మనం వినడానికి క్రమబద్దంగా లేని ధ్వనులను శబ్దం అంటారు. ఈ శబ్దాలు అన్నీ సమయాలలో ఒకే రకంగా ఉంటే వీటి శబ్దాలు ఎకువగా ఉన్న ప్రదేశాలు పెరిగిపోతు ఉంటే వాటివలన ఆరోగ్యానికి హాని కలగడాన్ని ధ్వని కాలుష్యం అంటారు. అందుకే WHO సంస్థ పరిశ్రమలనుండి వెలువడే ధ్వని తీవ్రత అవధిని 75 db(decibels)గా నిర్దేశించారు. మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దానిలో భాగంగా ఆధునిక పరిజ్ఞానం పెరిగి పోవడంతో మనిషి యంత్ర పరికరాలను ఎక్కువగా ఉపయోగించడంలో ముందున్నాడు . ఇలాంటి సమయంలో వివిధ రకాలైన కాలుష్యాలు మనలోని అనారోగ్య రూపంలో చుట్టుముడుతుంటాయి. వాటిలో ఒకటి శబ్ద కాలుష్యం. దీని భారిన పడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది.
సాధారణంగా మనం వినే ధ్వనులు తక్కువ ఫ్రీక్వేన్సీ లో ఉంటాయి. అంటే 0- 20 డెసిబుల్స్ వరకు గల శబ్దాలు మనకు ఎలాంటి హాని చేయవు అంతకు మించిన శబ్దాలు మన ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపుతాయి. ఈ శబ్ద కాలుష్యం ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.
- 1 కోపం, చిరాకు వంటి మానసిక సమస్యలు వస్తాయి.
- 2 అధిక రక్తపోటు
- 3 చెవిలో హోరుమని శబ్దాలు వినిపిస్తుంటాయి.
- 4 వినికిడి శక్తిని కోల్పోవడం జరుగుతుంది
- 5 నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది
- 6 మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువ
- ఎక్కువ శబ్దాలను వినడం వలన శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉన్న పరిసరాలలో పనిచేయడం లేదా ప్రయాణించడం వలన మనకు తెలియకుండానే మనం ఎన్నో అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నాము
కాలుష్యానికి అనేక కారణాలున్నాయి
- 1 రవాణాకు సంబందించిన వాహనాల వలన అధిక ధ్వని కాలుష్యం కలుగుతుంది.
- 2 పారిశ్రామిక కార్యకలాపాల వలన
- 3 గృహ సంబందమైన పరికరాలైన కూలర్స్, మీక్షర్స్, ప్రెషర్ కుక్కర్స్ మొదలైన వాటిని ఎక్కువగా ఉపయోగించడం వలన
- 4 జనాభాలో అధిక శాతం మంది పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి టి.వి, వీడియోప్లేయర్స్ మొదలైన వాటిని విపరీతమైన శబ్దంతో ఉపయోగించడం వలన ధ్వని కాలుష్యం పెరిగిపోయి అనారోగ్య సమస్యలు ఎక్కువై పోతున్నాయి. దీనివలన చెవికి అలసట కలగడం అంటే 90 db తీవ్రత గల ధ్వనులను వినడం వలన అలసట నీరసం కలుగుతాయి.
- వారానికి 40 గంటలు 90db తీవ్రత గల ధ్వని కాలుష్యానికి గురైతే వినికిడి సామార్ధ్యాన్ని కోల్పోవడం వంటివి జరుగుతాయి.
ధ్వని కాలుష్యం వలన ఉద్రేకాలలో మార్పులు వస్తాయి. వీటి వలన హార్మోన్ ల పరిమాణాలలో తేడాలు వచ్చి అవయావాల పనితీరు మారిపోతుంది. దీని ఫలితంగా గుండె వేగంగా కొట్టుకోవడం
రక్తనాళాలు సంకోచించడం
జీర్ణాశయ సమస్యలు
అధికంగా చెమటలు పట్టడం
వికారం మొదలైన అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఇంకా సమాజానికి సంబందించిన ప్రచార కార్యక్రమాలు, విద్యాసంస్థలు, సంస్క్రతిలో బాగమైన దేవాలయాలు కూడా ధ్వని కాలుష్యంలో భాగమైపోతున్నాయి. పండుగలు, వివాహాలకు సంబందించిన బాణాసంచా వాయిద్యాలు మొదలైన వాటి వలన కూడా ధ్వని కాలుష్యం పెరిగిపోయి అనారోగ్య సమస్యలు వచ్చి జీవనవిధానంలో ఎన్నో హానికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 160డిబి దాటితే కర్ణభేరి త్వచం బద్దలైపోయి శాశ్వతంగా చెవిటితనం సంభవిస్తుంది