ఆశ్వయుజ శుద్ధ పంచమి, గురువారము, తేది. 19.10.2023 శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహా చండీ దేవి గా దర్శనమిస్తారు.
దేవానాం కార్యసిద్ధ్యర్థం మావిర్భవతి యదా ।
ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యా ప్యభిధీయతే |
శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గమ్మవారు శ్రీమహా చండీ దేవి గా దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీమహా చండీ అమ్మవారు ఉద్భవించినది. శ్రీచండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీమహా చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే. శ్రీఅమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, ఏ కోరికలతో ప్రార్థిస్తామో ఆ కోరికలు అన్నీ సత్వరమే లభిస్తాయి.
మహా చండీ దేవి ఉగ్రరూపంలో దర్శనం ఇస్తుంది. ఈరోజు అమ్మవారిని ఎరుపురంగు చీరలో అలంకరిస్తారు. అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టాలి. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ధైర్యం, విజయం సిద్ధిస్తుంది.