Healthy Heart : వ్యాయామంతో గుండె ఆరోగ్యం మెరుగు అవుతుంది

By manavaradhi.com

Updated on:

Follow Us

వ్యాయామాల వలన మధుమేహం, బరువు నిర్వహణతో పాటూ, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం ఆహారాలు మాత్రమేకాదు, వ్యాయామాలు కూడా చేయాలి. కేవలం 30 నిమిషాల పాటూ, ఎరోబిక్స్ వ్యాయామాలను చేయటం వలన లేదా 10 నుండి 15 నిమిషాలు సైకిల్ తొక్కటం వలన పూర్తీ ఆరోగ్యంతో పాటూ, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మన చిన్న గుండెకు మేలు చేసే సులువైన మరియు మంచి ప్రభావితమైన వ్యాయామంగా వాకింగ్ ను పేర్కొనవచ్చు. ఈ సులువైన వ్యాయామం వలన గుండె ఆరోగ్యమే కాకుండా, పూర్తి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ రకం వ్యాయామాన్ని భయట ఎక్కడో కాకుండా ఇంట్లోనే చేయవచ్చు. అంతేకాకుండా, ఎస్కులేటర్, లిఫ్ట్ వంటి వాటిని వాడకుండా మెట్లు ఎక్కటం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలా చేయటం వలన హృదయ స్పందన రేటు 50 నుండి 85 శాతం వరకు పెరుగుతుంది.

  • కార్టిసాల్ వంటి హార్మోన్స్ గుండె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి. అందువలన వ్యాయామం చేసి ఇలాంటి హార్మోన్స్ స్థాయిలు ఉద్ధృతం కాకుండా చేసుకోవచ్చు.
  • అలసట, ఒత్తిడి కారణంగా గుండె వైఫల్యం. గుండెపోటు వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
  • నిద్రలేమి కారణంగా కూడా రక్తపోటు ప్రమాదం ఉంది. ఇది గుండె జబ్బుకు దారితీస్తుంది. కనుక రాత్రివేళ 7-8 గంటలు నిద్రపోతే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
  • నవ్వడం వలన రక్తపోటు తగ్గుతుంది. అందువలన సమయం దొరికినప్పుడల్లా జోక్స్ చదవండి. నవ్వు తెప్పించే సినిమాలు చూడండి.
  • అధిక బరువు గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. కనుక ఆహార, వ్యాయామంతో బరువు పెరగకుండా చూసుకోవాలి.
  • శ్వాసపై ద్యాస ఉంచి ఊపిరి తీసుకోవడం మూలంగా శరీరానికి కావలసిన ప్రాణవాయువుని ఎక్కువ మోతాదులో తీసుకుని జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. లోతుగా శ్వాసని తీసుకోవడంవలన ఆక్సిజన్ మరింత సరఫరా అవుతుంది. తద్వారా గుండె పనితీరు మెరుగవుతుంది.

వ్యాయామం వల్ల మనలో సంతోషం కలిగించే రసాయనాలైన ఎండార్ఫిన్ వంటివి వృద్ధి అవుతాయి. దాంతో రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి వ్యాయామం వల్ల కొవ్వులు, రక్తపోటు, మధుమేహం వంటివి అదుపులో ఉండటంతో పాటు అదే ప్రక్రియలో ఎండార్ఫిన్ కూడా స్రవించడం వల్ల సంతోషం, మానసిక ఉల్లాసం పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. ఇది కూడా గుండెకు మేలు చేసేదే. సైకిల్ తొక్కటం వలన కాళ్ళలో జరిగే కదలికల వలన గుండె ద్వారా కాలిలో ఉండే పొడవైన కండరానికి రక్తం సరఫరా చేయబడుతుంది. సైక్లింగ్ వలన గుండె విధి పెరిగి, దాని ఆరోగ్యం కూడా పెరుగుతుంది. గుండె ఆరోగ్యం ఎక్కువగా మెరుగుపడటానికి, స్విమ్మింగ్ పూల్ లో కనీసం 20 నుండి 30 నిమిషాల పాటూ ఈత కొట్టండి. ఇలా చేయటం వలన శరీరం తాజదననికి గురవటమేకాకుండా, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీకు ఇష్టమైన పాటపై డాన్స్ చేయటం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. యోగ రక్తపోటు తగ్గించడం,కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాక ఒత్తిడి మరియు ఆందోళనలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. తద్వారా మీలోని ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యం పెంపొందుతుంది.

Leave a Comment