చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు. మూడు పూటల పుష్కలంగా ఆహారం ఆరగిస్తుంటారు. కానీ, అలసట, నిస్తేజం ఆవరించినట్టుగా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో వారికి అర్థంకాదు. మధ్యాహ్నం వేళ అలసట కారణంగా ఏపని చేయాలన్న చేయలేరు.
కొంతమంది ఎంత ఆరోగ్యంగా ఉన్నా, కొన్ని సందర్భాలలో కొన్ని కారణాల వల్ల అలిసిపోయిన భావనను కలిగి ఉంటారు. కొన్నిసార్లు శరీరము అతిగా శ్రమించినప్పుడు లేదా మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు వ్యక్తి తరచుగా అలసిపోతూ ఉంటారు. మధ్యాహ్నం అలసట యొక్క సాధారణ కారణాలలో ఒకటి ఒత్తిడి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండండి… యోగా లేదా ధ్యానం వంటి వాటివల్ల ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. మీరు రోజంతా పనిచేయడానికి అవసరమైన శక్తిని పంపిణీ చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహారం తప్పక తీసుకోవాలి.
మన శరీరానికి అవసరమైన పోషక పదార్ధం ఏదైనా సరిపడినంత లభించకపోతే, అది శారీరక లేదా మానసిక అలసటకు కారణం అవుతుంది. ఎంత బిజీగా ఉన్నా కూడా పని మధ్యలో ఓ ఐదు పది నిమిషాల పాటు బ్రేక్ తీసుకుంటే మన మెదడు మరింత చురుగ్గా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇలా కాసేపు విరామం తీసుకోవడం వల్ల మీ మనసు పునరుత్తేజితమవుతుంది. ఆ తర్వాత మళ్లీ పనిపై ధ్యాస పెడితే అలసట రాదు.. సరికదా పనిలోనూ మంచి అవుట్పుట్ కనబర్చవచ్చు.
ఎక్కువ సేపు కార్యాలయంలో గంటలు తరబడ కూర్చోవడం కూడా అలసటను కలిగిస్తుంది. ఇది మీకు అలసిపోయినట్లు అనిపించడమే కాదు…నిశ్చల జీవనశైలి మధుమేహం మరియు రక్తపోటు వంటి వ్యాధుల అభివృద్ధికి కూడా దారితీస్తుంది. వ్యాయామం మధ్యాహ్నం చేయడం అనువైనదని కొందరు ఫిట్నెస్ గురువులు సలహా ఇస్తుంటారు…. కానీ దాన్ని అతిగా చేయవద్దు. మీ శక్తిని పెంచడానికి వ్యాయామం సరిపోతుంది కాని మరేదైనా చేయటానికి మీరు చాలా అలసిపోతారు. చిన్న కార్డియో వర్కౌట్లు మధ్యాహ్నం అలసటను ఎదుర్కోవడంలో చక్కగా ఉపయోగపడతాయి… కాబట్టి మిమ్మల్ని మీరు మేల్కొలపడానికి చురుకైన నడకకు వెళ్లండి లేదా భోజన సమయంలో సమీపంలోని వ్యాయామశాలలో ట్రెడ్మిల్ కొట్టండి.
ఆకుకూరలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, పప్పుల వంటి పీచు అధికంగా ఉండే పదార్థాలు.. తేలికైన ప్రోటీన్ వంటివి తీసుకోవటం మంచిది. అలాగే పెద్దమొత్తంలో కాకుండా తక్కువ తక్కువగా ఎక్కువసార్లు భోజనం చేసినా మంచి ఫలితం కనబడుతుంది. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, శుద్ధిచేసిన పిండి పదార్థాలను పరిమితం చేసుకోవటమూ మేలే.
అలసటకు తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రతిరోజూ ఉదయం పూట అల్పాహారం మానేస్తే, నిద్ర మత్తు నుంచి మేల్కొలిపే కాఫీలాంటి ఉత్ర్పేరకాల మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కెర స్థాయిలను సమంగా ఉంచుకునేలా ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తినాలి. రాత్రి నిద్రకు ముందు మొబైల్, టీవీ, వీడియో గేమ్స్ వంటి ఉపకరణాల వాడకం వల్ల మెదడు చైతన్యవంతంగా ఉండి నిద్ర రానివ్వదు. ఫలితంగా పగటి వేళంతా నీరసంగా ఉంటాం. కాబట్టి ఈ ఉపకరణాలను పడగ్గదిలోకి అనుమతించకూడదు. ఎక్కువ నిద్రపోతే శరీరానికి ఎక్కువ విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటే పొరపాటు. 7 నుంచి 9 గంటల నిద్ర సరిపోతుంది. అంతకంటే ఎక్కువ సమయంపాటు నిద్రపోతే అలసట దరి చేరుతుంది.
వ్యాయామం చేస్తే శరీరం ఉత్తేజితమవుతుంది. కానీ నీరసంగా ఉన్నప్పుడు వ్యాయామం ఎలా చేయడం? అనుకోకూడదు. వ్యాయామంతో శరీరంలో ఫీల్ గుడ్ హోర్మోన్లు విడుదలై కొత్త ఉత్తేజాన్ని అందిస్తాయి.స్వల్ప డీహైడ్రేషన్ వల్ల శక్తి తగ్గుతుంది. కాబట్టి రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. అన్ని నీళ్లు తాగలేకపోతే నీళ్లతోపాటు పళ్ల రసాలను ఎంచుకోవచ్చు
పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు అలసటగా అనిపిస్తూ ఉంటుంది. మానసికంగా బాగా లేనప్పుడు కూడా అలసటగా అనిపిస్తుంది. ఇలా జరక్కుండా ఉండాలంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపి శరీరానికి అవసరమైన ఉన్న ఆహారం తీసుకోవాలి.