Carbohydrates : ఒక రోజులో మన శరీరానికి ఎన్ని కార్బోహైడ్రేట్లు అవసరం..!

By manavaradhi.com

Published on:

Follow Us

ఆరోగ్యకరమైన ఆయు:ప్రమాణం కోసం తగినంత మోతాదులో కార్బోహైడ్రేట్లు ఆహారంగా తీసుకోవడం అవసరం. సాధారణంగా కార్బోహైడ్రేట్లు మనకు కావలసిన ఫ్యూయల్‌ను ఇస్తాయి. శరీరం సాధారణ రీతిలో పనిచెయ్యడానికి కార్బోహైడ్రేట్లు చాలా చక్కగా పనిచేస్తాయి. అయితే ఎంతామోతాదులో తీసుకోవాలి…ఎంతవరకు అవసరం… కార్బోహైడ్రేట్లు మనకు ఏయే ఆహారాల్లో లభిస్తాయి.

మన శరీరానికి కార్బోహైడ్రేట్లు అంతగా మంచివి కావని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇది సరైన అవగాహన కాదు. కార్బోహైడ్రేట్లు మన శరీరానికి అవసరమైనవే. కార్బోహైడ్రేట్లు శరీరానికి కావల్సిన శక్తిని నిరంతరం అందిస్తుంటాయి. మన డైట్‌లో కార్బోహైడ్రేట్‌లు అత్యంత కీలకమైనవి. మనకు రోజూ లభించే కెలోరీల్లో సుమారు 50 శాతం కెలోరీలు కార్బొహైడ్రేట్‌లు వలన లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిజానికి కార్బోహైడ్రేట్‌లు విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి ఖనిజాలు, పీచు పదార్థం, పోషకాలు, విటమన్లు అందిస్తాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచి ఆకలిని తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్‌లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, సహజ పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది, కెలోరీలు తక్కువగా ఉంటాయి.

కార్బోహైడ్రేట్లు వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి ?

  • శరీరానికి కావాల్సిన శక్తినిచ్చేవి కార్బొహైడ్రేట్లు. 70 నుంచి 80 శాతం కేలరీలు కార్బొహైడ్రేట్ల ద్వారానే అందుతున్నాయి.
  • ముడి ధాన్యాలైన బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి వాటి ద్వారానూ కార్బొహైడ్రేట్లు లభిస్తాయి. పైగా వీటిలో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణశక్తికి తోడ్పడుతుంది.
  • త్వ‌ర‌గా క‌రిగే కార్బోహైడ్రేట్లు క‌లిగి వుండే అవ‌కాడోలు చాలా మంచివి. విట‌మ‌న్ సీ, ఫొలేట్‌, పొటాషియం అధికంగా ల‌భిస్తాయి. బ‌రువు త‌గ్గించుకోవాల‌ని అనుకొనే వారికి చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.
  • మ‌న శ‌రీరానికి కావలసిన పోషకహార పదార్థాలు కూరగాయల్లో పుష్కలంగా లభిస్తాయి. అందుకే మనం తీసుకొనే సమతుల ఆహారంలో కూరగాయలు ఎంతో ముఖ్య‌పాత్ర వహిస్తాయి. క
  • గర్రపెండలం,చిలగడదుంప,క్యారట్,కంద,చేమదుంప.. ఇవన్నీ పిండిపదార్ధాలను పుష్కలంగా కలిగియుంటాయి.

కార్బోహైడ్రేట్లు ఎక్కువగా మనకు ఏయే ఆహారాల్లో లభిస్తాయి ?
కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎన్నో చక్కెర పరమాణువుల సమ్మిళితం. కాబట్టి వెంటనే జీర్ణం కావు. నెమ్మదిగా జీర్ణమవుతాయి. అందుకని ఇవి గ్లూకోజ్‌లా మారడానికీ టైమ్ పడుతుంది. దీంతో రక్తంలో చక్కెర వేగంగా కాక నెమ్మదిగా ఓ క్రమపద్ధతిలో విడుదల అవుతుంది. చక్కెర నెమ్మదిగా విడుదలవడమే ఆరోగ్యానికి మేలు. అంతేకాదు స్లో డెజైషనే దీర్ఘకాల శక్తినిస్తుంది. ఆకలిని ఆలస్యం చేస్తూ బరువునూ కంట్రోల్‌లో ఉంచుతుంది. తద్వారా చెడు కొలెస్ట్రాల్‌కి చెక్ పడుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌ బఠాణీలు, బీన్స్, మొక్కజొన్నలు, పాస్తా, బియ్యం, బంగాళదుంపలు. ఇవి మనిషికి కావల్సిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్‌ను అందిస్తాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌లో ఫైబర్ ఎక్కువగా లభించే ఆహారాలు బ్రౌన్ రైస్, హోల్ వీట్‌గ్రైన్స్ , ఆకు కూరలు, ఆకుపచ్చని కూరగాయలు, బ్రకోలి, కాలిఫ్లవర్, టమాటాలు, ఉల్లి,వెల్లుల్లి, మిరియాలు, మామిడి, కివి, దానిమ్మ వంటి ముదురు రంగులో ఉన్న పళ్లు. ఈ ఫైబర్ ఫుడ్ మలబద్దకాన్ని నివారిస్తుంది. కొలొన్, కడుపు, పేగులకు వచ్చే క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది. అదే సమయంలో కార్డియోవ్యాస్క్యులర్ జబ్బులనూ దూరంగా ఉంచుతుంది.

Leave a Comment