పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎన్ని ప్రకటనలు గుప్పించినా ధూమపానం చేసేవాళ్లలో పెద్దగా మార్పు కనిపించడంలేదు. ఇప్పటి సంస్కృతిలో చిన్న వయసులోనే కొందరు స్మోకింగ్ కు అలవాటు పడుతున్నారు.సిగరెట్ తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్యసమస్యలు చుట్టు ముడుతున్నాయి. ముఖ్యంగా స్మోకింగ్ వల్ల కళ్లకు కూడా హాని కలుగుతుందని.. అనేక అధ్యయనాలు వెల్లడించాయి. పొగాకులో ఉండే నికోటిన్ వయసుతో సంబంధం లేకుండా కాటరాక్ట్, గ్లకోమా వంటి సమస్యలని తీసుకొస్తుంది.
స్మోకింగ్ మన ఆరోగ్యానికి చేసే హాని అంతాయింతాకాదు. స్మోకింగ్‌కు అలవాటు పడటం… ఆ తర్వాత అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకోవడం సాధారణమైపోయింది. సరదా కోసం ముచ్చటపడి చేసుకున్న ఈ అలవాటు క్రమంగా వారిని ఆక్రమించి విడదీయరాని బంధంగా మారిపోతుంది. పొగాకు ఉత్పత్తుల్లో దాదాపు 4వేల రకాల రసాయనాలు ఉంటాయనే విషయం చాలామందికి తెలియదు. వీటిలో క్రోమియం, ఆర్సెనిక్, లెడ్, క్యాడ్‌మియం వంటి ప్రమాదకరమైన లోహాలున్నాయి. ఈ రసాయనాలను ప్రతిరోజూ సిగరెట్ తాగడం వల్ల మన ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపెడతాయి.
స్మోకింగ్ వల్ల ఎలాంటి కంటి సమస్యలు వస్తాయి ?
పొగాకు శరీరంలోని వివిధ అవయవాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని పొగాకు వాడకం చాలా వేగంగా దెబ్బతీస్తుంది. పొగాకులో ఉండే నికోటిన్ వయసుతో సంబంధం లేకుండా కాటరాక్ట్, గ్లకోమా వంటి సమస్యలని తీసుకొస్తుంది. ఇవి క్రమంగా పూర్తి అంధత్వానికి కారణమవుతాయి. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి పొగ తాగే అలవాటు ఉంటే డయాబెటిక్ రెటినోపతి కచ్ఛితంగా వస్తుంది. పొగ తాగే సమయంలో పీల్చివదిలే పొగ ముఖాన్ని పూర్తిగా కప్పేస్తుంది. దీంతో కళ్లు పొడిబారిపోతాయి.పొగతాగేవారి కంట్లో ఉండే పారదర్శకమైన లెన్స్ త్వరగా తన పారదర్శకతను కోల్పోవడం వల్ల త్వరగా వారికి క్యాటరాక్ట్ వస్తుంది. మామూలుగానూ క్యాటరాక్ట్ వచ్చే అవకాశాలున్నా… పొగతాగడం వల్ల అవి రెట్టింపవుతాయి. ఈ అలవాటు కారణంగా మాక్యులార్ డీజనరేషన్ అనే వ్యాధి వచ్చి రెటీనాపై బ్లైండ్స్పాట్స్ ఏర్పడతాయి. పొగతాగే అలవాటు లేనివారితో పోలిస్తే పొగ తాగే వారిలో వినికిడి సమస్యలు వచ్చే అవకాశాలు 75 శాతం ఎక్కువ.
పొగతాగడం కంటి పై చూపే ప్రభావాలా ఏంటి ?
పొగతాగడం వల్ల లంగ్స్, లివర్ మాత్రమే కాదు.. కంటిలోని నరాల వ్యవస్థను కూడా డ్యామేజ్ చేస్తుంది స్మోకింగ్. స్మోకింగ్ వల్ల కళ్లకు కూడా హాని కలుగుతుందని.. అనేక అధ్యయనాలు వెల్లడించాయి. స్మోకింగ్ వల్ల కళ్లు పొడిబారడం, గ్లూకోమా వంటి సమస్యలు ఎదురవుతాయి.ఆప్టిక్ నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల శాశ్వతంగా కంటి చూపును కోల్పోతారు. స్మోకింగ్ చేసేవారు తమ ప్రాణాల పట్లే కాదు ఇతరుల ప్రాణాల విషయంలోనూ చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. తాము స్మోకింగ్ చేయడమే కాకుండా తమ పక్కన ఈ అలవాటు లేనివారికీ పాసివ్ స్మోకింగ్ ద్వారా విషాన్ని అందిస్తున్నారు. ఒక్క సిగరెట్ తాగడం ఒక్కటే కాదు.. గుట్కా, ఖైనీ, జర్దా పాన్ వంటి తీసుకోవడం కూడా తీవ్రమైనవే అని గుర్తుంచుకోవాలి.
పొగాకును ఏ రూపంలో వాడినా సరే అది ప్రాణాంతకంగా మారుతుంది. పొగాకు వాడకం అంటే కేవలం సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటివాటి వినియోగం మాత్రమే కాదు. పొగాకును ధూమపానం రూపంలోనే కాదు, ఖైనీ, గుట్కా ఇలా ఏ రకంగా ఉపయోగించినా ఆరోగ్యానికి ముప్పు తప్పదు. కాబట్టి పొగాకును ఏ రూపంలోనూ వాడకపోవడమే ఆరోగ్యానికి మంచిది.