Women Health: గర్భసంచిని ఏ పరిస్థితుల్లో తొలగిస్తారు ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

By manavaradhi.com

Published on:

Follow Us
Hysterectomy: Purpose, Procedure, Benefits, Risks

గర్భాశయాన్ని తొలగించే ఆపరేషన్ ను హిస్టరెక్టమీ అంటారు. దీనినే వాడుక భాషలో పెద్దాపరేషన్ అంటారు.. ఇది స్త్రీలకు సంబందించిన సమస్య.. ఈ ఆపరేషన్ చేసి గర్భాశయాన్ని తొలగించడానికి అనేక కారణాలున్నాయి… సాధారణంగా స్త్రీలలో నెలసరి రక్త స్రానమనేది సహజమైన సమస్య.. ప్రతి నెల 4 -5 రోజులు ఏ బాధ లేకుండా ఈ నెలసరి రావడమనేది ప్రకృతి ధర్మం… ఇలా కాకుండా ఈ రక్త స్రావమనేది ప్రతి నెల నొప్పితోనో, క్రమము లేకుండానో ఎక్కువ రోజులు ఉంటే అది వ్యాధిలక్షణంగా భావించి, వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

గర్భశయాన్ని తొలగించడానికి కారణాలను కనుక పరిశీలించినట్లయితే…..
1.గర్భాశయం లోపలి గోడలకు ఆనుకుని లోపల పెరిగే కణుతులు
2.గర్భసంచి కిందకు జారడం
3.ప్రసవ సమయంలో గర్భాశయం చిరగడం లేదా ఆపడానికి వీలుకాని రక్తస్రావం…
4.గర్భసంచిలో ఇన్ ఫెక్షన్ ల వలన వాపు రావడం…
5.గర్భశయం ముఖద్వారానికి క్యాన్సర్ ఉన్నప్పుడు..
6.గర్భాశయంలో క్యాన్సర్ ఉన్నప్పుడు..
7.నెలసరి సమయంలోనే కాక, ఇతర సమయాలలో కూడా రక్తస్రావం కవడం అనే వ్యాధి ఉన్నప్పుడు…వైద్యులు తగిన పరీక్షలు చేసి, గర్భశయాన్ని తోలగించడానికి సిఫారస్సు చేస్తారు.

గర్భాశయాన్ని తొలగించడం వలన స్త్రీలు ఎన్నో ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మానసిక ఆరోగ్యం పైన కూడా దీని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే కేవలం గర్భాశయాన్ని మాత్రమే తీసివేస్తే, నెలసరి ఆగిపోతుంది… కానీ అండాశయాన్ని కూడా తీసివేస్తే అకస్మాత్తుగా మెనోపాజ్ వస్తుంది.. దీని వలన హార్మోన్ల ను విడిగా తీసుకోవాల్సి వస్తుంది.

గర్భశయంలో గడ్డలు అనేవి గర్భశయ గోడలను ఆధారం చేసుకుని ఎదుగుతాయి… ఇవి గర్భశయ కండరాల సహాయంతో వృద్ది చెందుతూ, మిల్లి మీటర్ నుండి సెంటీమీటర్ వరకు పెరుగుతాయి… గర్భాశయ రక్తనాళాల నుండి వీటి ఎదుగుదల ప్రారంభమవుతుంది… ఇవి మృధువైన కణజాలంతో తయారై గులాబీ రంగు లో ఉంటాయి…ఇవి ఒకటిగా ఉండి పెద్ద పరణామాంలోనూ ఉండవచ్చు..లేదా చిన్న చిన్న గడ్డల రూపంలో ఒకటి కంటే ఎక్కువగా కూడా ఉండే అవకాశాలున్నాయి… ఈ విధంగా ఏర్పడే గడ్డలు గర్భాశయ కుహరాన్ని శిధిలం చేస్తాయి…ఇవి ఉన్న వారిలో సంతానలేమి సమస్యలు కూడా వస్తుంటాయి….ఈ గర్భాశయ గడ్డలు 4 రకాలుగా ఉంటాయి… వీటిలో ఒక రకమైన కార్నుయల్ ఫైబ్రాయిడ్ గడ్డల కారణంగా, గర్భశయ అంచుకు ట్యూబ్స్ కలిసే భాగాన్ని మూసి వేస్తాయి…ఇలా ఫలదీకరణ చెందిన అండం పైన ఈ గడ్డలనేవి ఏర్పడినట్లయితే గర్భకోశపుపోర అనేది కుదించుకుపోతుంది… దీనివలన గర్భాశయంలో ఎదగాల్సిన పిండానికి సరిగా పోషణ అందక గర్భం వచ్చిన మొదటి రోజులలోనే అబార్షన్ అయ్యే అవకాశాలుంటాయి. ఇంకా..ఈస్ట్రోజన్ హార్మోన్ల విడుదలలో హెచ్చుతగ్గులు , అధిక బరువు, నెలసరి అనేది స్త్రీలలో 10 సంIIల వయస్సులోనే ప్రారంభం కావడం.. వంశపారపర్యంగా కూడా గర్భాశయానికి సంబందించిన సమస్యలు వస్తుంటాయి.

మన ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా, దానికి సంబంధించిన లక్షణాలు వెంటనే కనబడుతుంటాయి… మనం చేయాల్సిన దల్లా అలాంటి లక్షణాలను గుర్తించి వెంటనే డాక్టర్ ను సంప్రదించి…వ్యాధి నిర్ధారణ చేసుకుని, డాక్టర్ గారి సలహాలు పాటిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే…. అదే విధంగా గర్భాశయానికి సంబందించిన అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చినపుడు, దానికి సంబందించిన లక్షణాలు ఏ విధంగా బయటికి కనబడుతుంటాయో పరిశీలిద్దాం…
1.నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అవ్వడం, లేదా ఎక్కువ రోజులు కావడం రక్తం అనేది ముద్దలుగా పడడం లాంటివి కనిపిస్తుంటాయి.
2.గర్భాశయంలో గడ్డలు ఏర్పడడం వలన ముత్రాశయం మీద ఒత్తిడి పెరుగుతుంది…. దీనివలన తరుచుగా మూత్రానికి వెల్లడం అనే సమస్య మొదలౌతుంది.
3.నడుము భాగం పెరగడం, పొట్ట రూపు మారిపోవడం లాంటివి జరుగుతుంటాయి.
4.సంతానలేమి సమస్యలు కూడా వస్తాయి.
5.మత్తుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నోప్పిలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
6.నెలసరి ఆగిపోవడం లేదా ఎక్కువగా కావడం జరుగుతుంది.
7.ఈ గర్భాశయంలో ఏర్పడే గడ్డల వలన, రక్తహీనత, ఆయాసం, గుండె దడ అనేవి వస్తాయి.. ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించడం మర్చిపోవద్దు.

మన శరీరం అనేది వివిధ అవయవాల సమాహారం… మన శరీరంలో ఉండే అన్ని అవయవాలు సరీగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము… ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదో సమయంలో మనకు తెలియకుండానే అనారోగ్య సమస్యల బారిన పడుతుంటాము… ఇలాంటి పరిస్థీతులు ఎదురైనపుడు మానసిక థైర్యాన్ని కోల్పోకుండా, ఆ వ్యాథికి సంబందించిన చికిత్సలు చేయించుకొని, తగిన జాగ్రత్తలు పాటిస్తే మళ్ళి ఆరోగ్యంగా జీవించడం సాధనమే. ఈ విధంగా గర్భాశయాన్ని తొలగించిన తరువాత, ఆహారం విషయంలో, ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

1.పెద్దాపరేషన్ చేయించుకున్న తరువాత 3 లేదా4 వ రోజు నుండి స్నానం చేయవచ్చు. చాలా మంది అపోహపడుతుంటారు.. కుట్లు వేసిన ప్రాంతం తడుస్తుందని కాని తడిసినా ఏమి కాదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి…
2.ముఖ్యంగా కడుపులో ఏ భాగానికి ఆపరేషన్ చేసినా ముందుగా కదిలించే భాగం పేగులు… కాబట్టి అవి తిరిగి మామూలుగా పని చేయడానికి 24 గంటల సమయం పడుతుంది..
3.ఆపరేషన్ చేసిన 24 గంటల తరువాత ఎలాంటి పత్యం పాటించకుండా రోగి తినదగిన, తేలిగ్గా అరగడానికి వీలయిన ఆహారం ఏదైనా తీసుకోవచ్చు…
4.ఆపరేషన్ చేసిన ప్రాంతంలో గాయం త్వరగా మానాలంటే, మాంసకృతులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిసుకోవాలి…చాలా మంది పప్పు తింటే చీము వస్తుంది…అనే సందేహంలో వీటికి దూరంగా ఉంటారు…కాని ఇది నిజం కాదు….అన్న విషయం పై అవగాహన పెంచుకోవాలి.
5.ఆపరేషన్ అయిన 12 గంటల తరువాత లేచి కూర్చుంటే మంచిది…లేకపోతే కాళ్ళలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది…..ఈ విధమైన జాగ్రత్తలు పాటించడం వలన త్వరగా కోలుకుని, ఆరోగ్యంగా ఉండగలుగుతాము.

Leave a Comment