ఉదయం నిద్ర లేవగానే టీ త్రాగనిదే చాలా మందికి రోజు మొదలవ్వదు. మనిషి జీవితంలో టీ పాత్ర చాలా అమోఘమైంది. కాస్త తలనొప్పిగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ త్రాగడం జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. టీలను సేవించడం ఆరోగ్యానికి హానికరమని చాలా మంది భావిస్తుంటారు. కానీ టీ తో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ప్రస్తుతం మనకు చాలా రకాలు టీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటి వల్ల బరువు కూడా తగ్గవచ్చు.
మనలో చాలా మంది ప్రతినిత్యం టీ తాగనిదే రోజుగడవదు అంటే అతిశయోక్తి కాదు. ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు టీ తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. సహజంగా టీ నరాల ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. మనం తాగిన వెంటనే మనకి ఓ శక్తివంతమైన భావనను కలిగిస్తుంది. అయితే అధికంగా టీ తాగడం వల్ల అనేక దుష్పరిణామాలు ఉంటాయని, టీకంటే హెర్బల్ టీని, తగినంత మోతాదులో తీసుకోవడం ద్వారా అనారోగ్యాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. పలు పరిశోధనలు సైతం ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
హెర్బల్ టీ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మూసుకుపోయిన రక్తనాళాలను వ్యాకోచం చెందేలా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.తేనెతో చేసిన హెర్బల్ టీ గొంతే ఇన్ఫెక్షన్లకు మంచి పరిష్కారాన్ని ఇస్తుంది. అలాగే ఇందు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇలా నిత్యం మనం టీకి బదులు హెర్బల్ టీ ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవచ్చు.
టీ పొడిని తేయాకు చెట్ల నుంచి తయారు చేస్తారు. టీ సహజమైన పానీయం. దీనిలో రసాయనిక పదార్ధాలుగానీ, కృత్రిమ సువాసనల ద్రవ్యాలుగానీ, ఇతర రంగులుగానీ చేరి ఉండవు. ఇది ఆరోగ్యదాయకమైన, శక్తిదాయకమైన పానీయం. దీనిలో తక్కువగా లభించే కెఫీన్ మానవ శరీరానికి ఆరోగ్యకరమైనది. అయితే అపాయకారి మాత్రం కాదు. టీలో రకరకాల నాణ్యతలున్నాయి. గ్రీన్‌టీ, బ్లాక్‌టీలలో ఫ్లవనాయిడ్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి.
టీ పదే పదే తాగాలనిపించే సున్నిత వ్యసనాన్ని కలిగించే కెఫిన్ ఈరకం తేనీళ్లలో తక్కువగా ఉంటుంది. బ్లాక్ టీని తాగితే ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణక్రియను వేగవంతం చేసే బ్యాక్టీరియా పెరగడానికి బ్లాక్ టీ దోహదం చేస్తుంది. బ్లాక్ టీ లో ఫ్లవనాయిడ్స్ రక్తనాళాలు స్థితి మెరుగుపరిచి బరువు, కొవ్వు తగ్గడంతో చురుగ్గా పాల్గొంటాయి.
టీలు క్యాటెచిన్స్ అని పిలిచే ఒక రకమైన ఫ్లేవనాయిడ్‌ను కలిగి ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి మరియు శరీరం కొవ్వులను త్వరగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. అనేక టీలలోని కెఫిన్ శక్తి వినియోగాన్ని పెంచుతుంది. దీని వలన శరీరం మరింత కేలరీలను బర్న్ చేస్తుంది. గ్రీన్ టీ ని ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఆరోగ్యం కోసం తాగుతున్నారు. గ్రీన్ టి ని రెగ్యులర్ గా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందులో బరువు తగ్గడం కూడా ఒకటి. గ్రీన్ టీ లో ఉన్న కెఫీన్, ఫ్లేవనాయిడ్స్ వల్ల మెటబాలిజం బాగా బూస్ట్ అయ్యి కొవ్వుల్ని తొందరగా ప్రాసెస్ చేయగలదని స్టడీస్ వలన తెలుస్తోంది.
ఊలాంగ్ టీలో ఇతర టీలలో కన్నా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో చెడుకొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు నిత్యం ఊలాంగ్ టీని తాగితే ఫలితం ఉంటుంది. ఊలాంగ్ టీ తాగడం వలన అధిక బరవు త్వరగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారం మరియు వ్యాయామంతో జత చేసినప్పుడు మాత్రమే టీ చాలా తక్కువ మొత్తంలో బరువు కోల్పోవడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
చాలా పరిశోధనల్లో హెర్బల్ టీ తాగడం వల్ల శరీరానికి మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు. అలాగే గ్రీన్ టీ బరువు తగ్గించడంలో బాగా సహాయపడు తుందని తేల్చారు. అంతే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారు. కేవలం టీ ద్వారానే బరువు తగ్గుతారు అనుకోకూడదు. వీటికి తోడు శారీక శ్రమ, మంచి ఆహారనియమాలు కూడా తప్పని సరిగా పాటించాలి.