడ్డను ఆశీర్వదించమని పవన్ కి అందిస్తారా … ఆ విజువల్స్ వస్తే ఎవరికైనా గూజ్ బంప్స్ రావాల్సిందే.. వృద్ధులు,ఆడపిల్లలు పవని చూడటానికి క్యూ కడుతున్నారు అడుగడుగున హారతులు ఇవ్వడం ఇక సరాసరి….!

మహిళామణుల నుంచే వివరాలు సేకరిస్తే.. వారు చెప్పేది ఒక్కటే.. మూడు పెళ్లిళ్లు చేసుకుని ఏ ఒక్కరిని మోసం చేయలేదు. అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు కలిసి కష్టంగా ఉండేదానికన్నా ఇష్టంగా విడిపోయి స్నేహంగా ఉండడమే మంచిదన్న అభిప్రాయం పవన్‌ది. అలాగని తననుంచి విడిపోయే భార్యని ఏ విధమైన ఇబ్బందులకు గురిచేయలేదు. అందుకే పవన్‌ అంటే మహిళల్లో అంత క్రేజ్‌ అంటున్నారు. అందుకేనేమో 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే జనసేనకు మహిళా ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. జనసేన పార్టీకి ప్రత్యేక బలం వీర మహిళలే ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ ను ఒక్క మాట అననివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎవరన్నా నోరు జారితే… శివంగుళ్లా కన్నెర్ర చేస్తున్నారు. వీర మహిళలు చేస్తున్న పోరాటాలకు పవన్ మద్దతును అందజేస్తూ వారికి ప్రత్యేక గుర్తింపునిస్తున్నాడు…! జనసేన ఓటింగ్ పర్సంటేజ్ పెరగడంలో ప్రధాన పాత్ర కూడా..ఈ మహిళా మణులదే..

మనిషికి గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే అతనిలో ఉన్న నిజాయితీ, నిబద్ధత, సేవాగుణం ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని ఎవరైనా ఇష్టపడతారు.. జనసేనుడి నిజాయితీ, ప్రశ్నించే తత్వం ఆయనలో ఉన్న దూకుడు, నాయకత్వ లక్షణాలు, బాధితులకు అండగా నిలబడటం, సహాయం కోసం వచ్చిన వారిని… ఆదరించటం, తన మనుగడ కోసం సంపాదన మొత్తం పార్టీకి ఖర్చు చేయడం, నిరాడంబరత, సొంత లాభం మానుకొని… కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశానికి అండగా నిలబడటం ఇలాంటి లక్షణాలు భూతద్దం పెట్టి వెతికిన ఒక పవన్ కళ్యాణ్ లొ తప్ప ఎవరిలోను కనిపించవు అందుకే మహిళలతోపాటు… వృద్ధులు మరి ముఖ్యంగా అనగారిన వర్గాలు,బాధితులు,తటస్తులు పవన్ కళ్యాణ్ ను ఇంతలా ఇష్టపడుతున్నారు.

Leave a Comment