బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధర రోజు సుమారుగా రూ.3వేలు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.1.34 లక్షలు దాటింది. అటు వెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే కేజీపై దాదాపు రూ.4వేలు పెరిగింది.
హైదరాబాద్‌లో నిన్న (సోమవారం) 10 గ్రాముల బంగారం (Gold) ధర (24 క్యారెట్లు) రూ.1,31,600 పలికింది. మంగళవారం ఆ మొత్తం రూ.1,34,500కు చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,21,000గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర సోమవారం రూ.1,67,300 పలికింది. నేడు ఆ ధర రూ.1,71,200కు పెరిగింది. గతవారం రూ.1.85 లక్షల వరకు ఎగబాకిన వెండి ధర ఆ తర్వాత కాస్త తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ గిరాకీ పెరగడంతో బంగారం, వెండి ధరలు మరోసారి పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 4,335 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 51 డాలర్ల పైనే ఉంది.









