Organs Donation: అవయవ దానం: అపోహలు, వాస్తవాలు

By manavaradhi.com

Updated on:

Follow Us

అవయువ దానం ఆధునిక వైద్యం మనకిచ్చిన గొప్ప వరం . బతికున్నప్పుడైనా… చనిపోయాకైనా… కొన్ని అవయవాలను అవసరమైనవారికి దానం చేసే మహత్తరమైన అవకాశం అది. దీని ద్వారా ఎదుటి వారి ప్రాణాన్ని, జీవితాన్నే నిలబెట్టొచ్చు. ఇప్పటికే చాలా కొద్ది మాత్రమే… చనిపోయాక తమ అవయవాలను వేరే వారికి అమర్చేందుకు ఒప్పుకుంటూ ముందుకొస్తున్నారు.

ప్రస్తుత కాలంలో మనిషి ఎన్నో రోగాలను జయించాడు. అయితే ఇంకా కొన్ని రోగాలు మరియు జీవనశైలి మనిషి అవయవాలను చెడగొడుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో అవయవదానమే మనిషిని బ్రతికించే మార్గం. అవయవదానం చేయడానికి ఎవరైనా అర్హులే. పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకు ఆర్గాన్స్ డొనేట్ చేయవచ్చు. మనిషి చనిపోయాక కూడా ఆ మనిషి అవయవాలు కనీసం మరో ఎనిమిది మందికి ప్రాణం పోస్తాయి.బ్రెయిన్ డెడ్ అయినప్పుడు, తీవ్రమైన వ్యాధి వలన తిరిగి కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కోమా పేషెంట్లు అవయవదానం చేయవచ్చు. బ్రెయిన్డెడ్ అయిన కొద్ది గంటల్లోనే అవయవాలను సేకరించాల్సి ఉంటుంది. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కళ్లు, కార్నియా ఇలా దాదాపు రెండు వందల రకాల కణజాలం ఒక మనిషి నుంచి మరో మనిషికి అమర్చవచ్చు. అయితే ఎంత సమయంలో అవయవాలు సేకరించగలిగాం. ఇంకెంత సమయంలో అవసరమైన పేషెంట్కు అమర్చగలిగాం అనేది ముఖ్యం.

అవయువదానం ఎవరు చేయవచ్చు ?
చాలా మందికి పుట్టుకతో కాలేయం సమస్యలుంటాయి. మరికొందరికి హెప్టైటిస్ సోకడం వలన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం రావచ్చు. కాలేయం ఉండేది ఒకటే అయినా… అవకాశం బట్టి ఇద్దరికి కూడా దానం చేయవచ్చు. ఇక డయాబెటిస్ రోగుల్లో చాలా మందికి క్లోమగ్రంధి అవసరం ఉంటుంది. వీరికి దాతలు ఇవ్వొచ్చు. ఇక కళ్ళ దానం గురించి అయితే చెప్పుకోనక్కర్లేదు. మన దేశంలోని ముఫ్ఫావు వంతు మంది అంధులకు సరికొత్త జీవితం ఇవ్వొచ్చు. అంతగా కళ్ళ అవసరం ఉంది. కొందరికి ఎముక మజ్జ మార్పిడి వలన ఉత్సాహవంతంగా జీవిస్తారు. ఇలా మనిషి శరీరంలో పదుల కొద్దీ అవయవాలను దానం చేయవచ్చు. అయితే దాత బ్లడ్ గ్రూప్, స్వీకర్త బ్లడ్ గ్రూప్ ఒకటే అవ్వాలి. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే అవయవదానం కుదురుతుంది. కుటుంబ సభ్యులకు ప్రభుత్వ అంగీకారంతో బ్రతికి ఉండగా కూడా అవయవదానం చేయవచ్చు. మిగతా వారికి మాత్రం ముందుగా దాత అనుమతి ఉండాలి. లక్షలాది మంది ఏదో ఒక అవయవం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏటా దేశంలో బ్రెయిన్ డెడ్ అవుతున్న వారిలో సగం మంది నుంచి అవయవాలు స్వీకరించినా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి.

అవయువదానం పట్ల ప్రజల్లో ఎలా చైతన్యం కలిగించాలి ?
ఓ వ్యక్తి చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు గుండె నిబ్బరం చేసుకుని అవయవదానంకు అంగీకరిస్తే.. ఎంతోమందికి పునర్జీవం ఇచ్చిన వారవుతారు. అయితే అన్ని రకాల మరణాల నుంచి అవయవాలు సేకరించలేరు. బ్రెయిన్ డెడ్ అయిన కేసుల్లోనే ఎక్కువగా అవయవాలు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బ్రెయిన్ డెడ్ అయినా.., శరీరం కొన్ని గంటలు జీవంతోనే ఉంటుంది. కాకపోతే మెదడు నుంచి శరీరంలోని మిగతా అవయవాలకు సంకేతాలు అందవు. దీంతో క్రమక్రమంగా అవి పనిచేయక మనిషి ప్రాణం కోల్పోతారు. ఇలాంటి సందర్భాల్లో వైద్యులు సూచన మేరకు అవయవదానం చేయవచ్చు. ప్రభుత్వం తరుపున జీవన్దాన్ ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అవయవదానం చేయాలనుకునేవారు, అలాగే అవయవదానం స్వీకరించేవారు జీవన్దాన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. జీవన్దాన్ సభ్యులు నిర్ధారించాక.. సీరియల్ ప్రకారం అవయవదానం స్వీకరణకు అవకాశం ఇస్తారు. జీవన్దాన్ ద్వారానే అవయవదానం జరిగేలా చూస్తుంది. జీవితం అనంతరం అవయవాలను దానం చేయండ వల్ల ఎంతో మందిని ప్రాణంపోయవచ్చు.

దేశంలో అనేక మంది వివిధ రోగాలతో అవయవాలు కోల్పోయి, పని చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి మందులు ఆయుష్షును పెంచవు. అవయవదానం చేసే దాతలే వారికి ప్రాణం పోయగలరు. వాటి కోసం చాలా మంది ఎదురుచూపులు చూస్తున్నారు. అవయవదాతలు ముందుకు వస్తే మరింత మంది జీవితాల్లో వెలుగును నింపవచ్చు.

Leave a Comment