సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ పేరు సాధించడానికి ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. సినీ పరిశ్రమలో ఆయనకు విజయాలు అంతతేలికగా ఏమి దక్కలేదు. కండక్టర్ స్థాయి నుంచి సినీ పరిశ్రమలో సూపర్ స్టార్, తలైవాగా ఎదిగే క్రమంలో ప్రతిక్షణం కష్టపడ్డారు. ఆయన పడిన శ్రమే తనను ఈరోజు ఈస్థాయిలో నిలబెట్టిందనడంలో ఎలాంటి సందేహాంలేదు..
ఒక్క తమిళనాటే కాదు దేశం మొత్తంలో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. ఎంతలా అంటే పాన్ ఇండియా స్థాయిని దాటిన ఫ్యాన్ ఫాలోయింగ్ రజినీ సోంతం. సూపర్ స్టార్ రజినీ సినిమాలు మనదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్స్ బ్రేక్ చేసిన సందర్భాలు కోకోల్లలు ఉన్నాయి. భారతాయ చలనచిత్రంలో ఇప్పటి వరకు ఏ హీరో తీసుకుని పారితోషికం తీసుకోవడం సైతం ఆయనకే సాధ్యమైంది. జైలర్ చిత్రానికి ఏకంగా రూ.200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నారు.
తమిళనాట సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీ కాంత్ పుట్టింది తమిళనాడులో కాదు కర్ణాటకలో.. ఆయన మాతృభాష మరాఠీ. అందుకే రజనీకాంత్ తన పాఠశాల విద్యను బెంగళూరులో గడిపారు. తన మాతృభాష మరాఠీ అయినప్పటికీ, రజనీకాంత్ ఇప్పటివరకు మరాఠీ సినిమాలో నటించలేదు. రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత డైరెక్టర్ బాలచందర్ ఆయనకు రజినీకాంత్ అని పేరు పెట్టారు.రజనీకాంత్ చెన్నైలోని ఫిల్మ్ కాలేజీలో చేరడానికి ముందు బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేశారు. శివాజీ నగర్-సామ్‌రాజ్‌పేట రూట్‌లోని 134వ నెంబరు బస్సులో కండక్టర్‌గా పనిచేసే రజనీ.. ప్రయాణికులకు స్టైల్‌గా ”టిక్కెట్లు” ఇచ్చేవారట. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా రజినీకాంత్ గురించి ఉంది. బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు అనే పేరుతో పాఠం ఉంది.
రజినీకాంత్ 1975 లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ చిత్రంతో తన ప్రస్థానం ప్రారంభించాడు. దాదాపు రెండు సంవత్సరాల పాటు చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. 1977 మధ్యలో తెలుగులో మొట్టమొదటి సారిగా చిలకమ్మ చెప్పింది అనే తెలుగు సినిమాలో కథానాయకుడిగా నటించాడు. 1978 లో రజినీకాంత్ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన 20 సినిమాలు విడుదలయ్యాయి.ఎం.భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన భైరవి రజినీకాంత్ సోలో హీరోగా నటించిన తొలి తమిళ చిత్రం. ఈ సినిమాతోనే అతనికి సూపర్ స్టార్ అనే బిరుదు వచ్చింది. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న కలైపులి థాను తొలిసారిగా రజనీకాంత్‌కి ‘సూపర్ స్టార్’ బిరుదును ఇచ్చాడు. రజినీకాంత్ నటించిన భైరవి సినిమా విడుదల సమయంలో కలైపులి థాను ప్లాజా థియేటర్‌లో 35 అడుగుల ఎత్తైన రజనీ కటౌట్‌ను ఏర్పాటు చేశాడు.దీంతో పాటు 3 రకాల పోస్టర్లను ముద్రించి చెన్నై నగరమంతా అతికించాడు. అప్పటి వరకు స్టైల్ కింగ్ అని పిలుచుకున్న రజనీకాంత్.. సూపర్ స్టార్ రజనీకాంత్ అని ఆ పోస్టర్లలోనే ఉంది.