Exercises for BP – బీపీ తగ్గాలా… ఈ ఎక్స్‌ర్‌సైజ్‌ చేస్తే సరిపోతుంది

By manavaradhi.com

Updated on:

Follow Us
Best Exercises to Lower Blood Pressure

హైబీపీ అనేది నేటి త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. చాప కింద నీరులా ఇది అనేక మందికి వ‌స్తుంది. అయితే హైబీపీ ఉంటే దాని ల‌క్ష‌ణాలు కూడా చాలా మందికి తెలియ‌వు. దీంతో బీపీ ఉంద‌ని తెలుసుకునే స‌రికే జ‌రగాల్సిన న‌ష్టం జ‌రిగిపోతుంది. హై బీపీని ముందుగానే గుర్తిస్తే దాంతో జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. ముఖ్యంగా వ్యాయమాల ద్వారా బీపీని తగ్గించుకోవచ్చు.

బీపీ అంటే తెలియని వారు ఉండటరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులోనూ అధికంగా హైబీపీకి గురిఅవుతున్నట్లు చాలా అధ్యాయాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు 120/80 నమోదు కావచ్చు. సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది.

అధిక రక్తపోటుకు కారణాలు అనేకం ఉంటాయి. ఒత్తిడి, ఉప్పు అధికంగా తినటం, డయాబెటీస్ వంటివి అధిక ర్తపోటుకు కారణాలుగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు ఉంటే, గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. సాధారణంగా ఇతర సమస్యలకోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అధిక రక్తపోటుని గుర్తిస్తుంటారు. లేదా రక్తపోటు కారణంగా ఇతర అనారోగ్యాలు వచ్చినప్పుడు వాటి చికిత్సకు ఆసుపత్రికి వెళితేనే… అధిక రక్తపోటు ఉన్న విషయం బయటపడుతుంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా బీపిని చెక్ చేయించుకుంటూ ఉండాలి.

ర‌క్త‌పోటు స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే వ్యాయామాలు ఒక్క‌టే మార్గం. శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, ఊబ‌కాయం వంటి కార‌ణాల వ‌ల్ల ర‌క్త‌పోటు పెరుగుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అందుక‌ని శ‌రీరాన్ని అదుపులో పెట్టుకొని స‌రైన బ‌రువును మెయింటేన్ చేయ‌డం ద్వారా ర‌క్త‌పోటును అదుపులో ఉచంచుకోవ‌చ్చు.ర‌క్త‌పోటు ముఖ్యంగాఆందోళ‌న‌, ఒత్తిడికి గుర‌య్యే వారిలో ఎక్కువ‌గా ఉంటుంది. కాబట్టి ఒత్తిడి, ఆందోళ‌న‌ను కూడా త‌గ్గించుకోవాలి. వీటిని కేవ‌లం వ్యాయామాల‌తోనే జ‌యించ‌వ‌చ్చు.

వేటి కార‌ణంగా ఒత్తిడి, ఆందోళ‌న పెరుగుతుందో గ‌మ‌నించి వాటిపై దృష్టిసారించాలి. నడక, జాగింగ్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే. అందరికీ ఇవి మేలు చేస్తాయి. రక్తపోటు వ్యాధిగ్రస్తులకు అయితే వ్యాయామం తప్పనిసరి. నడక, జాగింగ్ లాంటి తేలికపాటి సాధారణ వ్యాయామాలు కనీసం గంట చేయాల్సి ఉంటుంది. బ్రిస్క్ వాకింగ్ మరింతగా ఉపయోగపడుతుంది. వేగంగా నడవడం వలన రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీంతో రక్తంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలు క్రమంగా కరుగుతాయి. వ్యాకోచం, సంకోచాలు పెరగడం వలన రక్తనాళాల సామర్ధ్యం పెరిగి రక్తప్రవాహం నిలకడగా ఉంటుంది.

జిమ్కు వెళ్లే అలవాటు ఉంటే ఏరోబిక్, కార్డియో వాస్క్యూలర్ వ్యాయాలు చేయడం వలన నెల నుంచి 2 నెలల్లోనే ఫలితం కనిపిస్తుంది. వీటితోపాటు సైకిలింగ్, ఈత కొట్టడం లాంటివి శరీరంలో రక్తప్రవాహం సరిగ్గా ఉండేలా చూస్తాయి. చిన్నపాటి బరువులు ఎత్తడం కూడా రక్తనాళాల సామర్ధ్యాన్ని పెంచుతుంది.

అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి యోగా బాగా ఉపకరిస్తుంది. సూర్య నమస్కారాలు ఎంతో మంచి ఫలితాన్నిస్తాయి. వ్యాయామాన్ని ఒకేసారి చేయ‌కుండా రోజ‌రోజుకు కొంచెం పెంచుతూ పోవాలి. ప‌నుల్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ 30 నిమిషాల‌పాటు వ‌ర్క్ అవుట్స్ చేయ‌డం అల‌వ‌ర్చుకోవాలి. బ‌య‌ట‌కు వెళ్ల‌డం తీరిక‌లేని వాళ్లు ఇంట్లోనే చిన్న‌పాటి జిమ్ సెట‌ప్ చేసుకోవాలి. వ్యాయామం చేయ‌డానికి ముందుగా చేసే వార్మ్ అప్‌తో శ‌రీరం త్వ‌ర‌గా చ‌ల్ల‌బ‌డుతుంద‌ని గ్ర‌హించాలి. ఫ‌లితంగా ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

అధిక రక్తపోటు అనేది తీవ్రంగా పరిగణించాల్సింది. దీని వల్ల రక్తనాళాలలో రక్తం నిరంతరం అధికమవుతుంది. బీపీ ఉంటే, గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి బీపీతో బాధపడుతున్నవారు రోజు క్రమం తప్పకుండా వ్యాయమం చేయండి బీపీని అదుపులో ఉంచుకోండి.

Leave a Comment