ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ తీవ్రమైన వ్యాధుల భారీన పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు.. తీసుకునే ఆహారపదార్థాలు.. జీవనవిధానంలో మార్పులు. అయితే ముఖ్యంగా మనం ఉపయోగించే వంటనూనె వలన కూడా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆలివ్ నూనె ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు.
ఆలివ్ నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆలివ్ నూనెలో విటమిన్-ఇ, విటమిన్ కె, ఒమేగా-3,6 కొవ్వు ఆమ్లాలు, ఐరన్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. గుండెకు కూడా మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ గుండె యొక్క వృద్ధాప్యాన్ని తగ్గించగలదని కొన్ని అధ్యాయనాల్లో తేలింది. ధమనుల పనితీరుకు అడ్డంగా నిర్మితమైన కొవ్వును తొలగించి, ధమనుల యొక్క రక్త ప్రసరణలను మరింతగా మెరుగుపరచి, గుండెపోటును మరియు గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.
ఆలివ్ ఆయిల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందిస్తుంది. ఆహారంలో ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల క్యాన్సర్‌ను నివారించవచ్చు. ఇది శరీరంలో వృద్ధి చెందుతున్న క్యాన్సర్ పెరుగుదలను మందగించేలా చేస్తుంది, ముఖ్యంగా ఇది పెద్ద ప్రేగు మరియు రొమ్ము క్యాన్సర్‌ను నివారించే ప్రధానమైన ఏజెంట్‌గా పనిచేస్తుంది.
ఆలివ్ నూనెను ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా చక్కగా సహాయపడుతుంది. ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల, టైప్ -2 మధుమేహం వల్ల రక్తంలో కలిగే గ్లూకోస్ స్థాయిలను తగ్గించడమే కాకుండా, ఇన్సులిన్ యొక్క సున్నితత్వాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది. ఆలివ్ ఆయిల్ యాంటిడిప్రెసెంట్‌గా పనిచేస్తుంది మరియు సెరోటోనిన్ యొక్క స్థాయిని పెంచుతుంది. సెరోటోనిన్ అనేది…ఆనందాన్ని కలిగించే హార్మోన్‌గా కూడా పిలుస్తారు… అలాగే ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది.
ఆలివ్ నూనెలో ఒమేగా-3 మరియు ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉండటం వల్ల, మెదడు యొక్క పనితీరును ప్రోత్సహిస్తూ, జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా చేస్తుంది. ఇది అల్జీమర్స్ వ్యాధిని కూడా నిరోధిస్తుంది.ఈ ఆలివ్ ఆయిల్, జుట్టుకు కావలసిన పోషణను అందించి, జుట్టును తేమగా ఉంచుతూ, చుండ్రును పోగొట్టి, జుట్టును మరింతగా బలపరుస్తుంది.ఈ నూనెను జుట్టు మొదళ్ల నుండి మూలాల వరకు అవసరమైన అన్ని పోషకాలను అందించే అసంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగి ఉండటం వల్ల మీ జుట్టు మరింత వేగంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
ఆలివ్ ఆయిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కవ కలిగి ఉన్నాయి. ఈ నూనెను నొప్పుల నుండి ఉపశమనాన్ని పొందేందుకు ఉపయోగిస్తారు. కీళ్ల వాపులు, బాగా వాయడం మరియు ఇతర శారీరక నొప్పుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది కీళ్లనొప్పులను సడలిస్తుంది, బలమైన వాపులు కలిగిన ప్రదేశానికి చైతన్యాన్ని కలుగజేసి మెరుగుపరుస్తుంది. ఆలివ్ నూనెను వాడటం వల్ల ఆర్థరైటిస్‌లో వంటి రుగ్మతలను తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్‌ను అనేక బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగిస్తారు.
ఆలివ్ నూనెలో ఫెనోలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉన్నాయి, ఇది వ్యాధికారక బాక్టీరియాల యొక్క పెరుగుదలను అడ్డుకుంటుంది. ఈ నూనెలో ఒలేయిరొప్రిన్ అనే మూలాకము యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఫంగల్ మరియు యాంటీ-వైరల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ను నివారించడంలో కూడా ఆలివ్ నూనె ఉపయోగపడుతుంది. ఆలివ్ నూనెలో విటమిన్ E మరియు యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతూ, పునరుజ్జీవనాన్ని ప్రసాదించి, చర్మానికి కావలసిన పోషణను అందిస్తుంది. అంతేకాదు చర్మం మీద ఏప్పడే ముడుతలను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను కలుగజేసే కారకాలతో పోరాడుతుంది మరియు మచ్చలను – మొటిమలను తేలికగా తొలగిస్తుంది.
ఆలివ్ ఆయిల్ చర్మానికి చైతన్యపరచి, మృదువుగా మార్చి, చర్మాన్ని మరింత కాంతివంతంగా చేస్తుంది. ఇది పొడి పెదవులు మరియు పగిలిపోయిన మడాలకు కూడా చికిత్సను అందించగలదు. ఇది గోళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని మేకప్ రిమూవర్గాను మరియు కాంతిని ప్రసరించే లిక్విడ్గాను కూడా ఉపయోగిస్తారు.
ఆలివ్ నూనె మన ఆరోగ్యాన్ని మరియు అందాన్ని పెంపొందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంతకంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కావలసింది ఏముటుంది. మీరు కూడా ఆహారంలో ఈ నూనెను వినియోగించుకోవడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.