Cancer Prevention Tips : క్యాన్సర్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు..?

By manavaradhi.com

Published on:

Follow Us

ఈ మధ్య కాలంలో మనిషిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగానే వస్తున్నాయంటున్నారు వైద్య నిపుణులు. క్యాన్సర్ అనేది శరీరంలో ఎక్కడైనా వచ్చే అసాధారణమైన కణాల అనియంత్రిత పెరుగుదల. ఈ కణాలు సాధారణ శరీర కణజాలాలను చొరబాట్లు చేయగలవు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణ సమూహాలనే క్యాన్స‌ర్లుగా పిలుస్తారు. క్యాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉంది. శ‌రీరం నుంచి ఏ ప్రాంతంలోనైనా రక్తం కారినా, గడ్డలుగా ఏర్పడిన కాన్సర్ లక్షణాలుగా గుర్తించాలి.

క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి …?

ఎందుకు వస్తుందో ఎవరికి వస్తుందో ఎలా వస్తుందో అర్థం కాని మహమ్మారి క్యాన్సర్. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల జోకిలి పోకుండా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. పౌష్టికాహార లేమి వల్ల పెద్ద పేగు క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అందువల్ల పరిశోధకులు పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవాలని వెల్లడించారు. అందుకోసం పొట్టుతీయని ధాన్యాలు తీసుకోవాలి. పాల ఉత్పత్తులను తక్కువగా తినడం, ప్రాసెస్ చేసిన మాంసం, కూరగాయలు తక్కువగా తినడం, పండ్లు తినకపోవడం, చక్కెర ఎక్కువగా తీసుకోవడం లాంటి కారణాల వల్ల క్యాన్సర్ ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు బెవరేజెస్ లు తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. మన జీవనశైలితో పాటు మనం తీసుకునే ఆహారం ఈ క్యాన్సర్ వ్యాధికి ప్రధాన కారణం. మనం తీసుకునే ఆహారపదార్థాల ద్వారా క్యాన్సర్ ను చాలా వరకూ నిరోధించుకోవచ్చు. పోషక విలువలున్న ఆహాప పదార్థాలను నిత్యం తీసుకుంటూ ఉంటే… అందులోని పోషక గుణాలు క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు.

క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?

క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చా.. అంటే దీనికి కచ్చితంగా సమాధానం దొరకదు. క్యాన్సర్ ను ఖచ్చితంగా నివారించే పద్దతి ఏదీ లేదు. కానీ కొన్ని మంచి అలవాట్లు ద్వారా ముందు జాగ్రత్త ద్వారా క్యాన్సర్ వచ్చే అపాయాన్ని కొంతవరకూ తగ్గించుకోవచ్చు. ధూమపానం, నికోటిన్ సంబంధించిన పదార్థాలకు దూరంగా వుండటం మంచిది. అలాగే క్రొవ్వు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యం, అధికంగా తీసుకోవాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేయాలి. అధిక బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. ఎండ వేళల్లో గొడుగు ధరించాలి. కాలుష్యం నుంచి వీలైనంత వరకూ దూరంగా ఉండాలి. జీవ‌న‌శైలిలో మార్పులు చేసుకొని పోష‌కాహారం తీసుకోవాలి. ఎలాంటి క‌ణుతులు, గ‌డ్డ‌లు క‌నిపించినా అశ్ర‌ద్ధ చేయ‌కుండా స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ముంద‌స్తుగా గుర్తించి చికిత్స తీసుకోవ‌డం ద్వారా క్యాన్స‌ర్ల‌ను జ‌యించొచ్చు.

ఈ వ్యాధికి ఇదీ కారణం అని చెప్పడానికి లేదు. జన్యుపరంగా సంక్రమించే వీలు కూడా మూడు శాతమే. మిగతా 97% క్యాన్సర్లు ఏ కారణం లేకుండానే రావొచ్చు. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలితో క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల శరీరమే తనలో మొలకెత్తే క్యాన్సర్‌ కణాలను ఎప్పటికప్పుడు చంపేస్తుంది.

Leave a Comment