ఏపీలో మంచి ఊపుమీద ఉన్న జనసేన తెలంగాణాలో పోటీకి సిద్థంగా ఉంది. బీజేపీ సైతం జనసేనతో కలిసి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అందుకు అనుగుణంగానే ఇరుపార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో పొత్తుపై క్లారిటీ వచ్చినట్లే తెలుస్తుంది. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు జనసేనాని తెలంగాణ బీజేపి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లి వెళ్ళి అమిత్ షా ను కలిసారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో తెలంగాణ ఎన్నికలపై మొదట చర్చ జరిగింది. అందులో జనసేనాని పవన్‌కు అమిత్ షా ముందుగా తెలంగాణ ఎన్నికల్లో తమకు సహకరించాలని కోరారు. తెలంగాణ ఎన్నికల్లో సీట్ల పంపకాలు, పొత్తు, మద్దతుపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ – అమిత్ షా మధ్య జరిగిన చర్చల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయల గురించి ప్రస్తావన రాలేదంట. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో జనసేనాని సహకారం కోరారు.. ఇక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏపీలో చూద్దామంటూ అమిత్ షా పవన్ కళ్యాణ్‌కు ప్రతిపాదించినట్టు సమాచారం. దీనికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే తెలంగాణలో సీట్ల ఖరారుకు బీజేపీ-జనసేన పార్టీల నేతలు సమావేశం అవుతున్నారు. తెలంగాణాలో జనసేన 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు గతంలో జనసేన నేతలు ప్రకటించారు. ప్రస్తుతం పోత్తులో భాగంగా జనసేన 30 సీట్లు అగుతున్నారు. అయితే జనసేన అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి తెలంగాణ బీజేపీ సిద్ధంగా లేనట్టు ఉంది. ఆరు నుంచి పది సీట్లు జనసేనకు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అమిత్ షాతో బేటీలో పవన్ కల్యాన్ 20 సీట్లు కావాలని అడిగినట్టు సమాచారం.
ఇప్పటికే టీబీజేపి 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇలాంటి తరుణంలో సీట్ల గురించి రెండు వైపులా ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉంటుందో లేదో చూడాల్సి ఉంది. మరో పక్క బీజేపీ నవంబర్ 1న కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించి రెండో జాబితాను విడుదల చేయనుంది. మరోవైపు తెలంగాణలో టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ సిద్దంగా లేనట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే జనసేన -టీడీపీ ఉమ్మడి కార్యచరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ ఒంటరిగా, జనసేన, బీజేపీ పొత్తులతో పోటీ చేస్తే ఏపీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
Jai janasena