ఆంధ్రప్రదేశ్ కి మరో భారీ పెట్టుబడి రానుంది మంత్రి నారా లోకేష్ తెలిపారు. రెన్యూ పవర్ సంస్థ రూ.82వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రెన్యూ పవర్ సంస్థ అడుగుపెట్టనుంది. సోలార్ ఇంగాట్, వాఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్& గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో రెన్యూ పవర్ పూర్తిస్థాయి పెట్టుబడులు పెడుతుండటం గర్వంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందం చేసుకోనున్నట్లు ప్రస్తావించారు.
అనంతపురం జిల్లాలో రూ.22వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన ఈ కంపెనీ.. 2019లో నాటి ముఖ్యమంత్రి జగన్ నిర్వాకంతో తిరిగి వెళ్లిపోయింది. పీపీఏల రద్దుతోపాటు పునఃసమీక్ష చేపట్టిన గత ప్రభుత్వ విధానాలను ఆ సంస్థ తీవ్రంగా విభేదించింది. ఎన్డీయే కూటమి అధికారంలో ఉండటంతో రాష్ట్రానికి తిరిగి వచ్చింది.








