ఐపీఎల్ మినీ వేలంలో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు. రూ. 2 కోట్లతో బరిలోకి దిగిన స్టార్క్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య తీవ్ర పోటీ జరిగింది. చివరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 24.75 కోట్లకు దక్కించుకుంది.
ఐపీఎల్ చరిత్రలో ప్యాట్ కమిన్స్ కూడా రికార్డు సృష్టించాడు. కమిన్స్ కనీస ధర రూ. 2 కోట్లు అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ మధ్య తీవ్ర పోటీ జరిగింది. దీంతో రూ. 20.5 కోట్ల ధరను దక్కించుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. డారిల్ మిచెల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. రూ. 14 కోట్లు పెట్టి దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్ చివరి వరకూ పోటీ పడింది. భారత పేసర్ హర్షల్ పటేల్‌కు రూ. 11.75 కోట్లు దక్కాయి. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. హర్షల్ పటేల్ కోసం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. అల్జారీ జోసెఫ్‌కు భారీ ధర దక్కింది.రూ. కోటి కనీస ధరతో బరిలోకి దిగాడు. చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడ్డాయి. చివరికి రూ. 11.5 కోట్లతో ఆర్‌సీబీ సొంతం చేసుకుంది.
విండీస్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ భారీ ధరను సొంతం చేసుకున్నాడు. పావెల్ కోసం కోల్‌కతా, రాజస్థాన్ నువ్వ నేనా అన్నట్లు పోటీపడ్డాయి. అయితే చివరికి రాజస్థాన్ రాయల్స్ పావెల్ ను రూ. 7.40 కోట్లుకు దక్కించుకుంది. హ్యారీ బ్రూక్ రూ. 4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఆసీస్ టాప్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ రూ. 2 కోట్లతో బరిలోకి దిగాడు. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోసం పోటీపడ్డాయి. దీంతో అతడి రేట్ పెరిగిపోయింది. చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 6.80 కోట్లకు సొంతం చేసుకుంది. ఆల్‌రౌండర్ వనిందు హసరంగను హైదరాబాద్ సొంతం చేసుకుంది. రూ. 1.50 కోట్లకు దక్కించుకుంది. రచిన్ రవీంద్రకు రూ. 1.8 కోట్లు మాత్రమే దక్కాయి. రచిన్‌ను సొంతం చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.చివరికి సీఎస్‌కే దక్కించుకుంది.
యువ బౌలర్ శివమ్ మావిని లఖ్‌నవూ సొంతం చేసుకుంది. రూ. 6.4 కోట్లు వెచ్చించి తీసుకుంది. మావి కనీస ధర రూ. 50 లక్షలు. భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌కు జాక్‌పాట్ తగిలింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన ఉమేశ్‌ను గుజరాత్ టైటాన్స్ తీసుకుంది అతడి కోసం ఏకంగా రూ. 5.8 కోట్లు వెచ్చించింది. భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు రూ. 4 కోట్లు దక్కాయి. కనీస ధర రూ. 2 కోట్లతో శార్దూల్ వేలంలోకి వచ్చాడు.చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అఫ్గాన్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను గుజరాత్ దక్కించుకుంది.బేస్ ప్రైస్ రూ. 50 లక్షల వద్దే గుజరాత్ అతడిని తీసుకుంది. దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయిట్జీని ముంబయి సొంతం చేసుకుంది. రూ. 5 కోట్లకు కోనుగోలు చేసింది. ఇంగ్లాండ్ పేస్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ రూ. 4.2 కోట్లు దక్కించుకున్నాడు. పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. అతడి బేస్ ప్రైస్ రూ. 2 కోట్లు . ట్రిస్టన్ స్టబ్స్‌ను రూ. 50 లక్షలకు దిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. కేఎస్ భరత్‌ను రూ. 50 లక్షలకు కోల్‌కతా దక్కించుకుంది. చేతన్ సకారియాను రూ. 50 లక్షలకు కోల్‌కతా తీసుకుంది.