నిద్ర లేచిన వెంటనే ఏ పనీ చేయరు కొందరు. అదే కొనసాగితే బద్ధకం వచ్చేసి రోజంతా అదే కొనసాగుతుంది. మరెలా అంటారా… ఆ బద్ధకాన్ని వదిలించుకునే చిట్కాలు తెలిసుండాలి. మరి రోజంతా ఆహ్లాదంగా..ఉల్లాసంగా ఉండాలంటే ఏమి చేయాలి..?
మనలో చాలా మందికి రోజు లేవగానే ఏదో వెలితి ఉన్నట్లు అనిపిస్తుంటుంది. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లుమూసుకుని కూర్చొని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాసక్రియతో పాటు మీ మూడ్స్‌ను ఉత్సాహంగా ఉంచుతుంది. ఉదయం నిద్రలేచిన తరువాత వీలైనంత త్వరగా స్నానం చేయాలి. ఇది శరీరంలోని ఉష్ణోగ్రతస్థాయులను సమన్వయం చేస్తుంది. మెదడును ఉత్సాహపరిచి, చురుగ్గా మారుస్తుంది. శరీరంలో రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది. గోరువెచ్చని నీటిని ఎంచుకుంటే మరీ మంచిది. ఇదో వ్యాయామంలా పని చేస్తుంది. దినచర్య ఉత్సాహంగా మార్చడంలో వ్యాయామం పాత్ర కూడా కీలకమే. ఉదయాన్నే మేల్కోవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడుతుంది. నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేయడం మీ అలవాట్లో లేకపోతే, ఆ అలవాటును అలవరుచుకోండి. పొద్దున్నే కనీసం అరగంటసేపు వ్యాయామం చేయడం వల్ల కూడా బద్ధకం వదిలి శరీరం ఉత్సాహంగా మారుతుంది.
ఉదయం ఉత్సాహంగా ఉండాలంటే ఏంచేయాలి ?
చాలామంది ఉదయం అల్పాహారం తీసుకోరు. సమయం లేదని చెబుతారు. కానీ తప్పనిసరిగా తినాలి. దీనివల్ల కూడా శరీరం రోజంతా చురుగ్గా మారుతుంది. శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. నిద్రలేచిన వెంటనే ఫోను చూసుకునే అలవాటు ఉంటే మానేయాలి. ఫోను చూస్తూ అలా కూర్చుండిపోతాం. దాంతో తెలియకుండానే సమయం వృథా అయి గంటలు గడిచేకొద్దీ ఏ పని చేయడానికి ఆసక్తి ఉండదు. ఇదే సూత్రం టీవీకి వర్తిస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి అవసరం అనుకుంటేనే ఫోను లేదా టీవీ చూడాలి. రిలాక్సేషన్ కోసం నిద్రలేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. వీటికన్నా నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే మంచిది. పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్, ప్రోటీన్స్ వ్యాధి నిరోధకతను పెంచి, శరీరాన్ని స్ట్రాంగ్ అండ్ ఫిట్ గా ఉంచుతాయి. ముఖ్యంగా వీటిని ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. ప్రతీ రోజు నిద్రలేచే సమయం కన్నా మరో గంట ముందుగా నిద్రలేచే అలవాటు చేసుకోండి. రోజు హాయిగా ఉండడానికి ఉదయం పూట మెలోడీ సంగీతం వినడం మంచిది. సంగీతం మనలో చైతన్యం పెంచుతుంది. అంతేకాకుండా మన మూడ్ రొటీన్‌గా ఉండకుండా సంగీతం సాయం చేస్తుంది.
దినచర్య ఉత్సాహంగా మార్చడంలో వ్యాయామం పాత్ర ఎంత ?
ఉదయాన్నే తొందరగా లేవడం అలవాటు చేసుకోండి. అలాగే కనీసం 8గంటల పాటు పడుకొనే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అలా అని మరీ ఎక్కువ కూడా పడుకోవద్దు. ఉదయం లేవగానే నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోండి. ఇది శరీరంలో పిహెచ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి.ఇక రాత్రి పడుకొనే సమయంలో నిద్ర రాకపోతే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఆందోళనలు తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. దినచర్య ఉత్సాహంగా మార్చడంలో వ్యాయామం పాత్ర కూడా కీలకమే. పొద్దున్నే కనీసం అరగంటసేపు యోగా, ధ్యానం చేయడం వల్ల ఉత్సాహంగా మారుతుంది.
తెలుసుకున్నారుగా ఉదయం ఉత్సాహంగా ఉండాలంటే ఏంచేయాలో. మీరు కూడా ఈరోజు నుంచి నిద్రలేవగానే ఇలాంటి చిన్నపాటి చిట్కాలు పాటించండి. దానివల్ల అనుకున్నది సాధించగలం. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలం.