Healthy Living: కొన్ని టిప్స్ పాటించ‌డం ద్వారా గుడ్ హెల్త్ ను సొతం చేసుకోవచ్చు

By manavaradhi.com

Published on:

Follow Us
Healthy Lifestyle

మంచి అలవాట్లు మనం హాయిగా జీవించటానికి, మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే ప్రస్తుత బిజీ ప్రపంచంలో రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నింటికి ఒక్కటే సరైన పరిష్కారం అంటున్నారు వైద్యనిపుణులు. కొన్ని టిప్స్ పాటించ‌డం ద్వారా గుడ్ హెల్త్ ను సొతం చేసుకోవచ్చు.

బరువు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు బరువు పెరగడం ప్రధాన కారణంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడం ద్వారా అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. శరీర బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ద్వారా మీ బరువు ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. BMI సమతుల్యంగా ఉన్నవారిలో గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి వచ్చే అవకాశాలు తక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునేవారు BMIను ప్రామాణికంగా తీసుకుని కసరత్తులు మొదలుపెట్టాలి.

హైబీపీ సమస్య ఉన్నప్పుడు రక్త నాళాల గోడలపై ఒత్తిడిని కలగజేస్తూ రక్తం పంప్ అవుతుంది. దీని వల్ల రక్తనాళాల గోడలు కుచించుకుపోయి గుండె జ‌బ్బులు రావ‌డానికి అవ‌కాశాలు ఏర్ప‌డుతాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్త పోటు 120/80 గా ఉండాలి. అయితే హైప‌ర్‌టెన్ష‌న్ స‌మ‌స్య‌తో బాధ‌పడేవారిలో ఈ న‌మోదు 130/90 మి.మీ. అంతకన్నా అధికంగా ఉంటుంది. నిత్యం ఏదో ఒక పనిలో, ఏదో ఒక ఒత్తిడితో సతమతం అవుతూంటే మెదడుపై భారం పెరిగిపోతుంది. అందువల్ల అప్పుడప్పుడూ.. అన్ని రకాల పనులు, ఒత్తిళ్లకు దూరంగా సరదాగా గడపడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యాయామం తప్పనిసరి. బ్రిస్క్‌ వాక్‌ వల్ల శరీరం, మెదడు రెండూ చేతనంగా తయారవుతాయి. తీవ్ర అనారోగ్యాలు, ఆందోళన, ఒత్తిడిలు తొలగి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 40 నిమిషాల నడక అవసరం. నడక వల్ల ఎక్కువ గాలిని పీల్చుకుంటాం. దాంతో ఊపిరితిత్తులకు, మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అంది అవి మెరుగ్గా పని చేస్తాయి. ఆరోగ్యం విషయంలో ఆహారాలు ముఖ్యమైన పాత్రను పొషిస్తాయి. అందుకే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని, ఎంత మేర తీసుకుంటన్నామని గుర్తు పెట్టుకుని మంచి డైట్ తీసుకోవాలి.

ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు ఎదురౌతాయి. దీని కోసం పండ్లు, కూరగాయాలు, ఆకు కూరలు, చేపలు అధికంగా తీసుకోవాలి. మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాలి. డిప్రెషన్ లో ఉండడం కూడా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసి, తద్వారా శారీరక ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. అందుకే మంచి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించాలి. చెడు అలవాట్లు మానుకుని, మంచి ఆహారాన్ని తీసుకుంటూ, రోజూ వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి దూరంగా ఉండడం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.

శీతలపానియాలు అధికంగా తాగితే బరువు త్వరగా పెరుగుతారు. వాటిలో ఉండే చక్కెర శరీరంలో కొవ్వుని పెంచుతుంది. ఫలితంగా డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్లు కూల్ డ్రింక్స్ దూరంగా ఉండాలి. వాళ్లు, వీళ్లు అని కాదు ఎవరైనా సరే కూల్ డ్రింక్స్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నిద్రపోవడం అంటే అందరికీ ఇష్టమే. సాధారణంగా చాలా మంది సమయం దొరికితే చాలు, ఒక్క సెలవు దొరికితే చాలు హ్యాపీ నిద్రపోవాలి. రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం. ఎంత అవసరం అంటే ఆరోగ్యానికి మంచి చేసేంత.

ప్రతిరోజు 6 నుండి 8 గంటల పాటూ నిద్రపోవటం ఆరోగ్యానికి మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 9 గంటల కంటే ఎక్కువ సమయం పాటూ నిద్రపోవటం వలన శరీర విధులలో ఆటంకాలు ఏర్పడతాయి. అతినిద్ర వలన పూర్తి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒక సమయానికి నిద్రలేవడం చాలా మంచిది. పొగ తాగడం, అధికంగా మద్యం సేవించడం లాంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఎక్కువగా మద్యాన్ని సేవించడం వల్ల దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మద్యానికి దూరంగా ఉంటే మంచిది.

Leave a Comment