Sciatica:సయాటికా ఎందుకు వస్తుంది..? దానికి గల కారణాలు ఏమిటి ?

By manavaradhi.com

Published on:

Follow Us

నిజానికి చాలామంది సయాటికా అంటే ఒక వ్యాధి అనుకుంటారు. కాని, సయాటికా నడుములో ఉన్న వ్యాధి యొక్క లక్షణం. మనకేదైనా నొప్పి నడుము నుంచి కాళ్ళల్లోకి పాకినట్లుంటే ఈ నొప్పితో పాటు ఒక్కొక్క సారి కాళ్ళలో తిమ్మిర్లు గాని, మంటలు గాని లేదా మొద్దుబారినట్లు ఉండటాన్ని సయాటికా అంటాం. మన శరీరమంతా నరాలు వ్యాపించి ఉంటాయి. వీటన్నింటిలో అత్యంతపొడవైన నరం సయాటికా. వెన్ను పాము నుంచి పాదాల వరకూ ఉండే ఈ నరం పాదాల పని తీరు, స్పర్శ లాంటి వాటిని నియంత్రిస్తూ ఉంటుంది. ఇది ఐదు ఇతర నరాల సమూహంతో ఏర్పడుతుంది. ఈ నరాలపై ముఖ్యంగా సయాటికా నరం మీద ఒత్తిడి కలిగినప్పుడు ఏర్పడే నొప్పినే సయాటికా నొప్పిగా వ్యవహరిస్తారు.

దీని ఫలితంగా కాళ్ళల్లో తిమ్మిర్లు, స్పర్శ తగ్గిపోవడం, మంట, నడకలో మార్పు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని వల్ల వచ్చే నొప్పిని ఎవరూ భరించలేరు. దీని వల్ల రోజు వారీ పనులకు ఆటంకం కలుగుతుంది. సరైన సమయంలో వైద్యం తీసుకోవడం ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. మధ్యవయసు వారు ఎక్కువగా ఈ సమస్య బారిన పడతారు. స్త్రీ పురుషులనే సంబంధం లేకుండా ఎవరినైనా సయాటిగా సమస్య బాధించవచ్చు.

సయాటికా రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది నడుములో డిస్క్ లు జారడం. డిస్క్ లోపల జెల్లీ లాంటి న్యూక్లియస్ అనే పదార్థం డిస్క్ నుంచి బయటకు వచ్చి, కాళ్ళలో నరాల పై ఒత్తిడి పెంచుతుంది. సయాటికా రావడానికి ముఖ్యమైన కారణాల్లో ఇది ఒకటి. వయసు పెరిగే కొద్దీ అరిగిపోయే డిస్క్ ల సమస్య. ఇది మొదట నడుము నొప్పితో ప్రారంభమై, అశ్రద్ధ చేసినప్పుడు సయాటికాకు దారి తీయవచ్చు. వెన్నుపై ఒత్తిడి సయాటికా కారణాల్లో మరొకటి. వెన్ను నుంచి కాళ్ళలోకి వచ్చే నరాలు బయటకు వచ్చే ద్వారా ముసుకుపోవడం వల్ల సయాటికా రావచ్చు. దీన్నే స్పైనల్ స్టెన్ సిస్ అంటారు.

వయసు పెరిగే కొద్దీ డిస్క్ లు ఇరిగి, వెన్ను పూస మధ్యలో ఉండే ఫెసిట్ జాయింట్స్ అరిగి, లిగ్మెంట్స్ లావుగా కావడం వంటి మార్పుల వల్ల ఇది సంభవిస్తుంది. స్పైనల్ స్టెన్ సిస్ లో క్లాన్డికేషన్ అనే లక్షణం చాలా ఇబ్బంది పెడుతుంది. నడక మొదలు పెట్టినప్పు కాళ్ళలో ఏ సమస్యా ఉండదు. కానీ కొంత దూరం నడిస్తే, కాళ్ళలో నొప్పి ఇంకా ఎక్కువై, కాళ్ళు బరువెక్కి నడవలేని పరిస్థితి వస్తుంది. నడక ఆపి కొంత సేపు నిలబడగానే ఇది తగ్గిపోతుంది. ఆ తర్వా నడిస్తే వస్తూ ఉంటుంది. వెన్నుపూసలు ఒక దాని మీద ఒకి జారిపోయే స్పాండలైటిస్ వల్ల కూడా ఈ సమస్య ఎదురు కావచ్చు. ఇటుకల మాదిరిగా ఓ క్రమ పద్ధతిలో ఉండే వెన్నుపూస మధ్య లింకులు దెబ్బ తిని స్పాండలైటిస్, తద్వారా సయాటిగా ఎదురు కావచ్చు. అలాగే వెన్నుకు, తుంటికి మధ్య ఉండే సక్రోసిటిక్ జాయింట్ లో సమస్యలు ఏర్పడినా సయాటికా వస్తుంది.

కండరాల వాపు వల్ల నొప్పి కలగడం, సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబార్ స్పాండిలోసిస్ లాంటివి కూడా ఇదే సమస్యలు కలుగు జేస్తాయి. సయాటికా లక్షణాల ఆధారంగా మందులు వాడవలసి ఉంటుంది. అయితే సయాటిగా లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా అవసరం. వైద్యుని సమక్షంలో చేసే కొన్ని వ్యాయామాలు సయాటికా నొప్పిని గుర్తించేందుకు తోడ్పడతాయి. ఎం.ఆర్.ఐ స్కాన్ ల ద్వారా దీన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. నరం మద ఎక్కడ ఒత్తిడి పడుతుందో స్పష్టంగా తెలుసుకుని, చికిత్స అందించవచ్చు.

సయాటికా సమస్యలు ఉన్న వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం, అధికబరువులు ఎత్తడం లాంటి శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. సాధారణంగా ఆపరేషన్ లేకుండానే సయాటికా నుంచి విముక్తి పొందవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎక్కువగా వంగకుండా సరైన రీతిలో కూర్చోవడం లేదా పడుకోవడం చేయాలి. సున్నితమైన వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల సయాటిక్ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ సమస్యను త్వరగా గుర్తించి సరియైన చికిత్సను అందించడంతో పాటు దైనందిన జీవితంలో మార్పులు చేసుకోవడం ద్వారా సయాటికా సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.

Leave a Comment