మిరపకాయ వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..!

By manavaradhi.com

Published on:

Follow Us

సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది భయపడిపోతారు. కారంగా ఉంటుంది. తినలేమంటూ వంటలో వాడినా పక్కన పడేస్తుంటారు. అయితే మిరపకాయలు తింటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. పచ్చి మిరపకాయలను నిత్యం మనం అనేక కూరల్లో వేస్తుంటాం. ఎండు కారంకు బదులుగా వీటిని కారం కోసం చాలా మంది కూరల్లో వేస్తారు. పచ్చి మిరప వల్ల కూరలకు చక్కని రుచి వస్తుంది. కొందరు మజ్జిగలో వీటిని ఆరగిస్తారు. అయితే నిజానికి పచ్చి మిరపకాయలు కారంగా ఉన్నప్పటికీ వాటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. పచ్చి మిరపకాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మిరపకాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే పచ్చి మిరపలో విటమిన్ బి6, విటమిన్ ఎ, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది పచ్చి మిరపకాయలను విత్తనాలతో సహా తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

పచ్చి మిర్చిలో శరీరపు మెటబాలిజంను ప్రేరేపించే క్యాస్పేసియన్ అనే ఓ పదార్థం ఉంది. ఇది మెదడులోని హైపోథాలమస్ అనే కేంద్రాన్ని ప్రేరేపించడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. పచ్చి మిరపకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. పక్షవాతాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. మిరపకాయ రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని వృద్ధి పరుస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. దెబ్బ తగిలినపుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉంది. పచ్చిమిరప విత్తనాల్లో ఫైటోస్టెరాల్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. పేగుల నుంచి కొలెస్ట్రాల్ రక్తంలోకి చేరకుండా చూస్తుంది. దీంతోపాటు రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ముక్కు దిబ్బడ ఉంటే దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం ఉన్నవారు పచ్చిమిరపను బాగా తీసుకుంటే ఆయా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పచ్చి మిరపకాయల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి చర్మ సమస్యలను పోగొడతాయి. పచ్చిమిరప తినడం వల్ల శరీరంలోని అనవసర బ్యాక్టీరియా నాశనమవుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది. విటమిన్‌-ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కళ్లకు మేలుచేస్తుంది. చర్మం కాంతివంతం అవుతుంది.

పచ్చిమిరపలో ఉండే విటమిన్‌-సీ కారణంగా విటమిన్లను శోషించుకునే గుణం శరీరానికి లభిస్తుంది. పచ్చి మిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తాయి. దీంతో క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథి సమస్యలకూ పచ్చి మిర్చి మంచి మందులా పనిచేస్తుంది. జీవ క్రియలు వేగవంతం పచ్చి మిర్చిలో సున్నా కేలరీలుంటాయి. కానీ, అంతకు మించిన శక్తిని మన శరీరానికి అందిస్తాయి. ఇందులో ఉండే రసాయనాలు శరీరంలో జీవక్రియలను 50శాతం వేగవంతం చేస్తాయి. పచ్చి మిరపకాయలు గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ప్రమాదకరమైన అథెరోస్కెల్ రోసిస్‌ను ఇది నివారిస్తుంది. రక్తంలో కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. మిరపలోని రసాయనాలు దమనుల్లో కొవ్వు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా రక్తం గడ్డకట్టేందుకు దారితీసే ప్లేట్‌లెట్ల సమూహం ఏర్పడకుండా నిరోధిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి ధరిచేరవు. సైనస్‌ సమస్య ఉన్నవారికి పచ్చి మిరపను మించిన ఔషధంలేదు. మిర్చిలో ఉండే క్యాప్సేసియన్ వల్ల మెంబ్రేన్లకు రక్తసరఫరా బాగా జరిగి, అందులో మ్యూకస్ ఏర్పడకుండా చూస్తుంది. దీంతో సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే రక్తంలో చెక్కర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అందుకే మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ తమ ఆహారంలో మిరపకాయను చేర్చుకోవాలి. ఐరన్‌లోపం ఉన్నవారికి కూడా మిరప మంచి ఔషధం. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి. జీరో క్యాలేరీలు ఉండే పచ్చి మిర్చిలో ఎన్నో విటమిన్లు నిండి ఉంటాయి.

Leave a Comment