Quit Smoking – సిగరెట్ తాగేవారి పక్కన ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా?

By manavaradhi.com

Published on:

Follow Us
Quit Smoking

మీరు ధూమపానం చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఉండే వారిని కూడా పొగతో చాలా ప్రమాదంలోకి నెట్టుతున్నారని మీకు తెలుసా. వారు పీల్చే ధూమపానం పొగతో కలిగే హాని ఎక్కువ అని తెల్సుకోవాలి. సిగరెట్లలో ఉన్న నికోటిన్ హానికరమైనదని ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు. అయితే, ఒక్క నికోటిన్ మాత్రమే కాదు. నికోటిన్ కంటే మరింత హానికరమైన పెద్ద మొత్తంలో ఉండే ఇతర రసాయన సమ్మేళనాలు నూటికి యాభై మందిలో క్యాన్సర్ వ్యాధికి కారణమవుతున్నాయి.

సిగరెట్స్ మానేయడ వల్ల అనేక రకాల జబ్బులను నివారించుకోవచ్చు. అయితే సిగరెట్ మానుకోవడమే పెద్ద సమస్యగా ఉంటుంది. సిగరెట్ తాగడం మానుకోవాలి అని నిర్ణయించుకోగానే మొదట సిగరెట్స్ ను ముక్కలుగా చేయడం వల్ల కూడా సిగరెట్ త్రాగాలనే ఆలోచన తగ్గుతుందని కొన్ని పరిశోధనల ద్వారా తెలిసింది. ఏ వయస్సులో అయినా సరే స్మోక్ వదిలేయడం వల్ల మరికొన్ని ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించగలరు. ధూమపానం నిలిపేయడం వల్ల 90 శాతం హనికర వ్యాధులను నివారించుకోవచ్చు.

పొగ తాగేవారిలో ముందుగా వచ్చే వ్యాధి ఊపిరితిత్తుల క్యాన్సర్. ధూమపానం చేస్తున్నంత కాలం ఊపిరితిత్తులు శిథిలమవుతూ ఉంటాయి. ధూమపానం మానుకోవడం వల్ల కేవలం క్యాన్సర్ మాత్రమే కాకుండా అంతే తీవ్రమైన బ్రాంకైటిస్, ఎంఫిసెమా వంటి రోగాలు రాకుండా చూసుకోవచ్చు. స్మోకింగ్ చేసే వారిలో 90 శాతం మంది పురుషులు, 80 శాతం మంది స్త్రీలు క్యాన్సర్కు గురి అవుతున్నారు. అయితే కొంత ఆలస్యమైనా సరే స్మోకింగ్ మానేయడం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. పొగ తాగడం మానేసిన కొన్ని నిమిషాల్లోనే శరీరం కోలుకోవడం మొదలవుతుంది. పొగ తాగడం మానడం వల్ల శరీరం బరువు తగ్గిపోతుంది. మునుపటిలా అన్ని పనులు చేసుకునేందుకు శరీరం సహకరిస్తుంది.

మనం నేరుగా సిగరెట్ తాగకపోయినా ఇతరులు వదిలిన పొగపీల్చడం, కాలుతున్న సిగరెట్ నుంచి వచ్చే పొగను పీల్చడం చేస్తుంటాం. నేరుగా ధూమపానం వల్ల ఎంత హాని కలుగుతుందో దీనివల్ల కూడా అంతే హాని కలుగుతుంది. సిగరెట్ తాగే వారికి దూరంగా ఉండటం వల్ల ఆస్తమా, న్యుమోనియా, బ్రాంకైటిస్, తలనొప్పి, దగ్గు వంటివి రాకుండా కాపాడుకోవచ్చు.

ఒక్కసారిగా ధూమపానం మానేయడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విపరీతమైన తలనొప్పి, నరాలు జివ్వున లాగినట్లుగా ఉండడం.. నాలిక పీక్కుపోవడం లాంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇవన్నీ స్మోకింగ్ మానేయాలనుకునే వారి శ్రద్ధను దెబ్బతీస్తాయి. వీటన్నిటినీ ఎదుర్కోవాలంటే నికోటిన్ స్థానాన్ని భర్తీ చేసే థెరపీ అవసరం. ఇది చేయడం వల్ల నూటికి నూరుపాళ్లు పొగ తాగడం మానేయాలనుకునే ప్రక్రియ విజయవంతం అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

పొగ తాగడం మానేయాలనుకున్నప్పుడు మొదట కొన్ని రోజులు నీరు, ఇతర ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.పొగాకు సేవించాలనే కోరిక కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. తరువాత క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి ఆ కొన్ని నిమిషాలు సంయమనం పాటించాలి.మొదటి వారం పది రోజులలో కాఫీ, పంచదార, మద్యం మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఇవి సిగరెట్ కాల్చాలనే కోరికను పెంచుతాయి.

పొగాకు సేవించడం అనేది ఓ వ్యసనం. ధూమపానం మానేయాలి నిశ్చయించుకున్న తర్వాత.. అందుకు సంబంధించిన అన్ని వస్తువులను దూరంగా పెట్టాలి. సిగరెట్లతోపాటు యాష్ ట్రేలు, లైటర్స్ లాంటివి దరిదాపుల్లో కనిపించకుండా చూసుకోవాలి. సిగరెట్ స్మోకింగ్ వల్ల బట్టలు, దుప్పట్లు , దిండ్లు పొగ వాస వస్తుంటాయి. వాటిని శుభ్రం చేసుకోవాలి.

Leave a Comment