చేపల వేట సాగిస్తూ జీవనం సాగించే మత్స్యకారులకు ఒక్కోసారి అదృష్టం వరిస్తుంది. అరుదైన చేపలు వలలో చిక్కుతాయి. దీంతో వారు ఒక్కరోజులోనే లక్షాధికారులుగా మారిన సంఘటనలు అనేక సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాంటి అదృష్టమే వెస్ట్ బెంగాల్‌లోని ఓ మత్స్యకారుడిని వరించింది. దెబ్బతో ఒక్కరోజులో ఊహించని రీతిలో అతని తలరాత మారిపోయింది. అతను ఒకే రోజు రూ. 1 కోటి విలువైన 90 చేపలను పట్టుకున్నాడు.
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు కాసుల వర్షం కురిసింది. జలేశ్వర్ ప్రాంతానికి చెందిన కొందరు మత్స్యకారులు శనివారం రాత్రి చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో వాళ్లకు అరుదైన తెలియా భోళా అనే చేపలు దొరికాయి. మొత్తం వలలో 90 చేపలు పడ్డాయి. వీటిని వేలం వేస్తే ఓ కంపెనీ ప్రతినిధులు రూ.కోటికి దక్కించుకున్నారు. వీటి ఒక్కో చేప బరువు ఏకంగా 30 నుంచి 35 కిలోలు ఉన్నట్లు అక్కడి స్థానికులు తెలిపారు. అయితే ఈ తెలియా భోళా చేపలను ఔషధాల తయారీలో వాడుతుంటారు. అందుకే ఇంత ధర పలికింది.

తేలియా భోలా సాధారణంగా లోతైన సముద్రపు నీటిలో కనిపిస్తుందని, సముద్రపు పర్వతాల దగ్గర అరుదుగా పట్టుబడుతుందని నిపుణులు గుర్తించారు. చేప విలువ దాని లింగం, పరిమాణం, బరువు ఆధారంగా నిర్ణయించబడుతుంది. గత సంవత్సరం, దాదాపు 1.99 క్వింటాళ్ల బరువున్న తొమ్మిది అరుదైన చేపలు ఇదే ప్రాంతంలో పట్టుబడి దాదాపు రూ.15 లక్షలకు అమ్ముడయ్యాయి.









