Muskmelon : కర్బూజ పండులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా?

By manavaradhi.com

Published on:

Follow Us
Kharbuja Benefits

ఖర్భూజా పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల నుండి, ఎండ వేడి నుండి ఖర్బూజా మనల్ని కాపాడుతుంది. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. వేసవి కాలంలో ఎక్కవగా ఈ పండ్లు మార్కెట్లో లభిస్తాయి. వీటిలో అధిక శాతం నీరు ఉంటుంది. వేసవి కాలంలో శరీర చల్లదనానికి, శరీరంలో నీటిశాతాన్ని పెంచటానికి దోహదపడుతుంది. మంచి సువాసనతోపాటు ఈ పండు ఎంతో రుచిని కలిగి ఉంటుంది.

పచ్చగా మిలమిలలాడుతూ ఉండే కర్బూజ ఏడాది మొత్తం లభిస్తుంది. ఈ పండులో దాదాపు 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇది దప్పిక తీర్చడంతోపాటు తక్షణ శక్తిని అందిస్తుంది. అంతేకాదు శరీరంలోని వేడినీ చల్లబరుస్తుంది.ఈ పండులో విటమిన్‌-ఎ, సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌-ఎతో పాటు లైకోపిన్‌ కూడా అధిక మోతాదులోనే ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీర కణాల ఆరోగ్యంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. దీన్ని తరచూ తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అజీర్తి, మూత్ర సంబంధ, ఎగ్జిమా లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. 150 గ్రాముల పండ్ల ముక్కల నుంచి మన శరీరానికి కావాల్సిన సగం విటమిన్‌-సి అందుతుంది. అంటే రోజులో 300 గ్రా. పండ్ల ముక్కలు తీసుకుంటే మనకు కావాల్సిన విటమిన్‌-సి దొరుకుతుందన్నమాట.

ఖర్బూజా పండ్ల ముక్కల నుంచి తక్కువ కెలొరీలు అందుతాయి. కాబట్టి దీన్ని అల్పాహారంగానూ తీసుకోవచ్చు. దీనిలోని పీచు పొట్ట నిండిన భావనను కలిగించి ఆకలిగా అనిపించదు. దీని విత్తనాల్లోని పొటాషియం కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీన్ని ఎంచుకుంటే సరిపోతుంది.

సాధారణంగా ఖర్బూజా పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా వేసవికాలంలో ఉష్ణోగ్రత నుంచి ఎండ తాపం నుంచి శరీరాన్ని కాపాడటానికి ఈ పండు చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అధిక శాతం నీటిని కలిగి ఉండడమే కాకుండా ఎక్కువ పోషకాలు కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ పండు తినడానికి మంచి రుచితో పాటు సుగంధ భరితమైన వాసనను కూడా వెదజల్లుతుంది. ఖర్జూజా తినటం వల్ల వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా చూసుకోవచ్చు. ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ప్రీరాడికల్స్ పై దాడి చేస్తాయి. చర్మాన్ని రక్షించటంలో ఉపయోగపడతాయి.

ఖర్భూజాలో పీచు పదార్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల శరీరంలోని వ్యర్ధాలు తేలికగా బయటకు నెట్టివేయబడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఖర్భూజాలో ఉండే విటమిన్ ఎ కంటి చూపు మెరుగయ్యేందుకు ఉపకరిస్తుంది. శరీరంలో మ్యూకస్ పొరలను సరైన స్ధితిలో ఉంచేందుకు ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ దోహదపడతాయి. అధిక బరువుని తగ్గించటానికి ఇందులో ఉండే పీచుపదార్ధం పనికొస్తుంది.

ఖర్బూజ పండులో ఎక్కువ శాతం బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గిస్తుంది. ఖర్బూజ పండులో అధిక మోతాదులో పొటాషియం ఉండడం వలన గుండెకు మంచి న్యూట్రియన్స్‌ని అందజేస్తుంది. ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. గర్భిణుల్లో బిడ్డ ఎదుగుదలకు ఖర్భూజా ఎంతో మేలు చేస్తుంది. ఖర్బూజా లో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో చాలా చక్కగా పని చేస్తుందని చెప్పవచ్చు.

ఖర్భూజా ను తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఈ పండులోని విటమిన్‌-సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తెల్ల రక్తకణాల వృద్ధికి తోడ్పడటమే కాకుండా ఇన్‌ఫెక్షన్లను దరి చేరనివ్వదు.ఈ పండులో సోడియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఈ మూలకం సమృద్ధిగా అందుతుంది. దీంతోపాటు మిగతా మూలకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ పండును తరచూ తీసుకుంటే మేలు.

వేసవిలో మండే ఎండల్లో కాసేపు తిరిగినా.. చాలా అలసిపోతాం. ఎన్ని శీతల పానీయాలు తాగినా దాహం తీరదు. ఇలాంటప్పుడు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే.. మంచి ఫలితం లభిస్తుంది. అలాగే రోగనిరోధక వ్యవస్ధను బలోపేతం చేయటంలో దీనిని మించింది లేదని చెప్పాలి. కాబట్టి మీరుకూడా నేటి నుంచి ఖర్భూజాను ఆహారంలో భాగం చేసుకోండి.

Leave a Comment