Janasena:ఇది ప్రజారాజ్యం టైంకాదు గురూ… అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ మహామొండోడు

By manavaradhi.com

Updated on:

Follow Us

మోగాస్టార్ గా వెండితెరను రారాజుగా ఏలుతున్న రోజుల్లో తనకు ఆస్థానంలో కూర్చోబెట్టిన ప్రజలకి ఏమన్న చేయాలనే తపనతో చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అతికొద్ద నెలల్లో 21 శాతం ఓట్లను సాధించారు. ప్రజారాజ్యం నుంచి 18 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాంటి అన్నకు తమ్ముడిగా అంతకన్నా ఎక్కువ అభిమానుల్ని సొంత చేసుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి దశాబ్ధ కాలం దాటుతున్నా ఎందుకు ఇప్పటికి ఒక్క ఎమ్మెల్యేతో సరిపెట్టుకున్నారు… అసలు రాజకీయాల్లో పవన్ ప్యూహం ఏంటి…? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పై ప్రజలు ముఖ్యంగా ఆయన అభిమానులు పెట్టుకున్న అసలు కుప్పకూలి పోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు… కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా.. ప్రజారాజ్యం పతనానికి కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో తమ శక్తి యుక్తులను వాడాయి.. అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంతే కాదు ఇక్కడ మనం ఒక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.. శత్రువుకి శత్రువు మిత్రులు అన్న చందాన తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసి పని చేశారని…. అలాగే మెగాస్టార్ చిరంజీవిని జీవిత రాజశేఖర్ తో నిత్యం తిట్టిస్తూ అక్కడితో ఆగకుండా ఏకంగా పదిమందికి ఉపయోగపడే బ్లడ్ బ్యాంక్ ద్వారా చిరంజీవి రక్తం అమ్ముకుంటున్నారని ఐ బ్యాంకు ద్వారా అవయవాల వ్యాపారం చేస్తున్నారని నోటికి వచ్చినట్లు విమర్శించారు. ఆవిధంగా తమకు అనుకూలమైన మీడియాలద్వారా ప్రచారం చేయించారు. అక్కడితో ఆగకుండా చిరంజీవి పిల్లికి కూడా బిచ్చంపేట్టరని రోజా లాంటి సినీ గ్లామర్ ఉన్న రాజకీయ నాయకులతో నిత్యం తిట్టిస్తూ పెద్ద రాజకీయమే నడిపారు…!. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఏకంగా కొన్ని వందల కోట్లను పబ్లిసిటీకి ఖర్చుపెట్టి ఎన్నికలు అయ్యేతం వరకు ప్రముఖ మీడియా హౌసెస్ ను రంగం లొ దించి 24 గంటలు చిరంజీవి పై దుమ్మెత్తి పోశారు….! ఆవిధంగా ప్రజలకు ఏదో చేద్దాం అని రాజకీయాలోకి వచ్చిన ఒక మంచి మనిషి మీద లేని పోని అబాండాలు వేశారు.

ఇంకేముంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు పూర్తిస్థాయిలో ప్రజారాజ్యం వైపు మళ్ల కుండా విష ప్రచారం ద్వారా 50 శాతానికి పైగా రావాల్సిన ఓట్లను 18 నుండి 21%.. వరకు తగ్గించి వేశారు. అప్పట్లో 90 శాతానికి పైగా ప్రజలు ఓటు కోసం డబ్బు తీసుకునేవారు కాదు. మనుషులను వ్యవస్థలను చూసి ఓట్లు వేసేవారు….! చిరంజీవి ప్రజారాజ్యం వచ్చాక ఓటుకు…నోటు చాలా పాపులర్ అయింది…! విచ్చలవిడిగా డబ్బును పంపకాలు చేశారు. ఇలా మనీ పాలిటిక్స్ కు, కుట్రలు, కుతంత్రాలకు ప్రజారాజ్యం బలి పశువు అయింది. వీటన్నిటిని తట్టుకొని చిరంజీవి నిలబడి ఉంటే.. ఈనాడు ఆయనే సీఎం అయ్యవారు కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యంని విలీనం చేయడం చిరంజీవి చేసిన చారిత్రాత్మకతప్పిదం దాని తాలూకు దుష్ప్రభావాలు ఇప్పటికీ జనసేనని… అలాగే పవన్ కళ్యాణ్ ను వెంటాడుతూనే ఉన్నాయి. దానికి ఉదాహరనే.. ప్రజారాజ్యం పెట్టి మూడు నెలల్లో సాధించిన 21 శాతం ఓటు బ్యాంకును.. సాధించడానికి జనసేనకు దశాబ్ద కాలం పట్టటం…!

ఇక్కడ చెప్పుకోవాల్సిందేంటంటే జనసేనాని పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పెట్టినప్పుడు.. అలాగే 2019లో ఒంటరి పోరుకు సిద్ధమైనప్పుడు ప్రజారాజ్యంపై ఎలా అయితే విషప్రచారంతో దాడి చేశారో అదే స్థాయిలో అంతకుమించి జనసేన పై దాడి చేయటం గమనార్హం. జనసేనని పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణలు దానికి పర్యావసానమే 2019లో కేవలం 6 శాతం ఓట్లతో ఒక్క సీటు మాత్రమే జనసేన సాధించగలిగింది. అయితే చివరికి ఆ ఒక్క సీటు వైసిపి లాకేసుకుందనుకోండి…! అదే వేరే విషయం.

అనుకూల మీడియా చానెల్స్, న్యూస్ పేపర్లు, శ్రీ రెడ్డి తో స్పెషల్ షోలు పెట్టి పవన్ కళ్యాణ్ అమ్మను కూడా తిట్టించడం, వర్మ సినిమాలు , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.. ఇలా అంది వచ్చిన ఏ అవకాశాన్ని… వదల్లేదు…! వీటన్నిటిని తట్టుకొని.. దశాబ్ద కాలంగా అలుపెరగని పోరాటం చేస్తూ.. వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ చేసిన దండయాత్ర ఫలితమే.. నేడు విభజన ఆంధ్రప్రదేశ్ లో 30 శాతానికి పైగా ఓటర్లు జనసేనాని వైపు చూస్తున్నారు. ఇక్కడే సరికొత్త రాజకీయానికి తెర లేపారు….! 2019లో జనసేన పై చేసిన ప్రధాన ఆరోపణలు… మూడు పెళ్లిళ్లు, దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ లను ప్రజలు నమ్మడం లేదు… పైగా పెద్ద ఎత్తున మహిళలు పవను ఆరాధిస్తున్నారు. ఇది వైసిపి, కాంగ్రెస్ పార్టీలకు మింగుడు పడని అంశం.

జనసేనకు బలం బలగం జనసైనికులు వారి చేతిలో వున్న సోషల్ మీడియానే వారి ఆయుధం. అందుకని జనసేన సోషల్ మీడియా పై ప్రత్యేకంగా కొన్ని టీంలను ప్రోత్సహిస్తూ దాడులు చేయడం మొదలుపెట్టాయి. అయితే ఆ దాడులను జనసైనికులు దీటుగా ఎదుర్కొంటున్నారు. ఇక వీర మహిళలైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వారిని ఆపడం ఎవరి తరం కావట్లేదు…! 2014 నుండి 2019… వరకు వచ్చిన ఆరు శాతం ఓట్లు… 2024లో 30% గా మారి….50 మంది ఎమ్మెల్యేలు… పదిమంది ఎంపీలు… అసెంబ్లీలో… పార్లమెంటులో… జనసేన వాణి ని… వినిపించనున్నారా…? అంటే అవునని అంటున్నాయి.. రాజకీయ వర్గాలు.

పవన్ వ్యూహం.. రెండు దశాబ్దాల.. పోరాటం.. తద్వారా.. రాష్ట్ర ప్రజల.. నమ్మకాన్ని వారి హృదయాలను గెలుచుకొని… రాజ్యాధికారం చేపట్టటం… దీనిని జన సైనికులు పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడం లేదు.. ఇలా రాజ్యాధికారం పై ఉన్న భిన్నభిప్రాయాలను ప్రత్యర్థులు…వాడుకుంటూ.. ప్రత్యేక స్టోరీలు, డిబేట్లు,అనుకూల మీడియాలో కథనాలతో… జన సైనికులలో చీలికలు పెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ పై పూర్తి నమ్మకంతో ఆయన తీసుకున్న నిర్ణయాత్మక ప్రకటనలకు గౌరవిస్తూ జనసేనాని ప్రశ్నించకుండా అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ముందుకు సాగితే పవన్ కల సాకరం అవ్వడానికి ఎంతో సమయం పట్టదు జనసైనికులు తెలివిగా ఆలోచిస్తారో లేదా కుట్రలకు బలవుతారో కాలమే నిర్ణయిస్తుంది.

ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా రాష్ట్రంలో సుస్థిర పాలన.. నెలకొల్పడానికి… తెలుగుదేశంతో చేతులు కలపడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు….! ఈ చర్యతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది… ఈ కలయిక నింపిన ఉత్సాహాన్ని యువగలం విజయయాత్ర, తెలుగుదేశం బహిరంగ సభలలో చూస్తూనే ఉన్నాం…! జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిజ్ఞ.. త్వరలో నెరవేరనుంది. జనసేన కండువా కప్పుకోవడానికి నేతలు క్యూ కడుతున్నారు…! అంబటి రాయుడు, బాలశౌరి,కొణతాల రామకృష్ణ,పడాల అరుణ,గుడివాడ నేతలు,మాజీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా ఎందరో నేతలు పవన్ పట్ల ఆకర్షితులవుతున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. 2024 లో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లను సమస్యలను జన శ్రేణులు.. ఎదుర్కొనే తీరును తెలుగుదేశంతో కలిసి వ్యతిరేక ఓటు చేయకుండా ప్రత్యర్థుల వ్యూహాలకు బలికాకుండా ఒక్క తాటిపై నిలబడతారా లేదా అన్నది… రెండు మూడు నెలల్లో తేలనుంది.

Leave a Comment