Tea Bags – టీ బ్యాగులతో అందం మీ సొంతం

By manavaradhi.com

Published on:

Follow Us
Surprising Uses for Tea Bags

టీ తాగడానికి చాలామంది టీ బ్యాగులను ఉపయోగిస్తారు. మంచి నాణ్యమైన టీ బ్యాగులను వాడితే… ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. అందాన్ని మెరుగుపరచుకోవడం మొదలు…ఆరోగ్యానికి…శానిటైజర్ గా బహు విధాలుగా ఉపయోగపడుతుంది. టీ బ్యాగ్స్ తో అనేక ప్రయోజనాలున్నాయి.

టీ బ్యాగులతో అందం, ఆరోగ్యం చక్కగా కాపాడుకోవచ్చు. ఇవి కళ్లకు రిలాక్సేషన్ అందిస్తాయి. టీ బ్యాగ్స్ ని ఉబ్బిన, నొప్పి పుడుతున్న కళ్ల మీద పెట్టడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వెంటనే ఫలితం కనిపిస్తుంది. దీనికోసం వాడేసిన టీ బ్యాగ్స్ ని ఫ్రిజ్ లో పెట్టి కాస్త చల్లబడిన తర్వాత కళ్లపై పెట్టుకొని ఒక అరగంట పాటు రిలాక్స్ అవ్వాలి. ఇది మీ కళ్ల వాపు, నొప్పిని తొలగించేస్తుంది.

టీ బ్యాగ్ లో మిగిలిన మిశ్రమాన్ని ఫేస్ స్క్రబ్ గా ఉపయోగించవచ్చు. ఇది ముఖంపై ఉన్న రంధ్రాలను చిన్నగా మారుస్తుంది. ముఖానికి అందమైన మెరుపును అందిస్తుంది. డార్క్ సర్కిల్స్ నిజంగా విసుగును కలిగిస్తాయి . ఇవి అందాన్ని పాడుచేస్తాయి మరియు చాలా తక్కువ ఆకర్షణీయమైనవిగా చేస్తాయి. ఈ సమస్యకు ఒక ఎఫెక్టివ్ అండ్ స్మార్ట్ పరిష్కార మార్గం, చల్లటి టీ బ్యాగ్స్ ను నల్లని వలయాలున్న ప్రదేశంలో అప్లై చేయాలి.

సన్ బర్న్ నివారించడంలో టీ బ్యాగులు చక్కగా సహాయపడతాయి. వేడి వాతావరణంలో జీవించే వారికి సన్ బర్న్ తగలడం చాలా సహజం. ప్రయాణం చేసే సమయంలో ఎన్ని సన్ స్క్రీన్స్ అప్లై చేసినా, లేదా గొడుగు వెంట తీసికెళ్ళినా..ఏదో ఒక విధంగా చర్మం సన్ బర్న్ కు గురికాకతప్పదు . అందుకు చాలా మంది నిపుణులు ఇంటికి చేరుకోగానే ముఖాన్ని శుభ్రం చేసుకోమని సలహాలిస్తుంటారు. అయితే చర్మం సూర్య రశ్మికి గురైనప్పుడు, టీబ్యాగ్స్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. టీబ్యాగ్స్ ఉపయోగించిన తర్వాత వాటిని చల్లబరిచి సన్ బర్న్ గురైన చర్మం మీద జస్ట్ అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవడం వల్ల చాలా ఉపశమనం కలిగిస్తుంది.

చర్మం మీద దద్దుర్లు ఉన్నట్లైతే , ఈ సమస్యకు చాలా త్వరగా పరిష్కార మార్గం టీబ్యాగ్స్. ముఖ్యంగా చర్మ వ్యాధులైన ఎక్జిమా వంటి చర్మవ్యాధులకు చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ . చాలా సింపుల్ గా వాడిని టీ బ్యాగ్స్ చల్లబడిన తర్వాత ఎఫెక్టెడ్ ప్రదేశంలో టీబ్యాగ్స్ అప్లై చేయడం వల్ల మీరు ఖచ్చితంగా ఉపశమనం పొందుతారు. గ్రీన్ టీ ఆకులతో తయారు చేసిన స్క్రబ్ జిడ్డుగల చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది మరియు బ్లాక్ హెడ్స్ వదిలించుకోవడానికి సహాయపడుతుంది. టీ బ్యాగ్‌ని తెరిచి, 1 టీస్పూన్ ఆకులను కొద్దిగా నీటితో కలిపి పేస్ట్ వచ్చేవరకు కలపండి. పేస్ట్‌ను 2 నుండి 3 నిమిషాల పాటు మెత్తగా స్క్రబ్ చేయండి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. తర్వాత మీ ముఖాన్ని ఆరబెట్టి మాయిశ్చరైజర్ ఉపయోగించండి.

చిన్న చిన్న గాయాలకు చికిత్స చేయడానికి టీ బ్యాగులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. బ్లాక్ టీ డ్రెస్సింగ్‌లు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి మరియు చిన్న గీతలు లేదా గాయాల వల్ల వాపును తగ్గించడంలో సహాయపడతాయి. టీ బ్యాగ్ తెరిచి, టీని ఆవిరి చేసి చల్లబరచండి, తర్వాత గాయపడిన ప్రదేశంలో కొన్ని నిమిషాలు నొక్కండి. తర్వాత వచ్చే నొప్పి మరియు దురదపై టీ బ్యాగ్ పని చేస్తుంది. బ్యాగ్‌ను తడిపి, బయటకు తీసి, ప్రభావిత ప్రాంతంపై 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచండి. పంటి నొప్పి ఉంటే, వెచ్చని పిప్పరమింట్ టీ బ్యాగ్ మీ దంతాలు మరియు చిగుళ్ళకు వ్యతిరేకంగా ఉంచినట్లయితే కొంత సౌకర్యాన్ని అందిస్తుంది. మరియు టీలోని యాసిడ్ రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. కాబట్టి టీ బ్యాగ్‌పై కొరికితే మీరు పంటిని లాగిన తర్వాత రక్తస్రావాన్ని నియంత్రించవచ్చు.

బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించంలో సహయపడతాయి. టీ బ్యాగ్‌ని గోరువెచ్చని నీటితో తడిపి గట్టిగా పిండి దాన్ని 15 నిమిషాలు, రోజుకు నాలుగు సార్లు ఆ ప్రదేశానికి అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణను పెంచి, త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుందని పరిశోధనలో తేలింది. టీ బ్యాగ్స్ లో ఉన్న మిశ్రమాన్ని నీటిలో కలిపి దాన్ని గార్డెన్ లోని మట్టిలో కలిపి ఉంచడం వల్ల ఇది గార్డెన్ కి ఎరువుగా ఉపయోగించవచ్చు. దీనికోసం టీ బ్యాగ్స్ తొలగించి.. అందులోని టీ మిశ్రమాన్ని మొత్తం నీటిలో కలిపి మట్టిలో వేయాలి. దీంతో మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి

టీ బ్యాగులు వాడిన తర్వాత అలాగే చెత్త బుట్టలో పడేస్తుంటారు. ఎప్పుడో ఒకసారి తాగే వారి పరిస్థితి అయితే ఫర్వాలేదు కానీ తరచూ టీ తాగే వారికి ఇలా వాడి పడేసే బ్యాగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని అలాగే చెత్తలో పడేసే బదులు వీటిని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు.

Leave a Comment