Brain Health : జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏంచేయాలి ?

By manavaradhi.com

Updated on:

Follow Us
Memory power increase tips in telugu

మన శరీరంలో బ్రెయిన్ అత్యంత ముఖ్యమైన అవయవమని మనందరికీ తెలిసిన విషయమే. మన మెదడు సరిగా పనిచేసినప్పుడే మన జ్ఞాపకశక్తి సరిగా ఉంటుంది. శారీరక శ్రమతోపాటు మానసిన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. కానీ ప్రస్తుత ఆధునిక యుగంలో మతిమరుపు ఒక పెద్ద సమస్యగా మారింది. మరి దీన్ని అధిగమిస్తూ జ్ఞాపకశక్తి పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏ వ్యక్తి అయినా మరింత చురుగ్గా ముందుకు దూసుకుపోవాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు మానసికంగా దృఢంగా ఉండాలి. అలా ఉండాలంటే మెదడు చురుగ్గా పనిచేయాలి. మెదడు నుండి శరీరంలోని వివిధ అవయవాలకు నాడులు కలుపబడి ఉంటాయి. మెదడు జ్ఞానేంద్రియాలన్నింటికి ముఖ్యమైన కేంద్రం. మన మెదడులో దాదాపు 90 బిలియన్ల వరకు న్యూరాన్లు ఉంటాయి. ఇవి కంటిన్యూగా సిగ్నల్స్ పంపిస్తుండటం వల్లే మనం హాయిగా జీవించగలుగుతున్నాము. మెదడు చెప్పినవిధంగానే మన శరీరం నడుచుకుంటుంది. కాబట్టి మెదడు చురుగ్గా ఉన్నంత కాలం జ్ఞాపకశక్తి చురుకుగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరగాలంటే ఉండాలంటే బ్రెయిన్ డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి. అందుకు కొన్ని చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి.

జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణాలు ఏంటి ?

వయసు మళ్లే కొద్దీ చాలామందిలో మెదడు పనితీరు మందగిస్తుంటుంది. దీంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే.. శరీరానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. కలత నిద్ర, మగతగా నిద్రించడం వంటివి కాకుండా పూర్తిస్థాయి గాఢనిద్ర ఉండాలి. మొత్తంగా రోజుకు కనీసం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. తగినంత నిద్ర లేకపోతే దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల శరీరంలో రక్తనాళాలు దెబ్బతినడం, హానికర రసాయనాలు చేరడంతో మెదడు పనితీరు దెబ్బతింటుంది. అందువల్ల వీటికి దూరంగా ఉండాలి.

కాలుష్యం కూడా మన మెదడుపై ప్రభావాన్ని చూపెడుతుంది. మనం పీల్చుకునే ఆక్సిజన్ లో ఎక్కువ శాతం మన మెదడు వినియోగించుకుంటుంది. కలుషిత గాలి పీల్చడం వల్ల మెదడు ఆక్సిజన్ సరఫరా తగ్గి, దాంతో మెదడు సామర్థ్యం తగ్గుతుంది. అలాగే ఎక్కువగా చక్కెర కలిగిన పదార్థాలు తీసుకోవడం కూడా మెదడు అభివృద్ధిపై ప్రభావితం చూపుతుంది. అతిగా తినడం వల్ల మెదడు శక్తి తగ్గుదలకు దారితీస్తుంది. అది జ్ఞాపకశక్తి క్షీణత కారణమవుతుంది.

సరైన ఆహారాలు మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఏకాగ్రత పెరగడానికి, జ్ఞాపకశక్తి మెరుగవడానికి సహాయపడతాయి. మెదడును షార్ప్ గా ఉంచి ఏకాగ్రతను పెంచే ఆహారాలను తీసుకోవాలి. ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అల్పాహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు రోజువారీ కార్యక్రమాలు చురుగ్గా చేసుకోవచ్చు. మెదడు ఆరోగ్యం మెరుగవ్వాలంటే ఒమేగా 3 ఆమ్లాలుండే చేపలను తినాలి. వేరుశనగ గింజలు, ఆక్రోట్, బాదం లాంటి నట్స్ నిద్రలేమిని పోగొట్టి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ప్రతిరోజు మెదడులోకి అనవసరపు ఆలోచనలను చొప్పించకుండా ప్రశాంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మన మెదడులోకి మంచి ఆలోచనలు చేరాలంటే సరైన వ్యాయామం, ధ్యానం, నడక కొంత సమయం పాటు చేయడం తప్పనిసరి. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండటం ద్వారా మెదడు చురుగ్గా ఉంటుంది. సంగీతం వినడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. మెదడుకు పదును పెట్టే పనులు, ఆలోచనలతోనే అది చురుకుగా, సమర్థంగా తయారవుతుంది. అందుకే మన మెదడుకు వ్యాయామం అవసరం అవసరం అని గుర్తుంచుకోవాలి.

జ్ఞాపకశక్తి మెరుగుపడాలంటే జీవనశైలిలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి. అప్పుడు మెదడు యాక్టివ్ గా, హెల్తీగా ఉంటుంది. సరైన ఆహారాలు.. మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఏకాగ్రత పెరగడానికి, జ్ఞాపకశక్తి మెరుగవడానికి సహాయపడతాయి.

Leave a Comment