Heart Attack – గుండెపోటు రాకుండా వుండాలంటే ఇలా చేయండి

By manavaradhi.com

Published on:

Follow Us
Heart Attack

గుండెలో ఏ చిన్న అసౌకర్యం ఏర్పడ్డా… దాన్ని గుండెజబ్బుగా భావించి కంగారు పడిపోతుంటారు చాలా మంది. ఛాతీలో వచ్చే ప్రతి నొప్పి గుండెపోటు కానవసరం లేదు. అలాగే గుండె చుట్టూ ఉండే ఏ భాగాల్లో సమస్య ఉన్నా… అది గుండెపోటుకు దారి తీయవచ్చు. గుండెపోటుకు కారణాలేంటి, నివారణా మార్గాలు ఏంటి..?

వాయిస్ : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువ మందిని బాధపెడుతున్న సమస్యల్లో గుండె సమస్యలే అధికంగా ఉన్నాయి. ఈ సమస్యలతో బాధపడుతున్న వారిలో వృద్ధుల కంటే యువతే ఎక్కువ. గుండె గనుక ఏదైనా వ్యాధి భారినపడితే అటువంటి సమయంలో శరీరంలోని మిగతా భాగాలకు అందవలసిన రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీంతో వివిధరకాల అవయవాలు పనితనం మందగించి చతికిలపడతాయి. కాబట్టి గుండె జబ్బుల బారినపడకుండా నివారించుకోవటమే ఆరోగ్యం. ఛాతీలో బరువుగా, మంటగానూ ఉండటం, ఊపిరి ఆడనట్లు అనిపించడం, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం, మాట తడబడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.

గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?
గుండె జబ్బులు తలెత్తేందుకు ఒత్తిడి అనేది ప్రధాన కారణంగా వ్యవహరిస్తుందని ప్రపంచవ్యాప్తంగా కార్డియాలజిస్ట్ లు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్ ను పాటించే వాళ్ళలో కూడా ఒత్తిడి వలన గుండె జబ్బుల సమస్య కనిపించే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. కాబట్టి, ఒత్తిడిని మేనేజ్ చేసుకునే విధానాలను తెలుసుకోవాలి. యోగా లేదా మెడిటేషన్ ను సాధన చేయాలి. తద్వారా, ప్రాణాంతకమైన గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. రోజులో కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చెయ్యాలి. ఇది గుండె జబ్బులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. పెరిగే బరువు గుండె మీద భారాన్ని పెంచుతుందనే విషయాన్ని మరిచిపోవద్దు. కార్డియాలజిస్ట్ లు స్మోకింగ్ కు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, స్మోకింగ్ వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. గుండె జబ్బులు పెరుగుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. కాబట్టి, ఈ అలవాటుకు దూరంగా ఉండటం మంచిది. వంశపారంపర్యంగా గుండె జబ్బులు ఉంటే ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. 30 ఏళ్ళు దాటినప్పటి నుంచి రెండేళ్ళకోసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి.

మన గుండె కోసం మనం కాసేపు సమయం కేటాయించడం ఎంత అవసరమో గుర్తించండి. క్రమపద్ధతిలో జీవించడం అలవాటు చేసుకుంటే గుండె సంబంధిత సమస్యలు లేకుండా హాయిగా జీవించవచ్చు.

Leave a Comment