MK Stalin: విజయ్‌ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు…ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: స్టాలిన్‌

By manavaradhi.com

Published on:

Follow Us
MK Stalin Predicts Fall Of Vijay Government Soon

🔹విజయ్ నేతృత్వంలోనే టీవీకే ప్రభుత్వం ఏప్పుడైనా కూలిపోవచ్చన్న ఎంకే స్టాలిన్
🔹రాష్ట్రంలో రాబోయే ముందస్తు ఎన్నికలకు డీఎంకే పూర్తి సిద్ధంగా ఉండాలని సూచన
🔹ఓటమికి పూర్తి నైతిక బాధ్యత తనదేనంటూ వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదేనని జోస్యం
🔹ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: డీఎంకే శ్రేణులకు స్టాలిన్ పిలుపు

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన విజయ్‌ ప్రభుత్వం గురించి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌ (MK Stalin) సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ (Vijay) ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని, ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని డీఎంకే పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతూ స్టాలిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమి తాత్కాలికమేనని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని అన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో డీఎంకే కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడులో సూర్యుడు (డీఎంకే గుర్తు) ఎప్పటికీ అస్తమించడు అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి స్టాలిన్‌ బాధ్యత వహించారు. ఓటమికి గల కారణాలు విశ్లేషించి, ప్రజల నుంచి ప్రత్యక్ష అభిప్రాయాన్ని సేకరించేందుకు 36 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

అలాగే, సోషల్ మీడియాలో పార్టీ ఉనికిని పెంచుకోవాలని, ఒకప్పుడు టీ కొట్టులో చర్చించిన రాజకీయాలను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అయితే, స్టాలిన్ వ్యాఖ్యలపై టీవీకే వర్గాలు స్పందిస్తూ, తమ ప్రభుత్వానికి పూర్తికాలం కొనసాగేందుకు సరిపడా సంఖ్యాబలం ఉందని, రాజకీయ అస్థిరతకు అవకాశం లేదని ధీమా వ్యక్తం చేశాయి.

Leave a Comment