Electrocution: హైదరాబాద్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం.. విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురు మృతి

By manavaradhi.com

Published on:

Follow Us
Electrocution

శ్రీకృష్ణాష్టమి వేడుకలు హైదరాబాద్‌ రామంతాపూర్‌లో విషాదాన్ని నింపాయి. రాత్రి జరిగిన రథయాత్రలో రథానికి కరెంట్ తీగలు విద్యుత్ షాక్‌తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఉప్పల్ – రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి వేర్వురు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

కృష్ణ యాదవ్ ( 24), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (39)ని మృతులుగా గుర్తించారు. వీరి మృతదేహాలను శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనలకు దిగారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు.తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు.స్థానికుల ర్యాలీని తీసేందుకు సిద్ధం కాగా… పోలీసులు అడ్డుకోగా తోపులాట జరిగింది.

Leave a Comment