Blood Pressure : ఈ నియమాలతోనే ‘బీపీ’ దూరం..!

By manavaradhi.com

Published on:

Follow Us
Blood Pressure

హైబీపీ అనేది నేటి త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న‌ది. చాప కింద నీరులా ఇది అనేక మందికి వ‌స్తుంది. అయితే హైబీపీ ఉంటే దాని ల‌క్ష‌ణాలు కూడా చాలా మందికి తెలియ‌వు. దీంతో హైబీపీ ఉంద‌ని తెలుసుకునే స‌రికే జ‌రగాల్సిన న‌ష్టం జ‌రిగిపోతుంది. హై బీపీని ముందుగానే గుర్తిస్తే దాంతో జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. ముఖ్యంగా సరైన జీవనశైలి ద్వారా బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.

బీపీ అంటే తెలియని వారు ఉండటరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులోనూ అధికంగా హైబీపీకి గురిఅవుతున్నట్లు చాలా అధ్యాయాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు 120/80 నమోదు కావచ్చు. సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది. అధిక రక్తపోటుకు కారణాలు అనేకం ఉంటాయి. ఒత్తిడి, ఉప్పు అధికంగా తినటం, డయాబెటీస్ వంటివి అధిక ర్తపోటుకు కారణాలుగా చెప్పవచ్చు.

అధిక రక్తపోటు ఉంటే, గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. సాధారణంగా ఇతర సమస్యలకోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అధిక రక్తపోటుని గుర్తిస్తుంటారు. లేదా రక్తపోటు కారణంగా ఇతర అనారోగ్యాలు వచ్చినప్పుడు వాటి చికిత్సకు ఆసుపత్రికి వెళితేనే… అధిక రక్తపోటు ఉన్న విషయం బయటపడుతుంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా బీపిని చెక్ చేయించుకుంటూ ఉండాలి.

ర‌క్త‌పోటు స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే వ్యాయామాలు ఒక్క‌టే మార్గం. శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, ఊబ‌కాయం వంటి కార‌ణాల వ‌ల్ల ర‌క్త‌పోటు పెరుగుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అందుక‌ని శ‌రీరాన్ని అదుపులో పెట్టుకొని స‌రైన బ‌రువును మెయింటేన్ చేయ‌డం ద్వారా ర‌క్త‌పోటును అదుపులో ఉచంచుకోవ‌చ్చు.ర‌క్త‌పోటు ముఖ్యంగాఆందోళ‌న‌, ఒత్తిడికి గుర‌య్యే వారిలో ఎక్కువ‌గా ఉంటుంది. కాబట్టి ఒత్తిడి, ఆందోళ‌న‌ను కూడా త‌గ్గించుకోవాలి. వీటిని కేవ‌లం వ్యాయామాల‌తోనే జ‌యించ‌వ‌చ్చు. వేటి కార‌ణంగా ఒత్తిడి, ఆందోళ‌న పెరుగుతుందో గ‌మ‌నించి వాటిపై దృష్టిసారించాలి.

నడక, జాగింగ్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే. అందరికీ ఇవి మేలు చేస్తాయి. రక్తపోటు వ్యాధిగ్రస్తులకు అయితే వ్యాయామం తప్పనిసరి. నడక, జాగింగ్ లాంటి తేలికపాటి సాధారణ వ్యాయామాలు కనీసం గంట చేయాల్సి ఉంటుంది. బ్రిస్క్ వాకింగ్ మరింతగా ఉపయోగపడుతుంది. వేగంగా నడవడం వలన రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీంతో రక్తంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలు క్రమంగా కరుగుతాయి. వ్యాకోచం, సంకోచాలు పెరగడం వలన రక్తనాళాల సామర్ధ్యం పెరిగి రక్తప్రవాహం నిలకడగా ఉంటుంది.

ఆరోగ్యకర ఆహారం అనేది చాలా ఉపయోగకరం. ఎందుకంటే పొట్టు తీయని ధాన్యాలను తింటే పోషకవిలువలు మెండుగా అందుతాయి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు మెనూలో చేర్చుకోవాలి. ప్రతి రోజు ఉదయం సాయంత్రంవేళల్లో బీపీని అదుపుచేసే ఆహారం తీసుకోవడం వల్ల ఫలితాలు బాగుంటాయి. తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవాలి. బీపీ రోగులకు ఆహారంలో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉండాలి. పొటాషియం వల్ల సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది.

పొటాషియం ఉన్న ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. శరీర బరువు పెరిగిన వెంటనే రక్తపోటు కూడా పెరుగుతుంది. బరువు తగ్గించుకుంటే రక్తపోటును నియంత్రించవచ్చు. నడుము చుట్టూ కొవ్వు చేరడం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ఆరోగ్యంగా తినడం ద్వారా బరువు తగ్గవచ్చు. అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే ఉప్పు తీసుకోవడం మితంగా ఉంచాలి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం ఉంటుంది. ఇది శరీరం నుండి ద్రవాన్ని బహిష్కరించడం కిడ్నీకి చాలా కష్టమవుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది.

ఉప్పును మితంగా తీసుకోండి. ఆహారంలో మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు చేర్చండి. బిపిని క్రమం తప్పకుండా పరీక్షించడం వల్ల రక్తపోటు సమస్యను మరియు రక్తపోటు హెచ్చుతగ్గులను గుర్తించవచ్చు. పెద్ద ఎత్తున హెచ్చుతగ్గులు ఉంటే మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి.

Leave a Comment