Steroids : నొప్పుల నివారణకు స్టెరాయిడ్స్ వాడకం మంచిదా కాదా..?

By manavaradhi.com

Updated on:

Follow Us

సాధారణంగా చాల మంది వెన్ను నొప్పి, మోకాళ్ళనొప్పులు శరీరంలో ఏ ఇతర నొప్పులు వచ్చినా వెంటనే పెయిన్ కిల్లర్స్ ను తీసుకుంటుంటారు. పెయిన్ కిల్లర్స్, డ్రగ్స్ ప్రస్తుతానికి పనిచేసినా, కొంత సేపటి వరకూ మాత్రమే రిలీఫ్ ఉంటుంది. సమస్యను పూర్తిగా తగ్గించదు. స్టిరాయిడ్స్ వాస్తవానికి వెంటనే ఉపశమనం ఇచ్చే మాట నిజం. కానీ ఈ మందు వల్ల భవిష్యత్‌లో ఆరోగ్యంపై తీవ్ర దుష్ఫలితాల ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక పరిస్థితులలో వాడే మందులను నిత్యం వాడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

నొప్పి నివారిణి మందులు నాన్‌ స్టిరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ రకం నొప్పి నివారణ మందులు కొంచెం ఎక్కువ ప్రభావంతో పనిచేస్తాయి. ప్యారాసిటమాల్‌, ట్రెమడాల్‌ వంటివి తక్కువ ప్రభావం గలవి. వీటిని ముందుగా సిఫార్సు చేస్తారు. వీటితో పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు. ఇవి కాకుండా కార్టికో స్టిరాయిడ్స్‌ ఉంటాయి. ఇవి నొప్పి తీవ్రతను తగ్గించటంలో బాగా తోడ్పడతాయి. వీటిని చాలా పరిమిత కాలానికే ఇస్తారు. ఎక్కువ రోజులు వాడితే వీటితో దుష్ప్రభావాలుంటాయి గనక వీటిని తక్కువ మోతాదులో మాత్రమే సిఫార్సు చేస్తారు.

కార్టికో స్టిరాయిడ్స్‌ అవసరానికి మించి దీర్ఘకాలంగా వాడటం వల్ల బరువు పెరగడం, కాల్షియం లోపించి ఎముకలు పెలుసు బారడం, మెదడు సరిగా పని చేయకపోవడం, నరాల బలహీనత, రోగనిరోధకశక్తి తగ్గిపోవడం, ఏ మందులూ సరిగా పనిచేయకపోవడం, నిద్ర సరిగా పట్టక పోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి, నేచురల్ గా నొప్పి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.

స్టిరాయిడ్స్ ఆరోగ్యానికి మంచివి కాదని అనేక వైద్య అధ్యయనాలు మరియు ప్రయోగాలు స్పష్టం చేసాయి. అయినప్పటికీ వైద్యులు స్టిరాయిడ్ ఇంజెక్షన్లను సూచించటానికి కొన్ని పరిస్థితులు ఉంటున్నాయి. యుక్తవయస్సు మరియు బలహీనమైన టెస్టిక్యులర్ ఫంక్షన్ చికిత్స మరియు కండరాల చికిత్సలో వైద్యులు స్టిరాయిడ్ ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నారు. సాదారణంగా స్టిరాయిడ్లు రెండు రకాలు ఉన్నాయి. శరీరాకృతిని పెంచే స్టిరాయిడ్లను కండరాలు నిర్మించడానికి వాడుతూ ఉంటారు. ఇక రెండోవది కార్టికోస్టిరాయిడ్స్. వీటిని చురుకుగా ఉన్న రోగనిరోధక శక్తి వ్యవస్థ స్పందనను తగ్గించటానికి వాడతారు.

స్టిరాయిడ్స్ శరీరానికి ఎందుకు ఇంజెక్ట్ చేస్తారు అంటే.. స్టెరాయిడ్ లను నోటి ద్వారా తీసుకుంటే ప్రభావిత ప్రాంతంలోకి వెళ్ళుతుందని నమ్మకం లేదు. ఇంజెక్షన్ ఖచ్చితంగా నొప్పి ఉన్న ప్రాంతంలోకి చేరుతుంది. అయితే శరీరానికి స్టిరాయిడ్స్ ఇంజెక్షన్ ద్వారా దుష్ప్రభావాలు ఉన్నాయి. పురుషులు మరియు స్త్రీల మీద ఈ మందులు ఘోరమైన ప్రభావాన్ని చూపవచ్చు. ఇది హెపటైటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే స్టిరాయిడ్స్ ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఇంజెక్ట్ లేదా నోటి ద్వారా తీసుకున్న జుట్టు విపరీతంగా రాలిపోయి బట్టతలగా మారిపోతుంది.

మనదేశంలో సొంతంగా మందులు కొనుక్కొని వాడేవారు చాలా ఎక్కువ. ఇది ఆరోగ్యానకి ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా డాక్టర్‌ సిఫారసు లేకుండా నొప్పి నివారణ మందులు అసలే వేసుకోకూడదు. కిడ్నీ జబ్బులు పెరగటానికి విచ్చలవిడిగా నొప్పి నివారణ మందులను వాడుకోవటమూ ఒక కారణమే. మగవారిలోనే కాకుండా స్త్రీల శరీరం మీద కూడా స్టిరాయిడ్స్ ఇంజెక్షన్ దుష్ప్రభావాలు ఉన్నాయి. స్టిరాయిడ్స్ వలన అనేక బౌతికపరమైన ఇబ్బందులు వస్తాయి. యువత విషయంలో స్టిరాయిడ్ ఇంజెక్షన్లు పెరుగుదల మీద ప్రభావితం చూపుతాయి. అంతే కాకుండా,కాలేయ కణితి మరియు తీవ్రమైన కాలేయ నష్టానికి గురి అవుతారు. చెడు కొలెస్ట్రాల్ మరియు గుండె వ్యాధులు మానసిక వ్యాధుల రిస్క్ పెరుగుతుంది.

స్టెరాయిడ్ ఉపయోగించడం వలన మానసిక రుగ్మతకు కారణం అవుతుంది. వారిలో మూడ్ స్వింగ్స్,దుడుకు ప్రవర్తన మరియు హింస వృద్ధి పెరుగుతాయి. దాంతో వారు డిప్రెషన్ లోకి వెళ్ళవచ్చు. నొప్పి మందులను సొంతంగా కొనుక్కొని వేసుకోవటం తగదు. డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి. నొప్పి తీవ్రతను తగ్గించటంలో స్టిరాయిడ్స్ బాగా తోడ్పడతాయి. కానీ వీటిని చాలా పరిమిత కాలం మాత్రమే వాడాలి. ఎక్కవ రోజులు వాడితే వీటితో చాలా రకాల దుష్ర్పభావాలు వస్తాయి. ఒకవేళ వాడల్సివస్తే వైద్యుని పర్యవేక్షణలో వాడితే మంచిది.

Leave a Comment