ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు.. ప్రారంభించిన సీఎం , డిప్యూటీ సీఎం

By manavaradhi.com

Published on:

Follow Us
Andhra Pradesh CM Chandrababu Naidu has launched the Divyang Shakti scheme

ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు.

ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్‌లో దీన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ తదితరులు పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. డాన్‌బాస్కో స్కూల్‌ మీదుగా డోలాస్‌ నగర్‌, ప్రకాశ్‌నగర్‌, నులకపేట, ఉండవల్లి సెంటర్‌ మీదుగా పెనుమాక వెళ్లారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. పథకం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు తరలివచ్చారు.

Leave a Comment