Vitamin C : శరీరంలో విటమిన్-సి లోపాన్ని ఎలా గుర్తించాలి..?

By manavaradhi.com

Updated on:

Follow Us

విటమిన్ సి నీటిలో కరిగే ఒక విటమిన్. వీటిని యాంటీ ఆక్సిడెంట్ గా పిలుస్తారు. ఇవి శరీరంలో కణాల అభివృద్ధికి, రక్తప్రసరణకు సహాయపడతాయి. వీటి లోపం వల్ల అలసట ,బలహీనత, బరువు తగ్గడం, దంతక్షయం, దంత వాపులు, జాయింట్ పెయిన్స్, గాయాలు మానకపోవడం వంటి లక్షణాలతో పాటు క్యాన్సర్, ఆస్తమా, గుండె జబ్బులు, ఎనీమియా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల మన రెగ్యులర్ డైట్ లో విటమిన్ సి లోపం లేకుండా చూసుకోవాలి. ఇది గుండె జబ్బులు, రోగ నిరోధక వ్యవస్థ లోపాలు, గర్భ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు , కంటి సమస్యలు మరియు చర్మం ముడతలు పడటం నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

శరీరంలో విటమిన్ సి లోపం ఏర్పడితే స్కర్వి వ్యాధి వస్తుంది. ఈ స్థితిలో తీవ్రమైన అలసట, బలహీనంగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ సి తక్కువయితే మెదడులో రక్తం గడ్డకట్టి పక్షవాతం వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ . ఇది ఫ్రీరాడికల్స్ శరీరంలో సెల్స్ ను డ్యామేజ్ చేస్తుంది.

విటమిన్ సి లోపం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి, క్యాన్సర్ ఎఫెక్టివ్ గా నివారించడానికి విటమిన్ సి ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి . ముఖ్యంగా విటమిన్ సి బ్రెస్ట్ క్యాన్సర్ నివారిస్తుంది. శరీరంలో విటమిన్ సి లోపం వల్ల శ్వాససంబంధిత సమస్యలు ఎదురవుతాయి . సిట్రస్ ఫ్రూట్ ను ఎక్కువగా చేర్చుకోవడం వల్ల క్రోనిక్ డిసీజ్ ఆస్తమాను నివారిస్తుంది. బ్లడ్ స్ట్రెమ్ యాంటీబాడీస్ సర్క్యులేషన్ పెంచుతుంది.

విటమిన్ సి హీమోగ్లోబిన్ గ్రహించడానికి సహాయపడుతుంది . రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి చేస్తుంది మరియు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది . ఐరన్ లోపం వల్ల రక్తహీనతకు దారితీస్తుంది . విటమిన్ సి సరిగా అందనప్పుడు శరీరం ఐరన్ గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. ఆహారంలో విటమిన్ సి తగినంత మొత్తంలో లేకపోవడం వలన మీ శరీరంలోని విటమిన్ C యొక్క లోపం లేదా లేకపోవడం జరుగుతుంది. కాలక్రమేణా, విటమిన్ C లేకపోవడం వలన కొత్త కొల్లాజెన్ ఏర్పడదు. ఇది మీ శరీరంలో వివిధ కణజాలాలను విచ్ఛిన్నం చేయడానికి కారణమవుతుంది మరియు శరీరం యొక్కఆరోగ్యం మీద ప్రభావితమవుతుంది.

మనం జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజూ 75 మి.గ్రాముల విటమిన్ సి తీసుకోవాలి. సాధారణంగా మనకొచ్చే జలుబు నుంచి మొదలుకొని క్యాన్సర్ లాంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా నిరోధించి శరీరాన్ని కాపాడే శక్తి విటమిన్ సి కి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి విటిమన్ సి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

మనకు ఆయా కాలాల్లో మార్కెట్‌లో లభ్యమయ్యే సీజనల్ ఫ్రూట్స్, కూరగాయల్లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. సులభంగా లభ్యమయ్యే జామపండు, నిమ్మకాయలు, ఉసిరి, టమోటాలు, నారింజ, బత్తాయి, దానిమ్మ, ద్రాక్ష లాంటి పండ్లు, కూరగాయల్లో ‘సి’ విటమిన్ ఉంటుంది. విటమిన్ సి లోపం వల్ల మరో సమస్య చిగుళ్ల నుండి రక్తస్రావం అవుతుంది . విటమిన్ సిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి పరిష్కారం పొందవచ్చు .

Leave a Comment