తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత ఎపి రాజకీయలు మరింత ఆసక్తికరంగా మారాయి. సంక్షేమ పథకాలే గట్టు ఎక్కిస్తాయి అన్న బీఆర్ ఎస్ ప్రభుత్వ అంచనాలను తలక్రిందులు చేస్తూ కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతొ అదే సంక్షేమ కార్యక్రమాలు నమ్ముకున్న వైసీపిలో ఆందోళన మొదలైంది.
ప్రస్తుతం వైసీపీలో 144 సెక్షన్ నడుస్తుంది. ఎమ్మెల్యేలు సైతం ఒకరికొకరు మాట్లాడుకోవాలన్నా దాని ప్రభవాం ఎలా ఉంటుందో అని తెగబయపడిపోతున్నారంట..! సమయం దొరికినప్పుడల్లా అధినాయకుడు భజన చేస్తూ ఆయన్నే దేవుడా భావించేవారికి సైతం ఈ సారి టిక్కెట్ దక్కుతుందా.. లేదా అనే సందేహాంతో ఉన్నారు. వారిలో సైతం ప్రక్షాళనతో వణుకు మొదలైంది. అన్న మదిలో ఏముందో తెలియక తెగ సతమతమౌతున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ రాదుఅని తెలిసిపోయినవారు ఏం చేయాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతున్నారు. పార్టీలో ఉంటే ప్రయోజం ఉండదు .. పోనిలే పార్టీ మారదామా అంటే ప్రతిపక్షాలను నొటికి వచ్చినట్లు చడామడా తిట్టేసారు.. వాళ్ళు పార్టీలోకి ఎలాగూ రానివ్వరు… అన్న భావంతో ఉన్నారు. చావో రేవో.. గెలుపో ఓటమో ఇక్కడే ఉండి తెల్చుకోవాలన్న ఆలోచనలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
గుంటూరు, ప్రకాశం జిల్లాలో మొదలైన ఈ ప్రక్షాళనతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది…! ఇక నానీలు, ఫైర్ బ్రాండ్ రోజా వంటి వారు అభివృద్దిని ఆమడ దూరంలో వదిలేసి ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా సాగించారు. ఇప్పుడు పరిస్థితిని చూస్తే వీరిని కూడా పక్కన పెట్టడంతో నోటికొచ్చినట్టు తిట్టి తప్పు చేశామా అన్న సందిగ్ధంలో పడిపోయారు. పార్టీలో ఉండలేక.. బయటికి పోలేక రెండు చెడ్డ రేవడిలా తయారైంది వారి పరిస్థితి. ఏలూరు ఎంపీ రాజీనామా, మహేంద్రవరం ఎంపీ రాజీనామా చేసి బీసీలకే ప్రాధాన్యం అంటూ తెలపడం అంతే కాదు ఏకంగా మాజీ మంత్రి కొడాలి నాని తమ పార్టీ బీసీలకే ప్రాధాన్యం ఇస్తుందంటూ… మీడియాకు వివరించడం. ఇప్పటికే మంగళగిరి సీటు బీసీ కే ఇస్తాం అంటూ అయోధ్య రామిరెడ్డి ప్రకటించడంతో మొదలైన రాజీనామాలు.. రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. వీటితో పాటు 40 నుంచి 60 వరకు సిట్టింగులకు మార్పు తప్పదు అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.
చిత్తూరు జిల్లా నగరిలో స్థానికంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రస్తుత మంత్రి రోజాను పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆమెను ప్రచారానికే పరిమితం చేస్తారా.. లేదా స్థాన చలనం చేస్తారా అని ఇంకా తెలియాల్సి ఉంది. సమయం సందర్భం అని తేడాలేకుండా జన సైనికుల పైన పవన్ కళ్యాణ్ పైన ఇష్టం వచ్చినట్లు అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకు పడే రోజాకు ఈ పరిస్థితి ఏంటబ్బా అంటూ ఆమె అనుచరులు సైతం తెగ మదన పెడుతున్నారు.
కృష్ణాజిల్లాలో మంత్రి జోగి రమేష్‌కు స్థానాచలం తప్పేటట్లు లేదు. అలాగే.. పేర్ని నాని పైన జనసైనికులు సోషల్ మీడియా లొ సీటు గల్లంతంటూ నాని పై సెటారికల్ పోస్టులతో విరుచుకుపడుతున్నారు. మచిలీపట్నం నుండి మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు కిట్టుకి మొండి చేయి చూపించారని విస్తృత ప్రచారం జరుగుతోంది. తాను పోటీ చేయడం లేదని సీఎం జగన్ సాక్షిగా ఓ సభలో పేర్ని నాని… తన రిటైర్మెంట్‌ని ప్రకటించుకున్నాడు. జగన్‌తో సమావేశం అనంతరం బందర్‌లో సీట్ ఎవరికి ఇచ్చిన సంపూర్ణ సహకారం ఉంటుందని మీడియాకి తెలపడం విశేషం. తన తనయుడు కృష్ణమూర్తికి టికెట్ దక్కదని… వైయస్సార్ యువజన నైతిక జోన్ ఫోర్ ఇన్చార్జిగా అధిష్టానం నిర్ణయించడం మరో విశేషం.
తెలుగుదేశంపై విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ లీడర్స్ వల్లభనేని వంశీ, కొడాలి నాని లకు, నెల్లూరులో అనిల్ కుమార్‌కు టికెట్ దక్కదని విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే వీరిలో ఒకరి కన్నా స్థానచలనం.. తప్పదన్న సంకేతాలతో మౌన రాగాలు వల్లిస్తున్నారు…! డిప్లమాటిక్ గా ఉండకుండా అనవసరంగా… నోరు జారామా అంటూ.. మదన పడుతున్నట్లు… ఒక వర్గం ఆరోపిస్తుంది…! మంత్రి చెల్లిబోయినకు టికెట్ లేదన్న విషయాన్ని కన్ఫామ్ చేసి రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయమని పార్టీ కోరుతోంది. రాజమండ్రి ఎంపీ భరత్‌ను రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నుంచి పోటీ చేపించే ఆలోచనలో అధిష్టానం ఉంది. ఇలా ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాలకు మార్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
కోనసీమ నుండి మంత్రి విశ్వరూప్‌ను పక్కన పెట్టి ఆయన కుమారుడుకి విశాఖ జిల్లా పాయకరావుపేట సీట్ కేటాయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అటు రాయలసీమలోనూ పుకార్లు తగ్గట్లేదు… సీఎం సొంత జిల్లా కడపలో మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి సీటు లేదన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఎంపీ అవినాష్‌ను పార్లమెంట్ నుంచి తప్పించి జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం కేటాయించే అవకాశం ఉన్నట్లు ఒక వర్గం ప్రచారం చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే… స్థాన చలనము, పార్లమెంటు నుండి అసెంబ్లీకి అసెంబ్లీ నుంచి పార్లమెంటుకి షిఫ్టింగ్‌లతో…. కొంతమందికి మొండి చేయి తప్పదు.. ఈ మార్పులతో మేలు జరిగిన కీడు జరిగినా..? జగన్ నిర్ణయం మారదనే చెబుతున్నారు.