Health Tips: మధుమేహం మీ జీర్ణవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది

By manavaradhi.com

Published on:

Follow Us
Diabetes Effects

ఇన్సులిన్‌ హార్మోన్‌ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజమే డ‌యాబెటిస్‌. రక్తంలో అధిక గ్లూకోజ్‌ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అతిమూత్రం, దాహం ఎక్కువగా వేయడం, అతిగా ఆకలి వేయడం, మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం వంటి లక్షణాలు క‌నిపిస్తాయి. సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. అన్ని రకాల మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్‌ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. మ‌ధుమేహం జీర్ణ‌వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూప‌డం వ‌ల‌న గ్యాస్ట్రోపెరెసిస్ అనే వ్యాధి మ‌న‌ల్ని చుట్టుముడుతుంది. ఈ స‌మ‌స్య ఉన్న‌వారిలో ఛాతీభాగంలో మంట‌, వికారం, వాంతులు, బ్ల‌డ్ షుగ‌ర్‌ను కంట్రోల్ చేయ‌లేక‌పోవ‌డం, కొంచెం తిన‌గానే క‌డుపు నిండిపోయిన ఫీలింగ్‌, త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గిపోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

మధుమేహం ఉన్న వారికి, రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉంటుంది. కాలక్రమేణా, అధిక రక్త గ్లూకోజ్ స్థాయిలు వేగస్ నాడిని దెబ్బతీయవచ్చు. కడుపు నుండి చిన్న ప్రేగు వరకు ఆహార కదలికను నిదాన పరిచే లేదా ఆపే ఒక రుగ్మత గ్యాస్ట్రోపెరెసిస్ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. గ్యాస్ట్రోపెరెసిస్ యొక్క అత్యంత సాధారణ లక్షణాలు.. వికారం, కేవలం చిన్న మొత్తం ఆహారం తిన్నతర్వాత ఉబ్బరంగా అనిపిస్తుంది. అలాగే జీర్ణంకాని ఆహారాన్ని వాంతి చేసుకోవడం వంటివి క‌నిపిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి నేరుగా సాధారణ కడుపు ఖాళీ అవడంతో జోక్యం చేసుకుంటుంది. కాబట్టి మధుమేహం ఉన్న వారిలో బ్ల‌డ్‌ గ్లూకోజ్ నియంత్రణ అనేది చాలా ముఖ్యమైనది. అయితే, గ్యాస్ట్రోపెరెసిస్ రక్త గ్లూకోజ్ నియంత్రణను కష్టతరం చేయవచ్చు. చిన్న ప్రేగులోకి ప్రవేశించి గ్రహించబడినప్పుడు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. టైప్ 1 డయాబెటిస్‌లో సాధార‌ణంగా క‌నిపిస్తుంది.

గ్యా స్ట్రోపెరెసిస్ స‌మ‌స్య ఉన్నట్టు గుర్తించేందుకు బేరియం ఎక్స్‌రే, బేరియం బీఫ్‌స్టీక్ మీల్‌, రేడియోఐసోటోప్ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ స్కాన్ , గ్యాస్ట్రిక్ మోనోమెట్రీ, ఎల‌క్ట్రోగ్యాస్ట్రోగ్ర‌ఫీ, ఆల్ట్రాసౌండ్ వంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. దీన్ని పూర్తిగా న‌యం చేయ‌లేం కానీ తిర‌గ‌బెట్ట‌కుండా చూసుకోవ‌చ్చు. బ్ల‌డ్ సుగ‌ర్‌ను కంట్రోల్ చేయ‌డం ద్వారా జీర్ణ‌వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం లేకుండా చూసుకోవచ్చు. ఈ స‌మ‌స్య ఉన్న‌వారు త‌రుచుగా ఇన్సులిన్ తీసుకోవాలి. లేదంటే వారు తీసుకొనే ర‌కాన్ని మార్చాలి. ఇన్సులిన్‌ను భోజ‌నం ముందుకు బ‌దులుగా భోజ‌నం త‌ర్వాత తీసుకోవాలి. తిన్న త‌ర్వాత గ్లూకోజ్ స్థాయిల‌ను ప‌రీక్షించి అవ‌స‌ర‌మైతే ఇన్పులిన్ తీసుకోవాలి. కొన్నిసార్లు ఆహారపు అలవాట్లను మార్చడం అనేది గ్యాస్ట్రోపెరెసిస్ లక్షణాల యొక్క తీవ్రతను నియంత్రించడానికి సహాయం చేయవచ్చు. రోజులో చాలా ఎక్కువ సార్లు త‌క్కువ మొత్తంలో ఆహారం తీసుకోవ‌డం చాలా మంచిది.

మధుమేహం వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవాలంటే అవగాహనే అసలైన మందు అని గుర్తించాలి. మధుమేహం వ్యాధికాదని, జీవితకాల జీర్ణక్రియ లోపం మాత్రమేనని సెల‌విస్తున్నందున.. ఆయా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే వెంట‌నే వైద్యం తీసుకొని బ్ల‌డ్ గ్లూకోజ్ స్థాయిల‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డం స‌ర్వ‌త్రా శ్రేయ‌స్క‌రం.

Leave a Comment