దేశాని రైతులే వెనుముక లాంటి వారు అలాంటి రైతులను ఆదుకోవాలనే లక్షంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టన పథకం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనా… ఈ పథకం ద్వారా అతివృష్టి, అనావృష్టి వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంది. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనా ద్వారా రైతులకు గుర్తించిన పంటలు, గుర్తించిన ప్రాంతాల వారికి తప్పనిసరిగా పంటరుణాలు ఇస్తారు. ప్రీమియంకు పరిమితి లేదు. రఖీ, ఖరీఫ్, ఉద్యాన/ వాణిజ్య పంటలకు 1.5%, 2%, 5% చొప్పున రైతులు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అలాగే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకు సీలింగ్ లేదు. నష్టపరిహారం ఎలా ఇస్తారు అంటే… అగ్నిప్రమాదాలు, తుఫాన్లు, వరదల తాకిడికి గురి అయి నష్టం సంభవించినా, పంటల కోత అయిపోయాక ఎటువంటి నష్టం సంభవించినా పరిహారం లభిస్తుంది. అయితే ప్రాంతాల వారీ పద్ధతి ప్రకారం ఇస్తారు. ఈ పద్ధతిలో ఒకే రకమైన సమస్యలున్న జిల్లాలను గుర్తించి వారికి ఇన్సూరెన్స్ కంపెనీతో జతపరుస్తారు.రిమోట్ సెన్సింగ్ సహాయంతో, స్మార్ట్ ఫోన్లు, డ్రోన్ల సహాయంతో వంటనష్టాన్ని అతి తక్కువ సమయంలో అంచనా వేసి నష్టపరిహారాన్ని చెల్లించడానికి వీలవుతుంది. పూర్వం అమలులో ఉన్న అన్ని పథకాల లోటుపాట్లను సవరిస్తూ ఈ పథకం ప్రవేశ పెట్టడం జరిగింది.
సాయిల్ హెల్త్ కార్డ్ పథకం
ఈ పథకం ద్వారా రైతుల పొలాలు, నేలలను పరిశీలించి కావాల్సిన పోషకాలను, ఎరువులు ఉపయోగించడం ద్వారా ఉత్పాదకత మెరుగుపరచడానికి సహాయం చేస్తారు. వివిధ రకాల పొలాలకు అవసరమైన పోషకాలు, ఎరువులను పంటల వారీగా సిఫారసు చేస్తారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ పథకం కింద సహాయం లభిస్తుంది. ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో సహాయం చేస్తాయి.
కృషి వికాస్ యోజన
ఈ పథకం కింద సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి, పండించిన పంటలను మార్కెట్కు అనుసంధానం చేస్తారు. ప్రాంతాల వారీగా దీనిని అమలుపరుస్తారు. పంటసాగు మొదలు మార్కెట్ వరకు సహాయం చేస్తారు.
జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈనామ్)
ఈ పథకంలో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి కంప్యూటర్ ద్వారా జాతీయ మార్కెట్కు అనుసంధానమై ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. చిన్న రైతుల బిజినెస్ కన్సార్టియం (ఎస్ఎఫ్ఎసి) ద్వారా ధన సహాయం లభిస్తుంది. లైసెన్సింగ్ విధానం సరళంగా ఉంటుంది. ఒకే లైసెన్స్తో రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో వ్యాపారం చేయవచ్చు. వ్యవసాయదారు నుండి హెూల్సేల్ వ్యాపారి కొనుక్కునే దానిపై సింగిల్ పాయింట్ ఫీజు వసూలు చేస్తారు. . ఇది కేంద్ర ప్రభుత్వం పథకం. ఇష్టం ఉన్న రాష్ట్రాలు దీనితో అనుసంధానం కావచ్చు. భూసార పరీక్షా కేంద్రాలు మార్కెట్లోనే ఉంటాయి.
చిన్నకారు రైతుల వ్యాపార కన్సార్టియం (ఎస్ఎఫ్ఎసి)
ఈ పథకంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడం, వ్యవసాయదారులతో అనుసంధానం కావడం. ఈ పథకం ద్వారా నూతన పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టడం, ప్రోత్సాహకాలు అందించడం. లబ్దిదారులు, రైతులు, రైతుసంఘాలు, సహకార సంఘాలు, స్వయం సహాయకసంఘాలు
కృషి విజ్ఞాన కేంద్రాలు (KVKs)
వ్యవసాయ రంగానికి విస్తరణ విభాగం కింద క్రిషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పడ్డాయి. ఇవి రైతులకు వ్యవసాయ రంగ నిపుణులకు, స్వచ్ఛంద సంస్థలకు అవసరమైన సలహాలు ఇచ్చేందుకు ఇరువురి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తాయి. వ్యవసాయదారులకు అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం, అన్నిరకాల విపత్కర పరిస్థితులను తట్టుకునే పద్ధతులను వివరిస్తాయి. కృషి విజ్ఞాన కేంద్రాలు రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం/కేంద్ర వ్యవసాయ సంస్థల ఆధీనంలో పనిచేస్తాయి.
నాగ్రామం – నా గౌరవం
ఈ పథకం కింద శాస్త్రవేత్తలు కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని ఆ గ్రామాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందేలా చూడాలి. శాస్త్ర వేత్తలు వివిధ కేంద్రాల్లో నూతన పద్ధతులను ప్రయోగించి, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద పనిచేయాలి. ఈ శాస్త్రవేత్తలు కె.వి.కె. లు ‘ఆత్మ’ లు వంటి సంస్థల సహాయంతో పనిచేస్తారు.
పశు సంవర్ధక శాఖ
ఈ పథకంలో దేశీయ పశువుల సంతతి అభివృద్ధి, సంరక్షణను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇది కేంద్ర ప్రాజెక్టు. దేశీయ పశువుల సంతతి వృద్ధి, పాల ఉత్పత్తి పెంచడం, వ్యాధిరహిత పశుసంతతి వృద్ధి పరచడం,రాష్ట్రీయ గోకుల మిషన్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధీనంలో నిర్వహించబడుతుంది. ఈ పథకం 100% గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది.
అమలు విధానం:
దేశీయ పశువుల సంతతి అభివృద్ధికై గోకుల గ్రామాల’ ఏర్పాటు. గోపాల సంఘాలు ఏర్పాటు చేసి మంచి పశుసంతతి అభివృద్ధికై కృషి, ‘గోపాల రత్న’, ‘కామధేను’ అవార్డుల ఏర్పాటు, పశుసంరక్షిత కేంద్రాలకు సహాయం చేయడం.
పశుదాన్ సంజీవని
పశువుల ఆరోగ్య సంరక్షణకై నకుల్ స్వాస్థ్య పత్రాల జారీ. పశువుల సంరక్షణకై జాతీయ డేటా ఆధారంగా యూనివర్సస్ నంబర్ యు.ఐ.డి. కేటాయింపు.