మీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే ఆహారాలు ఇవే…!

By manavaradhi.com

Updated on:

Follow Us

అందమైన మోముంటే అందరూ చాలా బాగుందంటారు. దీనికోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. చర్మ సౌందర్యంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. చర్మం అందంగా కనిపించడం కోసం బ్యూటి పార్లర్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే, చర్మ సౌందర్యం అనేది మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం, నిద్రలేమి, ధూమపానం, మద్యపాన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుందనేది మరిచిపోతున్నారు. యుక్త వయసులో ఉండే వారి చర్మ పరిస్థుతులు అనిశ్చితంగా మరియు హటాత్తుగా మారుతుంటాయి. మీ చర్మానికి ఒకవేళ ఎలాంటి క్రీమ్’లను వాడకపోయిన, నల్లటి వలయాలు, మచ్చలు, మొటిమలు కలుగుతుంటాయి. అయితే మారుతున్న జీవనశైలి, పెరిగిపోతున్నా కాలుష్య కారకాల వల్ల శరీరంలోని భాగాల కన్నా ముందుగా చర్మం ఎక్కువగా ప్రభావితమవుతున్నది. పౌడర్లు, క్రీములు వాడితేనే చర్మం సౌందర్యవంతం కాదు. ఆహారంతో కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. తాజా కూరగాయలు, ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో విటమిన్ల శాతం అవసరమైనంత మేరకు పెరుగుతుంది విటమిన్లు చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.

చర్మ సౌందర్యం కోసం మంచి ఆహారం తీసుకోవడం అవసరం. చర్మం ఎప్పుడు తాజాగా ఉండేందుకు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా లభించే ఫుడ్స్ తీసుకోవాలి. చర్మ సౌందర్యానికి సహజసిద్ధంగా ప్రకృతి అందించే ఆకుకూరలు, కూరగాయలు పండ్లలో ఉండే ఎన్నో పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే ప్రొటీన్లు గల చేపలు, పౌల్ట్రీ, కోడిగుడ్లు, బీన్స్, పప్పులు, సోయా, మాంసం వంటివి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరం మొత్తం ఆరోగ్యం మరియు కాంతివంతమైన చర్మంకు గొప్పగా సహాయపడుతాయి. బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది మరియు సన్ డ్యామేజ్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కీరదోసకాయను రెగ్యులర్ గా తింటుంటే చర్మ అందానికి చాల మేలు చేస్తుంది. చర్మానికి తగిన హైడ్రేషన్ అందివ్వడంతో పాటు, బహిర్గతంగా మరియు అంతర్గతంగా టాక్సిన్స్ ను నివారిస్తుంది. లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ లో యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు మినిరల్స్ మరియు విటమిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని, చర్మ రంగును మెరుగుపరుస్తాయి. క్యారెట్స్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది డ్యామేజ్ అయిన చర్మాన్ని మర్మత్తు చేస్తుంది. క్యారెట్ చర్మ సమస్యలన్నింటిని నివారిస్తుంది . క్యారెట్ ను పచ్చిగా అలాగే తినడం లేదా క్యారెట్ జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల మీ చర్మం తేమగా, సాఫ్ట్ గా మరియు స్మూత్ గా తయారువుతుంది.

సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకమైన, అందమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. టమోటో సిట్రస్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా కలిగి ఉంటాయి. టమోటో గుజ్జులో లైకోపిన్ అధికంగా ఉండటం వల్ల సన్ బర్న్ నుండి చర్మాన్ని కాపాడుతుంది. సాల్మన్ ఫిష్ లో హెల్తీ ప్రోటీన్ పుష్కలంగా ఉంది. సాల్మన్ ఫిష్ ను వారానికి ఒక సారి తినడం వల్ల వయస్సు పైబడనియ్యకుండా కాపాడుతుంది. ఆలివ్ ఆయిల్, నూనెల్లో అన్నింటికంటే చాలా తక్కువ కొవ్వు కలిగిన నూనె ఆలివ్ ఆయిల్. సుద్దమైన ఆలివ్ ఆయిల్లో యాంటియాక్సిడెంట్ పుష్కలంగా ఉండి స్కిన్ సెల్ పునరుద్దరణను వేగవంతం చేస్తాయి. తృణధాన్యాలు, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . అంతే కాదు అంతర్గతంగా టాక్సిన్స్ ను బయటకు నెట్టివేసి , చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా మార్చుతాయి. అవకాడో, పుష్కలమైన స్థాయిలో బయోటిన్ లను కలిగి ఉండి చర్మాన్ని పొడిగా, పగలకుండా చూస్తుంది. గుడ్డు యొక్క పచ్చసొన కలిగి ఉండే కెరోటినాయిడ్ ల్యూటిన్… సూర్యకిరణాల వలన కలిగే ప్రమాదాల నుండి చర్మాన్ని కాపాడుతుంది. రోజులో సాధ్యమైనంత ఎక్కుగా నీరు తాగాలి. తాజా పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల చర్మం తేమగా మారుతుంది. గ్రీన్ టీ తాగితే చర్మాన్ని తాజాగా ఉంచడంలో ఉపయుక్తమయ్యే యాంటీఆక్సిడెంట్లు అందుతాయి.

Leave a Comment