Actress Pakija: సినీ నటి వాసుకి (పాకీజా) పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం

By manavaradhi.com

Published on:

Follow Us
pakija telugu actor

ప్రముఖ నటి పాకీజా ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతోపాటు ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంది. ఆమె పరిస్థితి చూసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చలించిపోయారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి పిలిపించి రూ.2లక్షలు తక్షణ ఆర్థిక సాయం చేశారు. ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్, పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ వాసుకికీ అందజేశారు. తన దుస్థితి తెలిసి ఆర్థికసాయం చేసిన పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞత చెబుతూ, ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

తనను ఆర్థికంగా ఆదుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సినీ నటి వాసుకి అలియాస్ పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా పవన్ కల్యాణ్ ఎదురుగా ఉంటే.. ఆయన కాళ్లు మొక్కుతానంటూ ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కల్యాణ్ కుటుంబానికి తాను రుణపడి ఉంటానని పేర్కొన్నారు. టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన పాకీజా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Comment