ఆరోగ్యం అనేది ఆహరం, వ్యాయామాల సరైన మిశ్రమం. చాలా మంది అధిక బరువు తగ్గించుకునేందుకు, శరీర ఆకృతిని మార్చుకునేందుకు నిత్యం వ్యాయామం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం జిమ్‌లకు వెళ్తూ చెమటోడ్చుతున్నారు. కానీ వ్యాయామం చేసే ముందు తర్వాత ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వ్యాయామం చేసే వారు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
వాయిస్ : శరీరాన్ని తీర్చిదిద్దడంలో వ్యాయామం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొన్నేమో ఆరోగ్యకరమైన శరీరం కోసమైతే, మరి కొన్ని రోగాలు తగ్గేందుకు. యోగా లాంటి కొన్ని వ్యాయామాలు మానసిక ఆరోగ్యం కోసం చేసేవి. అయితే ఉదయం వ్యాయామం చేసే సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది చాలా మందికి తెలియదు. వ్యాయామం చేస్తున్నాం కదా అని లైట్ ఫుడ్ తీసుకుంటుంటారు. అలా లైట్ పుడ్ తీసుకోవడం వల్ల అలసిపోయిన శరీరానికి శక్తి అందదు. అందుకని శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాకుండా ఆరోగ్యాన్ని పంచే పిండిపదార్థాలు తీసుకోవడం చాలా ఉత్తమం. వర్కౌట్ చేస్తూ ఏది పడితే అది తినకూడదు. సులభంగా జీర్ణమయ్యే కూరగాయలు తీసుకోవడం మంచిది.. ఫ్యాట్ ఫుడ్ శరీరానికి అవసరమే. ఐతే యాక్టివ్ గా ఉండాలనుకునే వారు మాత్రం హై ఫ్యాట్ పుడ్ కు దూరంగా ఉండాలి.
వ్యాయామానికి ముందు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి ?
సరైన సమయంలో సరైన ఆహారం తీసుకుంటేనే చేసిన వ్యాయామానికి ఫలితం దక్కుతుంది. ఉదయం వేళ వ్యాయామానికి ముందు పిండిపదార్థాలను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని కొద్దిమోతాదులో పెరిగి శక్తిని అందిస్తాయి. శరీరం అలసిపోకుండా కావాల్సిన పోషకాలను లభిస్తాయి. వ్యాయామం చేయడానికి ముందు సంక్లిష్ఠ పిండిపదార్థాలు తీసుకొంటే తక్కువ శక్తి, ఫైబర్ ఇతర పోషకాలు ఉంటాయి కనుక శరీరంలో కొవ్వులు ఎక్కువగా నిల్వ ఉండవు.
పిండి పదార్థాలు, ప్రొటీన్ కలగలిసిన డైట్ మెనూ రూపొందించుకుంటే వ్యాయామం చేసే వారు హెల్దీగా, ఫిట్ గా ఉండవచ్చు. ఎక్సర్ సైజ్ చేసే ముందు అరటి పండు, నట్స్, ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవడం మంచిది. ఐతే వ్యాయామానికి వెళ్లే గంట ముందు వరకు మాత్రమే ఇలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలి.
వ్యాయామం తర్వాత ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ?
ఎనర్జీ డ్రింక్స్ కూడా శరీరానికి హై కేలరీలు అందించే పదార్థాలే. కాబట్టి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి .. వర్కౌట్లు చేసే వారికి సమతుల ఆహారం ఇంధనం లాంటిది. చాలామంది వ్యాయామం చేసిన తర్వాత పాలు, గుడ్లు, ఉడకబెట్టిన లేదా పచ్చి కాయకూరలు ఆరగిస్తుంటారు. కానీ న్యూట్రిషన్లు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఎవరైనా అర్థగంటపాటు వ్యాయామం చేస్తే తిరిగి శక్తిని పుంజుకోవాలంటే ఖచ్చితంగా మంచి పోషకాహారం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, వ్యాయామం ద్వారా కోల్పోయిన శక్తి తిరిగి పొందేందుకు పిండిపదార్థాలు, కొవ్వు పదార్థాలు అందేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.
పండ్ల ముక్కలను పెరుగుతో కలిపి తీసుకున్నా మంచిదేనంటున్నారు. ఈ తరహా ఆహారం తీసుకున్నట్టయితే తక్షణ శక్తి శరీరానికి అందుతుంది. అన్నిటికంటే ముందు వ్యాయామం తర్వాత, వ్యాయామానికి ముందు, వ్యాయామం మధ్యలో తరచుగా నీరు తీసుకోవడం మంచిది ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండొచ్చని వైద్యులతో పాటు న్యూట్రిషన్లు సలహా ఇస్తున్నారు.
తినడానికి, వ్యాయామానికి మధ్యలో తగిన విరామం లేకపోతే వ్యాయామం సరిగ్గా చేయలేం, తిన్నదీ సరిగ్గా అరగదు. అందుకే ఈ రెండింటికీ మధ్య కనీసం 60 నుంచి 90 నిమిషాల వ్యవధి తప్పనిసరి.