మన శరీరంలో జరిగే పలు జీవక్రియలలో విటమిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి లోపం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు చట్టుముడతాయి. ” సి” విటమిన్ ను శరీరం తనంతట తాను ఉత్పత్తి చేసుకోలేదు. అయితే ఈ విటమిన్ సి తగ్గితే చాలా ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.
ఆహారం ద్వారా మనిషి శరీరంలోకి అవసరమైన విటమిన్లు చేరుతాయి. ప్రస్తుతం మనం రెగ్యులర్ గా తీసుకొనే డైట్ లో విటమిన్ సి ఆహారాలు ఒకటి. ఇది శరీరంలో మంచి సెల్యులార్ గ్రోత్ కు మరియు బ్లడ్ సర్క్యులర్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది . ఇది బాడీ హెల్త్ ను మెయింటైన్ చేస్తుంది , టిష్యురిపేర్ గాయలను మాన్పడం మరియు కొల్లాజెన్ ప్రొడక్షన్ కు ఉపయోగపడుతుంది.
విటమిన్ సి ను శరీరం తనంతట తాను ఉత్పత్తి చేసుకోలేదు, అందుకనే విటమిన్ సి లోపం చాలా సాధారణమైనది. విటమిన్ సి లోపం యొక్క ముఖ్య కారణాలలో ఒకటి స్కర్వి. ఈ స్థితిలో చాలా అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది. ఈ వ్యాధి ఎముకల, కండరాల బలంపై ప్రభావం చూపి, రోగ నిరోధక వ్యవస్థ పట్టుతప్పేలా చేస్తుంది. విటమిన్ సి లోపం వల్ల అలసట కూడా ఉంటుంది. అంతేకాదు దంతక్షయం, దంతవాపులు, జాయిట్ పెయిన్ , హెయిర్ మరియు స్కిన్ స్ట్రక్చర్ మార్చడం వంటి లక్షణాలు కనబడుతాయి. అంతే కాదు విటమిన్ సి లోపం వల్ల మరికొన్ని వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
విటమిన్ C యాంటీ ఆక్సిడెంట్ ఇది శరీరంలో ఫ్రీరాడికల్ డ్యామేజ్ నివారిస్తుంది. విటమిన్ సి లోపం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి, క్యాన్సర్ ఎఫెక్టివ్ గా నివారించడానికి విటమిన్ సి ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి . ముఖ్యంగా స్కిన్, మరియు బ్రెస్ట్ క్యాన్సర్ నివారిస్తుంది. శరీరంలో విటమిన్ సి లోపం వల్ల శ్వాససంబంధిత సమస్యలు ఎదురవుతాయి . సిట్రస్ ఫ్రూట్ ను ఎక్కువగా చేర్చుకోవడం వల్ల క్రోనిక్ డిసీజ్ ఆస్తమాను నివారిస్తుంది.
విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచే సెల్స్ ను న్యూట్రోఫిల్స్, లింపోసైట్స్ మరియు బ్లడ్ స్ట్రెమ్ యాంటీబాడీస్ సర్క్యులేషన్ పెంచుతుంది. విటమిన్ సి సరిగా అందనప్పుడు శరీరం ఐరన్ గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. గాయాలు త్వరగా మానవు. రోగనిరోధక శక్తి పెరగడానికి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్ సి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి విటిమన్ సి ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
విటమిన్ సి నీటిలో కరిగే ఒక విటమిన్. ఇది శరీరం యొక్క కనెక్టివ్ కణజాలల ఆరోగ్యాన్ని సంరక్షించటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి లోపం వల్ల మరో సమస్య చిగుళ్ల నుండి రక్తస్రావం అవుతుంది . విటమిన్ సి ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి పరిష్కారం పొందవచ్చు . విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ స్ట్రాబెర్రీ, సిట్రస్, టొమాటో, క్యారెట్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం చిగుళ్ళ నుండి కారే రక్త స్రావాన్ని అరికట్టవచ్చు.
జామకాయల్లో విటమిన్ C అధికంగా ఉంటుంది. నిమ్మ జాతి పండ్లలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లలో తక్కువ కాలరీలు మరియు సున్నా కొలెస్ట్రాల్ ఉంటాయి. తాజా కొత్తిమీరలో విటమిన్ సీ ఉంటుంది. అనాసపండు, మామిడి పండ్లలో కూడా విటమిన్ సీ అధికంగా లభిస్తుంది. పెద్దల నుంచి పిల్లల వరకు విటమిన్ల కొరత లేకుండా చూసుకొంటే అరోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు అంటున్నారు.
విటమిన్ల కొరతతో వ్యాధులు రావడం తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో విటమిన్ సి లోపం జరగకుండా ఉండాలంటే విటమిన్ సి నేచురల్ ఫుడ్స్ మరియు డైటరీ సప్లిమెంట్ తీసుకోవాలి. మాత్రలను వేసుకోవటం కన్నా ఆహారం ద్వారానే విటమిన్ C సీ లభించేలా చూసుకోవటం మేలని సూచిస్తున్నారు.