Eye Health: మీ కంటి చూపు మందగిస్తుందా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి ..!

By manavaradhi.com

Published on:

Follow Us
Worst foods for your Eyes

మన ముఖానికి అందాన్ని ఇచ్చేవి కళ్ళు. అటువంటి కళ్ళను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసున్నాయి. వీటి వల్ల అరవైల్లో రావాల్సిన కంటి సమస్యలు ఇరవైల్లోనే వస్తున్నాయి. ఈ ఆధునిక యుగంలో కంటికి శ్రమ మరింతగా పెరిగింది. టెక్నాలజీ పెరిగిపోయిన కొద్దీ కళ్లని మనం మరింత శ్రమకి గురిచేస్తున్నాం. వీటన్నింటినీ తట్టుకుంటూ, వయసు పెరుగుతున్నా మన కళ్ల ఆరోగ్యంగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా కళ్ళను దెబ్బతీసే ఆహారాలకు దూరంగా ఉండాలి. మాంసాహారం కావచ్చు, శాకాహారం కావచ్చు, కంటి ఆరోగ్యం కోసం ఏది తీసుకుంటున్నామనే విషయం కంటే కూడా, సరైన స్థాయిలో తీసుకుంటున్నామా అనేదే అవసరం. ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ల మందికి తేలికపాటి నుండి తీవ్రమైన దృష్టి లోపాలతో భాదపడుతున్నారు. ముఖ్యంగా మారుతున్న ఆహారపు అలవాలట్లు వీటి కారణం అవుతున్నాయి.

పాశ్చాత్య దేశాల్లో బ్రెడ్, పాస్తాలను అతిగా తింటారనే సంగతి తెలిసిందే. ఈ ఆహార అలవాట్లు ఇప్పుడు మన ప్రజలకు కూడా పాకాయి. చాలామంది బ్రెడ్, పాస్తాలను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటున్నారు. కానీ వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కవగా ఉంటాయి. శరీరం ఈ రకమైన కార్బ్‌ను త్వరగా జీర్ణం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది. వీటిని అధికంగా తీసుకోవాడం వల్ల మాక్యులర్ డీజెనరేషన్ (AMD) కు ఎక్కువ అవకాశం ఉంది. ఇది వృద్ధులకు దృష్టి నష్టానికి ప్రధాన కారణం. కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని తగిన మోతాదులో తీసుంకుంటే మంచిది.

ప్రొసెస్డ్ మీట్ కంటి ఆరోగ్యని మంచిది కాదు. ఎందుకంటే వీటిని నిల్వ ఉంచడానికి సోడియంతో లోడ్ చేస్తారు. ఈ ఉప్పు అధిక రక్తపోటు కు దారితీస్తుంది. అలాగే ఇది కంటి మీద కూడా అధిక ప్రభావాన్ని చూపుతుంది. రక్తపోటు రెటినోపతి, అస్పష్టమైన దృష్టి లేదా దృష్టి నష్టానికి కారణం కావచ్చు. అలాగే రెటీనా క్రింద ద్రవం ఏర్పడటం ,న్యూరోపతి, రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడం,దృష్టి నష్టానికి కారణమవుతుంది. సోడియంను రోజుకు 2,300 మిల్లీగ్రాములు లేదా అంతకంటే తక్కువకు పరిమితం చేయడం మంచిది.

డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి డెలిషియస్ గా ఉండొచ్చు. కానీ, అవన్నీ నూనెతో నిండి ఉంటాయన్న విషయం వాస్తవమని గుర్తించాలి.ట్రాన్స్ ఫ్యాట్స్‌లో వండిన డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ మీ ఎల్‌డిఎల్ ,చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి మరియు గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తాయి. దాంతో, భవిష్యత్తులో హార్ట్ డిసీజెస్ వచ్చే సమస్యలు ఎదురవుతాయి. వీటి వల్ల కంటి సమస్యలు పెరుగుతాయి. మాక్యులర్ డీజెనరేషన్ మరియు డయాబెటిక్ రెటినోపతికి కారణం అవుతాయి.

వనస్పతిలో ట్రాన్స్ ఫ్యాట్ కూడా ఉంది, ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది . గుండె జబ్బులు మరియు కంటి సమస్యలకు అవకాశం ఇస్తుంది. మానవ శరీరం ఎక్కువ కొవ్వును జీర్ణించుకోలేదు. దీంతో అది శరీరంలో పేరుకు పోతుంది. అలా ఎక్కువగా పేరుకు పోయిన కొవ్వు గుండె జబ్బులు, రక్తపోటులాంటి ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ 4 గ్రాముల కంటే తక్కువ సంతృప్త కొవ్వుతో నూనెలు ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

హైడ్రోజనేటెడ్ నూనెలు మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న వాటికి దూరంగా ఉండండి. సూప్, టొమాటో సాస్ మరియు ఇతర రెడీ టూ ఈట్ వంటి ఆహారాల్లో సోడియం అధిక మొత్తంలో ఉంటుంది. ఈ ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు మరియు సంబంధిత కంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. మీరు షాపింగ్ చేసేటప్పుడు, మీకు ఇష్టమైన ఆహార పదార్థాలు కోనేటప్పుడు సోడియం ఎతం శాతం ఉందో .. చూసి కోనండి. సోడా, స్పోర్ట్స్ మరియు ఎనర్జీ డ్రింక్స్, ఇతర తీపి పానీయాలు చక్కెరతో నిండి ఉంటాయి. కొన్నిసార్లు 7 నుండి 10 టీస్పూన్లు చక్కెరను జోడిస్తారు. టైప్ 2 డయాబెటిస్ మరియు గుండె జబ్బుల యొక్క అసమానతలను చక్కెర పెంచుతుంది. ఇది డయాబెటిక్ రెటినోపతి మరియు AMD వంటి సంబంధిత కంటి పరిస్థితులకు దారితీస్తుంది.

ఆరోగ్యకరమైన పానీయం కోసం నీరు ఉత్తమం. కాఫీ కడుపులో పడనిదే రోజు మొదలుపెట్టలేని అలవాటు మనలో ఎక్కువ మందికి ఉంటుంది. అయితే రోజుకు రెండు పూటలు, రెండు సార్లు కాఫీ తాగడానికే పరిమితం అయితే ఫరవాలేదు. కానీ ఎక్కువ కెఫిన్ తీసుకుంటే ఇది కంటి లోపల ఒత్తిడిని లేదా ఇంట్రాకోక్యులర్ ప్రెజర్ పెంచుతుంది. IOP చాలా ఎక్కువగా ఉండటం వల్ల దృష్టి నష్టం మరియు అంధత్వం ఏర్పడతాయి.

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం వలన పెద్ద సమస్యల బారిన పడే ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. మన పోషణకు తగ్గ స్థాయిలో ఆహారాన్ని తీసుకుంటూ ఉండడం ద్వారా భవిష్యత్ లో కంటికి ఏ విధమైన సమస్యలూ రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

Leave a Comment