పవన్ కళ్యాణ్ అంత పెద్ద హీరో అయినా ఎదో వెలితి. సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూసి దేశం కోసం మరేదో చెయ్యాలనే తపన ఆయనలో మొదలైంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతిపరుల అరాచకాలు చూసి జనం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ స్థాపించారు. 2014 ఎన్నికలలో ఏపీలో పోటీచేయకుండా.. ప్రధాని మోడీ, చంద్రబాబుకు మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. అయితే ఆయనకు నిరాశే ఎదురైంది. అయినా కూడా జనం కోసం ఇప్పటికీ పోరాడుతున్నారు. ఎవరైనా గెలిచే కొద్దీ బలపడతారు, కానీ జనసేన మాత్రం దెబ్బపడే కొద్దీ బలోపేతం అవుతుంది. ఒక్కడిగా ప్రారంభమైన జనసేన ఈరోజు 7 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలను సంపాదించుకుంది. పదేళ్లలో మాటలు పడ్డారు, మన్ననలను పొందారు, ఓటములను ఓరిమితో ఎదుర్కొన్నారు జనసేనాని. ఈ ఆశతోనే ఎప్పటికైనా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న దృడ సంకల్పంతో ప్రజా క్షేత్రంలో ముందుకు వెళుతున్నారు.
అసలు ఆయనకు ఎమి తక్కువ? డబ్బు కావాలంటే వందల, వేలకోట్లు సంపాదించే స్థితి, స్థాయి ఉంది. సంఘంలో పెద్ద పేరు ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి సేవ చెయ్యాలని ఆలోచనతో రాజకీయంలోకి అడుగుపెట్టారు. ఆయన ఏమి చేసినా నిరంతరం ప్రజలకు ఎదో చెయ్యాలనే తపన ఉంది.ఉన్నది ఉన్నట్టు… జరిగింది జరిగినట్టు బహిరంగంగా ఒప్పుకోవడం… అది తన వ్యక్తిగత జీవితం అయినా రాజకీయం జీవితం అయినా ఏదైనా ఆయన ఉన్నది ఉన్నట్టు చెపుతారు పవన్. నేను ఏదైనా తప్పు చేసినా అది ప్రజల దగ్గర బహిరంగంగా ఒప్పుకుంటాను అంటూ ఆయన అనడం అందరికి సాధ్యం అయ్యే విషయం కాదు. నా జీవితం తెరచిన పుస్తకం, మీలా నేను ఏది దాచుకోను అది నా పెళ్ళిళ్ళు అయినా నా రాజకీయ జీవితం అయినా అంటూ పోరాటయాత్రలో చెప్పడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం.
ఆయన అడుగు వేస్తే ఒక సైన్యమే వెనుక నడుస్తుంది. పోటీలో ఓడిపోయి ఉండవచ్చు.. ఆ ఓటమినే గెలుపుకు నాందిగా మలుచుకోవడం ఆయనకు పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం ఆయన చేస్తుంది కూడా అదే. అవినీతి రహిత సమాజం కోసం నడిచే దారిలో.. ముందుగా తట్టుకుంటాడా? నిలబడతాడా? అనేది చూడడానికి ఓటమి ఎదురైంది. తట్టుకున్నాడు.. నిలబడ్డాడు.. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతిగా అవతరించాడు. ఆయన ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ఒక్క నాయకుడూ లేడక్కడ. మైక్‌ల ముందు అరిసేవారే కానీ.. ప్రజల ప్రాబ్లమ్స్ చెప్పినా.. పట్టించుకునేదెవరక్కడ. వాళ్లు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా.. నేనున్నానంటూ ఆపన్నుడికి హస్తం అందించిన అసలు సిసలైన లీడర్ పవన్ కల్యాణ్. ఆయన చేస్తున్న యజ్ఞం.. తరువాత తరం మంచి నడవడిక కోసం నిర్మించే వారధి. అదెంత స్ట్రాంగ్‌గా ఉండబోతుందో.. త్వరలోనే అందరికీ అర్థమవుతుంది.
జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… రీల్ లైఫ్ హీరో మాత్రమే కాదు రియల్ లైఫ్ హీరో…. ఇప్పటికే కొన్ని వందల మందికి… కొన్ని కోట్ల రూపాయల గుప్తదానాల చేసాడు.. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా మరణించిన కౌలు రైతుల కుటుంబాల కోసం లక్ష రూపాయలు చొప్పున మూడు వేల కుటుంబాలకి ఆర్థిక సాయం చేసిన గొప్ప వ్యక్తి. ఇప్పటం గ్రామంలో తనకు స్థలాలు ఇచ్చారని ప్రభుత్వం కక్ష గట్టి వాళ్ల ఇళ్లను పగలగొడితే లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసిన వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్. సైనిక సంక్షేమ నిధి దగ్గర్నుంచి వికలాంగుల క్రికెట్ బోర్డు వరకు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కొన్ని కోట్లు దానం చేశాడు చేస్తూనే ఉన్నాడు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని రెండు చోట్ల ఓడించిన ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెల్లుతుంది.
good