Pawan Kalyan – రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు చేయని సాహసం పవన్‌ కల్యాణ్‌ చేశారా

By manavaradhi.com

Published on:

Follow Us
Pawan Kalyan

పార్టీకి జనసేన అన్న పేరు పవన్‌ కల్యాణ్‌ ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్ధం అవుతుంది. ప్రతీ పార్టీకి ఏదో ఒక పేరు ఉంటుంది. కాని దానికి అర్ధం వచ్చినట్టు చేసే పనుల్లో కనిపించవు. కాని పవన్‌ పార్టీకి పెట్టిన పేరును క్షేత్రస్థాయిలో నిజం చేస్తున్నారు. ఇదొక సైన్యం.. అందరూ సైనికులే.. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఉంటారు జనసైనికులు.. అలాగే అధినేత పవన్‌ కూడా శుక్రవారం జరిగిన పోర్టు సంఘటనలో జనసేనానిగా నిలిచారు. రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకుడు చేయని సాహసం పవన్‌ చేశాడండే.. అతనిలో ఉన్న ధైర్యం, సాహసం ఏమిటో అర్ధం అవుతుంది.

గత వైసీపీలో జరిగిన అక్రమాలను ఎత్తి చూపినందుకు పవన్‌ను వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. సోషల్‌ మీడియాలో కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకు లాగారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అక్రమాలపై తీసుకున్న చర్యలు దాదాపు లేవనే చెప్పాలి. దీంతో వైసీపీ మాఫియా తన కార్యాకలాపాలను మళ్లీ ప్రారంభించింది. నాడు వైసీపీ నేతలు ఇచ్చిన మూమూళ్లకు అలవాటుపడిన అధికారులు ఇప్పుడు కూడా వారి అక్రమ వ్యాపారాలకు సహకరిస్తున్నారనడానికి పోర్టు సంఘటనే. పవన్‌ కల్యాణ్‌ అడిగిన ఏ ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. అక్కడ మాఫియా ప్రమాదం ఉన్నా.. అధికారులు హెచ్చరిస్తున్నా.. ఓడలోని సరుకును స్వయంగా తనిఖీ చేశారంటే హాట్సాప్‌ అనాల్సిందే.. ఇలాంటి నాయకులు అరడజను మంది ఉంటే చాలు..రాష్ట్రంలో అక్రమం, అవినీతి అనే పదాలే వినపడవు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల కాలంలో తనదైన శైలిలో అడుగులు ముందుకు వేస్తున్నారు. మూడు నెలలుగా కాకినాడ పోర్టుకు వెళ్లాలని ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. మీరు వెళితే వేల మంది పనివాళ్లకు పొట్టకొట్టినట్ల్కెందంటూ ఆపివేస్తున్నారు. ఇదేమిటని చాలా రోజులు ఆలోచించా. ఇవ్వాళ వెళదామనుకున్నా. ఎవరు చెప్పినా వినలేదు. వచ్చా… చూస్తే కాకినాడ పోర్టు దొంగరవాణాకు కేంద్రంగా మారిందని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఈ సమయంలో డ్రోన్‌ కెమెరా పోర్టులోని ఓడలు, వాటిల్లో ఉన్న సరుకు, ఇతర వస్తువులు కళ్లకు కట్టినట్లు చూపించింది. ముందు రోజు ఎక్కడైతే జిల్లా కలెక్టర్‌ సగిలి షాన్‌ మోహన్‌ వెళ్లి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారో అక్కడి వరకు ఓడలో వెళ్లి పరిశీలించారు. అక్కడికి వెళ్లేందుకు ముందు అధికారులు వద్దన్నారు. అయినా వెళ్లి రావాల్సిందేనంటే తీసుకెళ్లారు. వెళ్లిన తరువాత ఓడ చుట్టూ తిప్పుతున్నారు. కానీ ఓడలోకి ఎక్కనివ్వడం లేదు. చూడండి ఎంత దారుణంగా ఉందో ఒక ఉప ముఖ్యమంత్రికే ఇక్కడ దిక్కులేకుండా ఉందని వ్యాఖ్యానించారు.

ఆయన విశాఖ పోర్టులో గతంలో దొరికిన కొకైన్‌ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇలా విదేశాల నుంచి ఏదైనా రావొచ్చు. మన దగ్గరి నుంచి ఏదైనా వెళ్లొచ్చు. ఇక్కడ చెకింగ్‌ అంటూ ఏమీ లేదు అంటూ మండిపడ్డారు. ఇవన్నీ నోట్‌ చేసుకోవాల్సిందిగా తన పీఎస్‌కు డైరెక్షన్‌ ఇస్తూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల స్థాయిలో కాకినాడ పోర్టుకు వెళ్లి ఇటువంటి అవినీతిని ఇప్పటి వరకు ఎవ్వరూ బయట పెట్టలేదు. ఎప్పుడైనా ఎవరైనా వెళితే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు మాత్రం వెళతారు. పవన్‌ కళ్యాణ్‌ అలా కాకుండా కోటాను కోట్ల విలువైన రేషన్‌ బియ్యం, సాదారణ మిల్లు బియ్యం ఎటువంటి అనుమతులు లేకుండా ఖండాలు దాటుతుండటాన్ని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.

Leave a Comment