Salaar Movie Review : సలార్‌ మూవీ రివ్యూ – ప్రభాస్‌ ఖాతాలో మరో హిట్‌ పడిందా?

By manavaradhi.com

Updated on:

Follow Us

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన రెబల్ స్టార్ ప్ర‌భాస్‌ (Prabhas)తో కలిసి కేజీఎఫ్ తో తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెరక్కెంచిన చిత్రం ‘స‌లార్‌’. ఈ చిత్రం మీద అటు ప్రభాస్ అభిమాలనులు, దర్శకుడు ప్రశాంత్ నీల్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు అని చెప్పవచ్చు. ఎప్ప‌ట్నుంచో ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి మరో ప్రత్యేకత ఏంటంటే మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టించడం మ‌రో అదనపు ఆక‌ర్ష‌ణ‌గా చెప్పవచ్చు.

‘స‌లార్‌’ చిత్రం కోసం ప్రశాంత్ నీల్ ఖాన్సార్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కథ మొత్తం దీని చుట్టు తిరుగుతుంది. ప్రశాంత్ అంటే హీరోయిజం, ఎలివేషన్ల ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పకర్లలేదు.. మంచి ఎలివేష‌న్ల‌తో ప్ర‌భాస్‌ని చాలా రోజుల త‌ర్వాత అభిమానుల‌కి న‌చ్చేలా ఎలా చూపించాలో అలా చూపించాడు దర్శకుడు… ముఖ్యంగా సలార్ లో డ్రామాకి తగిన ప్రాధాన్యం ఇస్తూ కథను ముందుకు నడిపించాడు. ఇక ఈ సినిమా కథలోకి వెళితే ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి క‌ర్త గా రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) వ్యవహారిస్తుంటాడు. అయితే అది చాలా పెద్ద సామ్రాజ్యం కాబట్టి ఖాన్సార్ లోని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరూ దొర‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఆ దొరలందరికి కర్త రాజమన్నార్ అంటే జగపతిబాబు. అయితే ఖాన్సార్ లో క‌ర్త కుర్చీ కోసం కుళ్ళు, కుతంత్రాలు మొద‌ల‌వుతాయి. రాజమన్నార్ మాత్రం తాను ఉండగానే తన కొడుకైన వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ను దొరగా చూడాలనకుంటాడు. కొన్నాళ్లు ఆయ‌న త‌న సామ్రాజ్యాన్ని వ‌దిలి తిరిగొచ్చేలోపు ఖాన్సార్ క‌థ మొత్తం మారిపోతుంది. కుర్చీ కుతంత్రాలు తారా స్థాయికి చేరుకుని వ‌ర‌ద రాజ‌మ‌న్నార్‌ని అంతం చేయ‌డం వ‌ర‌కూ వెళుతుందీ వ్య‌వ‌హారం. అందుకోసం మిగ‌తా దొర‌లంతా కలసి త‌మ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు. వారి ఎదిరించడానికి వరద మాత్రం తన చిన్ననాటి మిత్రుడు దేవా (ప్రభాస్) సహాయంకోరతాడు. అంత పెద్ద సైన్యాన్ని ప్రభాస్ ఒక్కడే ఎలా ఎదిరిస్తాడు..? త‌న ప్రాణ స్నేహితుడు వ‌ర‌ద కోసం హిరో ఏం చేశాడు? అసలు ఇంతకీ దేవాకు స‌లార్ అనే పేరెలా వ‌చ్చింది? ఈ మూవీలో హీరోహిన్ శృతిహసాన్ పాత్ర ఏంటి…? వంటివి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

ప్రభాస్ అభిమానులు ఆశించిన అన్ని ఎలిమెంట్ల్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా కథని చిన్ననాటి మిత్రులతో మొదలు పెట్టిన దర్శకుడు ఇదే క‌థ‌ని వెయ్యేళ్ల కింద‌టి చ‌రిత్ర‌తో ముడిపెడుతూ చూపించ‌డం సగటు ప్రేక్షకుడిలో మరింత ఆస‌క్తిక‌రంగా మలచడంలో ప్రశాంత్ నీల్ విజయవంతం అయ్యాడనే చెప్పాలి. సినిమాలోని ఒక్కోక్కరిని కథకు అనుగుణంగా పరిచయం చేస్తూ కథ ముందుకు సాగుతుంది. ప్ర‌థ‌మార్ధంలో చాలా సేప‌టివ‌ర‌కూ హీరోయిజం క‌నిపించ‌దు. ఫస్టాఫ్‌లో ఈశ్వ‌రీరావు, సెకండాఫ్‌లో పృథ్వీరాజ్ సుకుమార‌న్ పాత్ర‌లు హీరో పాత్ర‌ని కొంచ నియంత్రిస్తూ ఉన్నట్లు క‌నిపిస్తాయి. అయితే ఒక్క‌సారి చేతికి క‌త్తి అందాక ఇక వెనుదిరిగి చూడ‌డు ప్ర‌భాస్‌. ఒక్క‌సారిగా హీరోయిజం చూసి అభిమానులైతే ధియోటర్ లో పూనకంతో ఊగిపోతారు. ముఖ్యంగా కాట‌మ్మ త‌ల్లికి బ‌లి ఇచ్చే సంద‌ర్భంగా వ‌చ్చే పోరాట ఘ‌ట్టం సినిమాని ఒక రేంజ్ లో తీసుకువెళుతుంది. ద్వితీయార్ధంలో అస‌లు క‌థ ఉన్న‌ప్ప‌టికీ… రాజ మ‌న్నార్ కుర్చీ చుట్టూ అల్లిన కుతంత్ర‌పు డ్రామా, కుటుంబ పాత్ర‌ల మ‌ధ్య వ‌ర‌సలు కొంచెం గజిబిజి అనిపిస్తాయి. అయితే ప‌తాక స‌న్నివేశాల్లో మ‌లుపు ర‌క్తి క‌ట్టిస్తుంది. ప్ర‌భాస్ అస‌లు పాత్ర అక్క‌డ ప‌రిచ‌యం కావ‌డం రెండో భాగం స‌లార్‌పై ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.

ఇక ఈ సినిమాలో నటన పరంగా ఎవరెవరు ఎలా చేశారంటే.. హీరో పాత్రలో ప్ర‌భాస్ త‌న అభిమానులు ఆశించిన‌ట్టుగా తెర‌పై చూపించడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ విజయవంతం అయ్యాడు. ప్రభాస్ కత్తి పట్టి నరుకుతుంటే అభిమానుల ఆనందానికి హద్దు ఉందు.. అంతేకాదు ఈ చిత్రంలో ప్రభాస్ తల్లి చాటు కొడుకుగా ప్రేక్షులు మనస్సును గెలుచుకున్నాడు. అలాగే స్నేహాం కోసం మాట జవదాటని మిత్రునిగా ప్రభాస్ నటన్ అద్భుతం అని చెప్పాలి. ముఖ్యంగా ప్రభాస్ హీరోయిజం, స్టైల్ ఎక్కుగా ఆక‌ట్టుకుంటుంది. ఇక పోతే ఈ మూవీలో కథానాయకిగా శ్రుతిహాస‌న్ పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదని చెప్పాలి. కానీ… ప్ర‌థ‌మార్ధంలో ఆమే కీల‌కం. పృథ్వీరాజ్ సుకుమార‌న్ పాత్ర ఆక‌ట్టుకుంటుంది. స్నేహితులుగా ప్ర‌భాస్‌కీ, ఆయ‌న‌కీ మ‌ధ్య మంచి కెమిస్ట్రీ క‌నిపించింది. ఈశ్వ‌రీరావు, బాబీ సింహా, జ‌గ‌ప‌తిబాబు, మైమ్ గోపి, శ్రియారెడ్డి, ఝాన్సీ, జాన్ విజ‌య్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

Leave a Comment