సడెన్ గా బ్రష్ చేస్తున్నప్పుడు చిగుళ్ళ నుండి రక్తస్రావాన్ని చూస్తే భయమేస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా మందికి ఓరల్ హెల్త్ గురించి చాలా మందికి తెలియదు. మన రోజూ బ్రష్ చేసి దంతక్షయం నుండి దంతాలను కాపాడుకుంటాము. మరి చిగుళ్ళ సంగతేంటి? నోట్లో బ్యాక్టీరియా వల్ల చిగుళ్ళు వాపు, చిగుళ్ళ నుండి రక్తస్రావం జరుగుతుంది. మరీ చిగుళ్ళలోంచి రక్తం కారకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
మన దేశంలో చిగుళ్ళ జబ్బులతో బాధపడే వారు సంఖ్య ఎక్కువే. పళ్ళ నుంచి రక్తస్రావం కావడం అనేది కేవలం చిగుళ్ళ సమస్య మాత్రమే కాదు. శరీరంలోని ఇతర అనారోగ్యాలు కూడా చిగుళ్ళ రక్తస్రావానికి కారణం అవుతాయి. అప్పుడప్పుడు చిగుళ్ళు నుంచి రక్తం కారడం చిన్న పాటి ప్రమాదాల వల్ల జరగవచ్చు.
గట్టి వస్తువు చిగుళ్ళకు తగలడం, చిగుళ్ళు సాధారణంగా ఉండే ప్రదేశం నుంచి కదలడం లాంటివి జరగవచ్చు. కానీ ఎప్పుడూ చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటే, సమస్య తీవ్రంగా ఉందనే విషయాన్ని గుర్తించడం తప్పనిసరి. చిగుళ్ళ నుంచి రక్తం అధికంగా కారుతుంటే అనే చిగుళ్ళ వ్యాధులు,పంటి సమస్యలు, సరైన నోటి శుభ్రత లేకపోవడం, చిగుళ్ళ వాపు లాంటి ఎన్నో కారణాలు చిగుళ్ళు నుంచి రక్తం కారడానికి కారణం అవుతాయి.
చాలా మంది చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరిగిన వెంటనే దాన్ని గుర్తించలేక అశ్రద్ధ చేస్తూ వస్తారు. దీని వల్ల పళ్ల మీద బ్యాక్టీరియా, గార లాంటివి పేరుకుపోయి సమస్యలు ఎక్కువ అవుతాయి. రోజూ పళ్లను పూర్తిగా తోమడం ద్వారా క్యావిటీస్ తో పాటు, పంటి మీద ఉండే బ్యాక్టీరియా నుంచి రక్షణ పొందవచ్చు. చిగుళ్ల మీద పాచి పేరుకుపోవడం వల్ల, ప్లాస్ ను సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల చిగుళ్ళ సమస్యలు ఎక్కువ అవుతాయి.
చిగుళ్ళు వాచి ఉండడం, నోరు… చిగుళ్ళు… గొంతు నుంచి రక్తస్రావం కావడం లాంటివి ఈ సమస్యను పూర్తిగా గుర్తించే లక్షణాలు. విటమిన్ సి మరియు కె లోపం ఉన్న వాళ్ళలో సులభంగా చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అందుకే చిగుళ్ళ సమస్య ప్రారంభం కాగానే ముందుగా విటమిన్ లోపాన్ని తర్వాత దంత సమస్యలను పరిక్ష చేయించుకుని, ఆ తర్వాతే మిగిలిన సమస్యల గురించి ఆలోచించవలసి ఉంటుంది. సమస్య ఇదే అయితే వైద్యుని సూచన మేరకు, విటమిన్స్ ఉండే ఆహారాన్ని తీసుకుని సులభంగా పరిష్కారాన్ని పొందవచ్చు.
చిగుళ్ళలోంచి రక్తం వస్తుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
పళ్ళను శుభ్రంగా ఉంచుకోవడం ఒక్కటే చిగుళ్ళ సమస్యల నుంచి బయటపడే ప్రధాన మార్గం. ఏడాదికి కనీసం రెండు మార్లు దంతవైద్యుని సంప్రదించి, పళ్ళను శుభ్రం చేయించుకుంటూ ఉండాలి. పంటికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా, అవి ముందుగా తెలుస్తాయి గనుక… వెంటనే పరిష్కారం పొందడం సులభం అవుతుంది. పంటి శుభ్రత కోసం సరిగా బ్రష్ చోసుకేవడం కూడా ముఖ్యమే. రోజుకు కనీసం రెండుసార్లు బ్రష్ చేసుకుటూ ఉండాలి. దీని వల్ల చిగుళ్ళ నుంచి రక్తం కారే సమస్య చాలా వరకూ తగ్గుతుంది.
యాంటీ సెప్టిక్ మౌత్ వాష్ సైతం వాడుతూ ఉండాలి. దీనివల్ల కూడా చిగుళ్ళ సమస్యలు చాలా వరకూ తగ్గుముఖం పడతాయి. పళ్లు తోముకునే బ్రష్ ను కూడా కనీసం నెలకు ఓ సారి మారుస్తూ ఉండాలి. ఏడాదికి రెండుమార్లు పంటి వైద్యుని కలవడం వల్ల, పంటి సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని పొందవచ్చు.
ఇంట్లోనే కొన్ని ఓరల్ హైజీనిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్య వచ్చినట్టయితే దంతాలు పుచ్చిపోయి ఊడిపోవడమేకాకుండా చిగుళ్ల వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నొటి సమస్యల్ని అశ్రద్ధ చేయకుండా వైద్యున్ని సంప్రదించి తగిన చిక్సిత చేయించుకోవాలి.