Pawan Kalyan: పిఠాపురం టీచర్లకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కానుక

By manavaradhi.com

Published on:

Follow Us
Pawan Kalyan sent Teachers Day gifts to teachers

పిఠాపురం: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒకరోజు ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవం ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు 2 వేల మందికి పవన్ కల్యాణ్‌ కానుకలు పంపించారు. మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంటు-షర్టు అందజేశారు. వాటిని ప్రత్యేక టీమ్‌ పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల విద్యాశాఖ కార్యాలయాల్లో ఉదయాన్నే పంపిణీ చేసింది. డిప్యూటీ సీఎం కానుకలు పంపడంపై ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment