Potassium Rich Foods – రోజూ తినాల్సిన పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Potassium Rich Foods

మనం నిత్యం తీసుకునే అనేక రకాల ఆహారాల్లో ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే. అలాంటి పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఇది మన శరీరంలో అనేక పనులను నిర్వర్తించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కండరాల కదలికలకు, నరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ద్రవాలు నియంత్రణలో ఉండేందుకు పొటాషియం అవసరం అవుతుంది. కాగా నేటి తరుణంలో చాలా మంది సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల వారిలో పొటాషియం లోపం వస్తున్నది. దీంతో వారు పలు అనారోగ్యాల బారిన కూడా పడుతున్నారు. పొటాషియం అధికంగా ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వల్ల వీటిని నుంచి బయటపడవచ్చు.

మన శరీరానికి అత్యవసరమైన మూలకాలలో పొటాషియం ఒకటి. శరీరంలో పొటాషియం తగ్గితే గుండె, మూత్రపిండాలు, మెదడు, కండరాలు మొదలైన అవయవాలు పనితీరు దెబ్బతింటుంది. వీటి పనితీరు సరిగా ఉండాలంటే.. పొటాషియం అవసరం తప్పనిసరి. అర‌టి పండ్లు మ‌నకు సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా సంవ‌త్స‌రం పొడ‌వునా దొరుకుతాయి. వీటిల్లో పొటాషియం పుష్క‌లంగా ఉంటుంది. అలాగే విట‌మిన్ సి కూడా స‌మృద్ధిగా ఉంటుంది. ఈ పోష‌కాలు జీర్ణ‌శ‌క్తిని పెంచుతాయి. ఆక‌లిని నియంత్రిస్తాయి.

అర‌టి పండ్ల‌లో అధికంగా ఉండే ఫైబ‌ర్ ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌కుండా చేస్తుంది. దీంతో అధిక బ‌రువును చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే అర‌టి పండ్ల‌లో ఉండే పొటాషియం వ‌ల్ల హైబీపీ కూడా త‌గ్గుతుంది. ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను నిత్యం తీసుకోవాలి. వీటిల్లో ఉండే పోష‌కాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పాల‌కూర‌లో పొటాషియం మ‌న‌కు స‌మృద్ధిగా ల‌భిస్తుంది. దీన్ని స‌లాడ్లు లేదా జ్యూస్ రూపంలో తీసుకోవ‌చ్చు. అలాగే ఇత‌ర ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా పొటాషియం ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో హైబీపీని త‌గ్గించుకోవ‌చ్చు.

స్వీట్ పొటాటోలో కూడా మనకు తగినంత పొటాషియం లభిస్తుంది. స్వీట్ పొటాటోను ఉడికించి, పచ్చిగా లేదా సూప్ లా తీసుకోవచ్చు. స్వీట్ పొటాటో ను ఆహారంగా తీసుకుంటే… వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

తక్కువ కేలరీలు ఉండి ఎక్కువ పొటాషియం లభించే ఆహారపదార్ధాలలో బంగాళాదుంప ఒకటని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారపదార్ధాలలో వైట్ బీన్స్ ఒకటి. అరకప్పు వైట్ బీన్స్ లో కూడా పొటాషియం లభిస్తుంది. మష్రూమ్స్ లో కూడా మనకు పొటాషియం లభిస్తుంది. మష్రూమ్స్ ను సలాడ్, కూర లేదా శాండ్విచ్ రూపంలో తీసుకుంటారు. పుట్టగొడుగులో పొటాషియంతో పాటు క్యాల్షియం వంటి పోషకపదార్ధాలు లభిస్తాయి.

పుట్టగొడుగులు శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది కాబట్టి మధుమేహం, ఊబకాయం వంటి జబ్బులకు మంచిది. కొబ్బరి నీళ్లలో కూడా మనకు అధిక మెుత్తంలో పొటాషియం లభింస్తుంది. హై బీపీ తో బాధపడుతున్నవారు కొబ్బరి నీళ్లను తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సినంత పొటాషియం లభిస్తుంది.

రోజువారీగా మనం తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా.. పొటాషియం ఎక్కువుండేలా చూసుకోవాలి. మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో ఏయే పదార్థాల్లో పొటాషియం పరిమాణం సమృద్ధిగా ఉంటుందో చెక్‌ చేసుకోవాలి. అలాంటి ఆహారాన్ని డైట్ లో చేర్చుకుంటే స‌రిపోతుంది.

Leave a Comment