Janasena: జనసేన పార్టీకి యువత బలం చూసి బిజెపి (BJP)పెద్దలే ఆశ్చర్యపోయారు : పవన్‌

By manavaradhi.com

Updated on:

Follow Us

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్‌ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన(Janasena)కు ఈ రోజు ఆరున్నర లక్షల క్యాడర్‌ ఉంది, యువతే జనసేనకు పెద్ద బలంగా ఉందన్నారు అధినేత పవన్‌ కల్యాణ్‌. జనసేన పార్టీకి యువత బలం చూసి భారతీయ జనతా పార్టీ (BJP) పెద్దలే ఆశ్చర్యపోయారు. జనసైనికుల చిత్తశుద్ధి వల్లే జనసేన పార్టీకి ఢిల్లీలోనూ మంచి గుర్తింపు వచ్చింది. నన్ను, నా భావజాలాన్ని నమ్మే యువత వెంట వస్తున్నారు. ఇంతమంది అభిమానుల బలం ఉందని మనకు ఎప్పుడు గర్వం రాకూడదు. పొరుగు రాష్ట్రాల యువత కూడా జనసేనకు మద్దతిస్తున్నారు. యువత ఆదరణ చూసే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేశాం. ఖమ్మం, మధిర, కూకట్‌పల్లి, దుబ్బాక ఎక్కడికెళ్లినా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతిచ్చారు.

వైస్ ఆర్ కాంగ్రెస్ నేతలు పన్నే కులాల ఉచ్చులో జనసైనికులు చిక్కుకోవద్దని పార్టీ శ్రేణులకు పవన్‌ కల్యాణ్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ సుస్థిరత, సమైక్యత, అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్న ఆయన.. పొత్తు గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు వైసీపి కోవర్టులేనన్నారు. నేను మొదటినుంచి పదవులు కోరుకోలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు సేవచేయాలని అనుకున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన కలిసి పనిచేశాయి. వైసీపిను తట్టుకునేందుకు కలిసి పనిచేస్తున్నామని వాళ్లు చెప్పారు. మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌ను కూడా వీళ్లు బెదిరిస్తారు. అవమానం జరిగినా.. దెబ్బపడినా ఎప్పటికీ మరిచిపోను. ఒక కులం మీద రాజకీయాలు నడపలేం..సాధ్యం కాదు. ఓడిపోయినప్పుడు మనకు అండగా ఎవరుంటారు అనేదే ముఖ్యం. పార్టీ నుంచి వెళ్లిపోతామని అనేకమంది బెదిరించారు. ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని ఆ నాయకులకు చెప్పా. మాకు ప్రజలు ముఖ్యం నాయకులు కాదు. మనం తెదేపా వెనుక నడవడం లేదు.. కలిసి నడుస్తున్నాం. షణ్ముక వ్యూహంతో చెప్పినవన్నీ అమలు చేస్తాం’’ అని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

Leave a Comment